Revenue employee
-
ప్రభుత్వంపై, పచ్చ పత్రికపై రెవెన్యూ ఉద్యోగుల ఆగ్రహం
-
రెవెన్యూ ఉద్యోగి ఆకతాయి చేష్టలు..
భద్రాద్రి కొత్తగూడెం, అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేటకు చెందిన ఓ రెవెన్యూ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. అశ్వారావుపేట రెవెన్యూ శాఖలో ఆర్ఐగా పని చేస్తున్న ఓ ఉద్యోగి స్థానిక ఫైర్ కాలనీలో కొంతకాలంగా అద్దెకు ఉంటున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు, వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో వారం రోజుల క్రితం లిఖిత పూర్వకంగా చేసింది. అయినా కేసు నమోదు చేయడంలో పోలీసులు తాత్సారం చేయడంతో బాధిత కుటుంబీకులు ఓ మాజీ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ కూడా 100 కాల్ చేసి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. భూ వ్యవహారంలో మాట వినలేదనే తనపై ఫిర్యాదు చేసినట్లు సదరు ఉద్యోగి, బాధిత మహిళపై ఫిర్యాదు చేశాడు. దీనిపై స్థానిక ఏఎస్సై ఎంవీ సత్యనారాయణను ‘సాక్షి’వివరణ కోరగా.. ఇరువర్గాల నుంచి పరస్పరం ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనని, ఇంకా కేసు నమోదు కాలేదని, దర్యాప్తులో ఉన్నట్లు చెప్పారు. -
రెచ్చిపోయిన రెవెన్యూ ఉద్యోగి
సాక్షి, నూజివీడు: కృష్ణా జిల్లా ముసునూరులో రెవెన్యూ ఉద్యోగి ఒకరు రెచ్చిపోయాడు. దరఖాస్తుదారుడిపై విచక్షణారహింగా దాడి చేశాడు. మద్దాల బాబురావు అనే వ్యక్తి బుధవారం ముసునూరు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. కులధ్రువీకరణ పత్రం కోసం వారం రోజుల నుంచి తిప్పించుకుంటున్నారని అతడు వాపోయాడు. లంచం ఇవ్వకపోతే పని చేయరా అంటూ కంప్యూటర్ ఆపరేటర్ పవన్ కుమార్‌ను నిలదీశాడు. కోపంతో ఊగిపోయిన పవన్ కార్యాలయం నుంచి బయటకు వచ్చి బాబూరావుపై దాడికి పాల్పడ్డాడు. అక్కడున్నవారు అతడిని అడ్డుకోవడంతో వివాదం సద్దుమణిగింది. తనను రక్తమోచ్చేలా కొట్టిన పవన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాబూరావు ఫిర్యాదు మేరకు పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాబూరావు తనను దూషించాడని పవన్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పవన్ దాడిలో బాబూరావు కంటికి గాయమైంది. -
వెంటాడి.. వేటాడి
మేడిపెల్లి(వేములవాడ): వివాహేతరం సంబంధం యువకుడి ప్రాణం తీసింది. పలుమార్లు సదరు విషయమై మందలించినా వినడం లేదని ఆ మహిళ తండ్రి, సోదరుడు ఆ యువకుడిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం తొంబర్రావుపేటలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన రాగుల సురేశ్(31) రెవెన్యూశాఖలో ఉద్యోగిగా చేస్తున్నాడు. ఇతడికి భార్య శైలజ, కూతురు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం సాగుతోంది. ఈ విషయమై సదరు మహిళ తండ్రి నల్ల గంగారెడ్డి సురేశ్‌ను పలుమార్లు హెచ్చరించాడు. అయినా పద్దతి మార్చుకోకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. దారికాసి ఘాతుకం.. సురేశ్ తన మిత్రుడితో కలిసి ద్విచక్రవాహనంపై బుధవారం విధులకు వెళ్తున్నాడు. అదే సమయంలో గ్రామశివారులో కాపుకాసిన సదరు మహిళ తండ్రి నల్ల గంగారెడ్డి, సోదరుడు సంతోష్‌రెడ్డి సురేశ్‌పై దాడి చేశారు. మొదట కర్రలతో దాడిచేయగా స్పృహ కోల్పోయాడు. అనంతరం కొడవలితో మెడ, కడుపులో పొడిచి పారిపోయారు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మెట్‌పెల్లి డీఎస్పీ నల్ల మల్లారెడ్డి, కోరుట్ల సీఐ సతీష్‌చందర్‌రావు, ఎస్సై కిరణ్‌కుమార్ ఘటనాస్థలంలో విచారించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కాగా నిందితులిద్దరూ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. దళిత సంఘాల ఆందోళన అగ్రవర్ణాల చేతిలో హత్యకుగురైన సురేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండు చేశారు. సురేశ్ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, మృతుడి భార్యకు ఉద్యోగం ఇవ్వాలని కోరారు. మేడిపల్లిలో ఆందోళన చేశారు. -
రెవెన్యూ ఉద్యోగి దారుణహత్య
మేడిపెల్లి (వేములవాడ): జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం తొంబర్రావుపేటకు చెందిన రెవెన్యూ ఉద్యోగి రాగుల సురేశ్(31) బుధవారం హత్యకు గురయ్యాడు. తన కూతురితో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడనే కారణంతో అదే గ్రామానికి చెందిన నల్ల గంగారెడ్డి, కొడుకు సంతోష్‌రెడ్డితో కలసి ఈ దారుణానికి ఒడి గట్టాడు. సురేశ్ మేడిపెల్లి తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్. ఆయనకు భార్య శైలజ(25), కూతురు మోక్ష(2) ఉన్నారు. సురేశ్ అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. సదరు మహిళ విడాకులు తీసుకుని ఇంటి వద్ద ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆమె విడాకులకు సురేశ్ కారణమని భావించిన గంగారెడ్డి పలు మార్లు సురేశ్‌ను హెచ్చరించాడు. ఈ క్రమంలో సురేశ్ తన మిత్రుడితో కలసి బైక్‌పై వస్తుండగా శివారులో దారికాచి దాడి చేశారు. కొడవలితో మెడపై, కడుపు భాగంలో పొడిచారు. తీవ్రంగా గాయపడిన సురేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మీనర్సయ్యపైనా దాడికి యత్నించగా పారిపోయినట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
ఏసీబీ వలలో రెవెన్యూ చేప
సబ్సిడీ పంపుసెట్టు అనుమతి ప్రతిపాదన కోసం లంచం డిమాండ్ రూ.4 వేలు తీసుకుంటూ తహశీల్దార్ కార్యాలయం వద్ద పట్టుబడిన వీఆర్వో ఉలిక్కిపడిన రెవెన్యూ అధికారులు వీరఘట్టం : సబ్సిడీ పంపుసెట్టుకోసం ప్రతిపాదన పంపడానికి లంచం డిమాం డ్ చేసిన ఓ రెవెన్యూ ఉద్యోగి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు. వీరఘట్టం మండలంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ రంగరాజ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మొట్టవెంకటాపురం గ్రామానికి చెందిన బోను రాజారావుతో పాటు మరో ఇద్దరు రైతులు తమ పొలంలో సబ్సిడీపై ప్రభుత్వం అందజేసే పంపుసెట్టుకావాలని మూడు నెలల క్రితం వీరఘట్టం తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తుచేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించిన తహశీల్దార్ ఎం.వి.రమణ వాటికి సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలని బిటివాడ, కుమ్మరిగుంట వీఆర్ఓగా పని చేస్తున్న ఎల్.వెంకటరత్నంనాయుడును ఆదేశించారు. పొలాలు పరిశీలించి నివేదికలు ఇవ్వడానికి అర్జీదారులను రూ. 5వేలు లంచం కావాలని డిమాండ్ చేశారు. ఎంతగా బతిమిలాడినా ఆయన ససేమిరా అనడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రూ. నాలుగు వేలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేగాకుండా వీఆర్ఓ ఒత్తిడికి విసిగిపోయిన వారు ఏసీబీ అధికారులను గురువారం ఆశ్రయించారు. పథకం ప్రకారం... అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డీఎస్పీ రంగరాజ్ అధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు లక్ష్మోజి, రమేష్‌లు పథకం ప్రకారం వీఆర్ఓ వెంకటరత్నంనాయుడును శుక్రవారం సాయంత్రం ఆరుగంటల సమయంలో తహశీల్దార్ కార్యాలయం గేట్ వద్ద రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి వీఆర్ఓను శ్రీకాకుళం తమ వెంట తీసుకు వెళ్లారు.తహశీల్దార్ ఎం.వి.రమణ నుండి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఉలిక్కిపడిన వీరఘట్టం వరుస దాడులతో వీరఘట్టం మండలం ఒక్కసారి శుక్రవారం ఉలిక్కిపడింది. గురువారం చలివేంద్రిలో విజిలెన్స్ అధికారుల దాడులు, తాజాగా వీరఘట్టంలో ఏసీబీ దాడులతో అవినీతి అధికారులతో పాటు అక్రమ వ్యాపారుల్లో దడ మొదలైంది. అవినీతికి ఎవరైనా పాల్పడితే 9440446124 నంబరుకు సమాచారం ఇస్తే అవినీతి పరుల భరతం పడతామని ఏసీబీ డీఎస్పీ రంగరాజ్ ఈ సందర్భంగా విలేకరులకు తెలిపారు.