త్వరలో తహసీల్దార్ల బదిలీలు ! | Tahasildarla transfers soon! | Sakshi
Sakshi News home page

త్వరలో తహసీల్దార్ల బదిలీలు !

Published Sat, Aug 27 2016 12:40 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM

Tahasildarla transfers soon!

  • క్లీన్‌చిట్‌ ఉన్నవారికి మంచి స్థానాలు...
  • అధికారుల పనితీరుపై సమాచార సేకరణ పూర్తి
  • మరిపెడ ఏసీబీ కేసు నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు
  • హన్మకొండ అర్బన్‌ : జిల్లాలో భారీగా తహసీల్దార్ల బదిలీలు జరుగనున్నట్లు సమాచారం. ఒకరిద్దరు కాదు.. ఏకంగా అన్ని రెవెన్యూ డివి జన్ల పరిధిల్లోనూ మార్పులు జరిగే అవకాశాలున్నాయి. ఈసారి బదిలీల్లో రాజకీయ జోక్యం లే కుండా పూర్తిగా శాఖాపరంగానే చేపట్టాలని ఉ న్నతాధికారులు నిర్ణయించినట్టు  సమాచారం.
    మరిపెడ కేసు నేపథ్యంలో..
    వారం కిత్రం మరిపెడ తహసీల్దార్, ఆర్‌ఐ అవినీతి ఆరోపణలతో ఏసీబీకి పట్టుబడిన నేపథ్యంలో తహసీల్దార్ల వ్యవహారంలో ఉన్నతాధికారులు సమగ్ర సమాచారం సేకరించి నట్లు విశ్వసనీయ సమాచారం. ఆరోపణలు ఉన్నవారిపై ఈసారి కఠువుగా వ్యవహ రిస్తారనే ప్రచా రం  సాగుతోంది. అలాంటి వారికి ప్రస్తుత బదిలీల్లో ప్రాధాన్యత లేని పోస్టింగ్‌లకు పంపిస్తారని తెలుస్తోంది. వీటితోపాటు కరీంనగర్‌ జిల్లాకు బదిలీ అయిన హన్మకొండ తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌ తనను రిలీవ్‌ చేయాలని అధికారులను కోరుతుండటంతో హన్మకొండకు కూ డా అన్ని విధాలా యోగ్యుల కోసం అధికారు లు అన్వేషిస్తున్నారని సమాచారం.
     
    అయితే ఇప్పటికే ఈ పోస్టు కోసం ఒకరిద్దరు తహసీల్దార్లు ప్రయత్నాలు చేస్తున్నారు. బదిలీల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నా.. పనితీ రుకే పెద్దపీట వేయాలని ఉన్నతాధికారులు యోచించి జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలి సింది. మొత్తంగా తహసీల్దార్లలో మాత్రం బది లీ గుబులు పట్టుకుంది. తమ పనితీరుపై అధికారుల వద్ద ఏ విధమైన సమాచారం ఉందో ఆనే ఆందోళన మొదలైంది. బదిలీల జాబితా ఎంతమందితో ఉంటుంది... తమపేర్లు ఉన్నా యా...? అన్న విషయాలు ఆరా తీసే పనిలో చాలామంది బిజీగాఉన్నారు. ఉన్నతాధికారుల వద్ద ఉన్న జాతకాల ఆధారంగా కొద్ది రోజుల్లో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement