revenue didvision
-
కొత్తగా భీమవరం పోలీస్ సబ్‌డివిజన్
నరసాపురం: జిల్లాల పునర్విభజనలో భాగంగా భీమవరం కేంద్రంగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసు శాఖలో మార్పులు జరుగనున్నాయి. కొత్తగా భీమవరం పోలీస్ సబ్‌డివిజన్‌ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన జిల్లాలో ఇప్పటికే ఉన్న నరసాపురం పోలీస్ సబ్‌డివిజన్‌తో పాటు భీమవరం సబ్ డివిజన్ ఏర్పాటుకానుంది. దీంతో పోలీసు శాఖలో పాలనపరమైన ఇబ్బందులు తొలగుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఓ రెవెన్యూ మండలంలోని గ్రామం మరో మండలంలోని పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంది. దీనివల్ల గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని మార్చాలనే డిమాండ్ ఏళ్ల తరబడి ఉన్నా పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొ త్తగా పోలీస్ సబ్‌డివిజన్ ఏర్పాటు చేయనుండటంతో స్టేషన్ల పరిధిని సవరించే ఆలోచన ఉందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. పక్క మండలం స్టేషన్ పరిధిలో.. మండలంలోని ఓ గ్రామంలో సమస్య వస్తే పక్క మండలంలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి నరసాపురం సబ్‌డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో ఉంది. ముఖ్యంగా నరసాపురం రూరల్, మొగల్తూరు, పాలకొల్లు రూరల్, భీమవరం రూరల్ ప్రాంతాల పోలీస్స్టేషన్ల పరిధిలో ఇలాంటి ఇబ్బందులతో సిబ్బంది సతమతమవుతు న్నారు. ప్రజలూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. నరసాపురం రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మత్స్య పురి, తుందుర్రు గ్రామాలు ఉన్నాయి. ఇవి రెండు నరసాపురం మండల పరిధిలోకి రావు. తుందుర్రు గ్రామం భీమవరం రూరల్, మత్స్యపురి గ్రామం వీరవాసరం మండలాలకు చెందినవి. నరసాపురం రూరల్ మండలంలోని ఎల్బీచర్ల, పస లదీవి, తూర్పుతాళ్లు, పెదమైనవానిలంక గ్రామాలు మొగల్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్నాయి. భీమవరం రూరల్ మండలానికి చెందిన వెంప గ్రామం ప్రస్తుతం మొగల్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంది. తణుకు మండలానికి చెందిన రెండు గ్రామాలు ఇరగవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్నాయి. పాలకొల్లు రూరల్ మండలంలోని అడవిపాలెం గ్రామం పోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంది. సబ్‌డివిజన్ ఎలా ఉండవచ్చంటే.. ప్రస్తుతం నరసాపురం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో 19 పోలీస్స్టేషన్లు, ఆరు సర్కిళ్లు ఉన్నాయి. నరసాపురం పట్టణం, నరసాపురం రూరల్, మొగల్తూరు, పాలకొల్లు, పాలకొల్లు రూరల్, ఆచంట, పోడూరు, యలమంచిలి, వీరవాసరం, పెనుగొండ, ఇరగవరం, పెనుమంట్ర, భీమవరం–1 టౌన్, భీమవరం–2 టౌన్, భీమవరం రూరల్, ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు పోలీస్స్టేషన్లు పనిచేస్తున్నాయి. భీమవరం పోలీసు సబ్ డివిజన్ కొత్తగా ఏర్పాటు చేస్తే సగం మండలాలు అటు, సగం మండలాలు ఇటు మారవచ్చు. భౌగోళిక అంశాలను పరిగణనలోకి తీసుకుని మండలాల విలీనం జరగనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇబ్బందులు లేకుండా నిర్ణయం గతంలో ఉన్న ఇబ్బందులు, సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఓ మండలంలో ఊరు, మరో మండల పోలీసుస్టేషన్ పరిధిలో ఉండటం నరసాపురం డివిజన్లో చాలాచోట్ల ఉంది. పోలీసుల విధుల నిర్వహణలో ఇది పెద్ద ఇబ్బంది. కొత్తగా భీమవరం పోలీసు సబ్‌డివిజన్ ఏర్పాటు సమయంలో ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోవచ్చు. – వి.వీరాంజనేయరెడ్డి, నరసాపురం డీఎస్పీ నరసాపురం రెవెన్యూ డివిజన్ నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు, పోడూరు, యలమంచిలి, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, తణుకు, ఇరగవరం మండలాలు భీమవరం రెవెన్యూ డివిజన్ భీమవరం, వీరవాసరం, ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, అత్తిలి మండలాలు -
డీలర్ల పరీక్ష ప్రశ్నాపత్రం లీక్?
కడప సెవెన్‌రోడ్స్: కడప రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ చౌకదుకాణాల భర్తీ కోసం శుక్రవారం కడపలో నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయిం దంటున్న అంశం తీవ్ర కలకలం రేపుతోంది. రేషన్ షాపులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టడం కోసం అధికారులే ఈ నిర్వాకానికి పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఎఫ్ పీ షాపుల భర్తీని అడ్డుకునేందుకు కొందరు చేస్తున్న పన్నాగమే తప్ప.. ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అధికారులు అంటున్నారు. గతంలో రాత పరీక్షకు 60, ఇంటర్వ్యూకు 40 మార్కులు ఉండేవి. రాత పరీక్షలో అంతంత మాత్రం మార్కులు వచ్చినా ఇంట ర్వ్యూలో అధిక మార్కులు వేసి తమకు కావా ల్సిన వ్యక్తులకు ఎఫ్ పీ షాపులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ సారి రాత పరీక్షలకు 80, ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించారు. ఇందువల్ల నిజమైన ప్రతిభావంతులకే ఎఫ్పీ షాపులు వస్తాయని భావించారు. కాగా ఈసారి ఏకంగా ప్రశ్నాపత్రాన్నే లీక్ చేసి అస్మదీయులకు షాపులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. కడప రెవెన్యూ డివిజన్లో 275 ఎఫ్పీ షాపుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. కాగా 49 షాపులకు దరఖాస్తులే రాలేదు. ఇక రాత పరీక్ష కోసం 864 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 725 మంది హాజరయ్యారు. రాత పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు జీఓ ఎంఎస్ నంబర్: 4 ప్రకారం 1:5 నిష్పత్తిలో సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రశ్నాపత్రం లీకైంýదంటూ ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. పరీక్షలను రద్దు చేయాలి: టీడీపీ నేతల డిమాండ్ చౌక దుకాణాల భర్తీకోసం శుక్రవారం నిర్వహించిన రాత పరీక్షలను రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు వీణా అజయ్‌కుమార్, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ విశ్వనాథరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం స్థానిక బాలాజీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాత పరీక్షలకు ముందుగానే పేపర్ లీక్ అయిందని ఆరోపించారు. అందులో భాగంగా శుక్రవారం జరిగిన పరీక్షల్లో అభ్యర్థులకు ప్రశ్నాపత్రంలోనే జవాబులను టైప్ చేసి పంపించడం జరిగిందన్నారు. పరీక్ష ప్రారంభమైన అరగంటకే ప్రశ్నాపత్రం బయటికి రావడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ పరీక్షలను రద్దు చేసి అదే అభ్యర్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ప్రశ్నాపత్రం లీకేజీకి కారకులైన అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో జనార్దన్, బ్రహ్మ, శ్రీను పాల్గొన్నారు. ప్రశ్నాపత్రం కాదు.. కీ: ఆర్డీఓ ఈ అంశంపై ఆర్డీఓ దేవేందర్‌రెడ్డిని వివరణ కోరగా.. అది ప్రశ్నాపత్రం కాదని.. కీ అని తెలిపారు. కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న ఎఫ్పీ షాపుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రతిసారి కొందరు వ్యక్తులు ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన చెప్పారు. ఈసారి కూడా హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని పేర్కొన్నారు. అయితే తాము కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంతో.. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు వెలువరించిందన్నారు. దీంతో షాపుల భర్తీ ప్రక్రియకు లైన్ క్లియర్ కావడంతో కొందరు జీర్ణించుకోలేక పోయారన్నారు. ప్రశ్నాపత్రాన్ని పౌరసరఫరాల అధికారులు రూపొందించి తొమ్మిది సీల్డ్ కవర్లలో పరీక్షకు అరగంట ముందు తమకు పంపారని తెలిపారు. అందరి సమక్షంలో తొమ్మిది సీల్డ్ కవర్లను తెరిచి ప్రశ్నాపత్రాలను అభ్యర్థులకు పంపిణీ చేశామన్నారు. అన్నీ పారదర్శకంగా ఉండేందుకు వీడియో కూడా తీయించామన్నారు. ఈ విషయంలో అవకతవకలు జరిగే అవకాశమే లేదని స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులకు సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. -
త్వరలో తహసీల్దార్ల బదిలీలు !
క్లీన్చిట్ ఉన్నవారికి మంచి స్థానాలు... అధికారుల పనితీరుపై సమాచార సేకరణ పూర్తి మరిపెడ ఏసీబీ కేసు నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు హన్మకొండ అర్బన్ : జిల్లాలో భారీగా తహసీల్దార్ల బదిలీలు జరుగనున్నట్లు సమాచారం. ఒకరిద్దరు కాదు.. ఏకంగా అన్ని రెవెన్యూ డివి జన్ల పరిధిల్లోనూ మార్పులు జరిగే అవకాశాలున్నాయి. ఈసారి బదిలీల్లో రాజకీయ జోక్యం లే కుండా పూర్తిగా శాఖాపరంగానే చేపట్టాలని ఉ న్నతాధికారులు నిర్ణయించినట్టు సమాచారం. మరిపెడ కేసు నేపథ్యంలో.. వారం కిత్రం మరిపెడ తహసీల్దార్, ఆర్ఐ అవినీతి ఆరోపణలతో ఏసీబీకి పట్టుబడిన నేపథ్యంలో తహసీల్దార్ల వ్యవహారంలో ఉన్నతాధికారులు సమగ్ర సమాచారం సేకరించి నట్లు విశ్వసనీయ సమాచారం. ఆరోపణలు ఉన్నవారిపై ఈసారి కఠువుగా వ్యవహ రిస్తారనే ప్రచా రం సాగుతోంది. అలాంటి వారికి ప్రస్తుత బదిలీల్లో ప్రాధాన్యత లేని పోస్టింగ్‌లకు పంపిస్తారని తెలుస్తోంది. వీటితోపాటు కరీంనగర్ జిల్లాకు బదిలీ అయిన హన్మకొండ తహసీల్దార్ రాజ్‌కుమార్ తనను రిలీవ్ చేయాలని అధికారులను కోరుతుండటంతో హన్మకొండకు కూ డా అన్ని విధాలా యోగ్యుల కోసం అధికారు లు అన్వేషిస్తున్నారని సమాచారం. అయితే ఇప్పటికే ఈ పోస్టు కోసం ఒకరిద్దరు తహసీల్దార్లు ప్రయత్నాలు చేస్తున్నారు. బదిలీల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నా.. పనితీ రుకే పెద్దపీట వేయాలని ఉన్నతాధికారులు యోచించి జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలి సింది. మొత్తంగా తహసీల్దార్లలో మాత్రం బది లీ గుబులు పట్టుకుంది. తమ పనితీరుపై అధికారుల వద్ద ఏ విధమైన సమాచారం ఉందో ఆనే ఆందోళన మొదలైంది. బదిలీల జాబితా ఎంతమందితో ఉంటుంది... తమపేర్లు ఉన్నా యా...? అన్న విషయాలు ఆరా తీసే పనిలో చాలామంది బిజీగాఉన్నారు. ఉన్నతాధికారుల వద్ద ఉన్న జాతకాల ఆధారంగా కొద్ది రోజుల్లో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.