review plea
-
సుప్రీం కోర్టును ఆశ్రయించిన నిర్భయ తల్లి
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణను ఈ నెల 18కి కోర్టు వాయిదా వేసింది. నిందితుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ రివ్యూ పిటిషన్ ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతో తదుపరి విచారణను 18కి వాయిదా వేసింది. మరోవైపు నిర్భయ కేసులోని నిందితులకు శిక్ష అమలుచేయడంలో ఆలస్యం పై ఆమె తల్లి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అక్షయ్ రివ్యూ పిటీషన్లో ప్రతివాదిగా చేర్చాలని అనుమతి కోరారు. దీనికి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డె అనుమతి ఇచ్చారు. ఈ నెల 17న పిటిషన్లను సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ సందర్భంగా నిర్భయ తల్లి మాట్లాడుతూ.. ‘నిందితులను కోర్టు ఉరి శిక్ష వేసి వేసి రెండున్నరేళ్లు అవుతుంది. వారి రివ్యూ పిటిషన్లను తిరస్కరించి ఇప్పటికి 18నెలల దాటిపోయాయి. అయినప్పటికీ వారిని ఉరి తీయలేదు. నిందితులను వెంటనే ఉరి తీయాలని ప్రభుత్వాన్ని, కోర్టును కోరుతున్నాను’ అని అన్నారు. అక్షయ్ కుమార్ సింగ్ రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ముందే తిరస్కరించాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు తమకు వేరే మార్గం లేదని. కోర్టు నిర్ణయాన్ని గౌరవించి ఈ నెల 17వరకు వేచి చూడాల్సిందేనని తెలిపారు. ఏడేళ్ల నుంచి నిరీక్షిస్తునే ఉన్నామని, మరో వారం రోజులు వేచి చూడగలమని చెప్పారు. అయితే గతంలో మిగిలిన ముగ్గురు దోషులు వినయ్, ముకేశ్, పవన్‌లు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇటీవల వినయ్ క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వంతోపాటు, కేంద్రం కూడా తోసిపుచ్చింది. కాగా, నిర్భయను 2012 డిసెంబర్ 16 అర్ధరాత్రి బస్సులో ఆరుగురు రాక్షసులు మూకుమ్మడిగా అత్యాచారం చేయడమే కాకుండా, దారుణంగా హింసించడంతో ఆమె కొన్నాళ్లు మృత్యువుతో పోరాడి సింగపూర్ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఆరుగురు దోషుల్లో ఒకరైన రామ్‌సింగ్ జైల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు మైనర్ కావడంతో మూడేళ్ల పాటు జువైనల్ హోంకి పంపారు. మిగిలిన నలుగురికి కోర్టు 2017లో మరణశిక్ష విధించింది. ప్రస్తుతం వీరు తీహార్ జైలులో ఉన్నారు. -
నిర్భయ కేసు : రివ్యూ పిటిషన్‌పై విచారణ
న్యూఢిల్లీ : నిర్భయ కేసులో నలుగురు దోషుల్లో ఒకరైన అక్షయ్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. అక్షయ్ పిటిషన్‌పై డిసెంబర్ 17న మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టనుంది. తనకు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలని అక్షయ్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఢిల్లీలో వాయు కాలుష్యం, జల కాలుష్యం వల్ల ఎలాగో తన ఆయుష్షు తగ్గిపోతుందని.. అలాంటప్పుడు మరణశిక్ష ఎందుకు అని ప్రశ్నించాడు. అయితే గతంలో మిగిలిన ముగ్గురు దోషులు వినయ్, ముకేశ్, పవన్‌లు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇటీవల వినయ్ క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వంతోపాటు, కేంద్రం కూడా తోసిపుచ్చింది. కొద్ది రోజుల్లో నిర్భయ కేసులో దోషులను ఊరి తీస్తారనే వార్తలు ప్రచారంలో ఉన్న సమయంలో అక్షయ్ రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించడం చర్చనీయాంశంగా మారింది. కాగా, నిర్భయను 2012 డిసెంబర్ 16 అర్ధరాత్రి బస్సులో ఆరుగురు రాక్షసులు మూకుమ్మడిగా అత్యాచారం చేయడమే కాకుండా, దారుణంగా హింసించడంతో ఆమె కొన్నాళ్లు మృత్యువుతో పోరాడి సింగపూర్ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఆరుగురు దోషుల్లో ఒకరైన రామ్‌సింగ్ జైల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు మైనర్ కావడంతో మూడేళ్ల పాటు జువైనల్ హోంకి పంపారు. మిగిలిన నలుగురికి కోర్టు 2017లో మరణశిక్ష విధించింది. ప్రస్తుతం వీరు తీహార్ జైలులో ఉన్నారు. -
అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్
న్యూఢిల్లీ : అయోధ్యలోని వివాదస్పద స్థలంపై సుప్రీం కోర్టు తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలైంది. జమైత్ ఉలేమా ఇ హింద్ సంస్థ సోమవారం సుప్రీం కోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంపై ఆ సంస్థ చీఫ్ మౌలానా అర్షద్ మదాని మాట్లాడుతూ.. దేశంలోని మెజారిటీ ముస్లింలు అయోధ్య పై సుప్రీం వెలువరించిన తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. కొందరు మాత్రమే రివ్యూ పిటిషన్ వద్దనుకుంటున్నారని చెప్పారు. అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం కోర్టు తమకు ఇచ్చిన హక్కు అని పేర్కొన్నారు. అయోధ్య కేసులో.. మందిరాన్ని కూల్చి మసీదును నిర్మించారనేది వివాదస్పద అంశమని ఆర్షద్ తెలిపారు. కానీ ఆ ఆరోపణలకు ఆధారాలు లేవని కోర్టు కూడా చెప్పిందని అన్నారు. కానీ తీర్పు మాత్రం అందుకు వ్యతిరేకంగా వెలువడిందన్నారు. అందువల్లే తాము రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, సుప్రీం అయోధ్య కేసులో తీర్పు వెలువరించిన తరువాత దాఖలైన తొలి రివ్యూ పిటిషన్ ఇదే. మరోవైపు 99 శాతం ముస్లింలు అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని కోరుకుంటున్నారని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ) ఆదివారం పేర్కొంది. డిసెంబర్ 9 వ తేదీన రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఏఐఎంపీఎల్బీ వెల్లడించింది. అయితే ముస్లింల తరఫున పిటిషన్‌దారు అయిన సున్నీ వక్ఫ్ బోర్డు అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయబోమని స్పష్టం చేసింది. కాగా, అత్యంత సున్నితమైన అయోధ్య కేసులో సుప్రీం కోర్టు నవంబర్ 9వ తేదీన కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయోధ్యలో వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని సుప్రీం కోర్టు ఆ తీర్పులో పేర్కొంది. రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది. -
‘ఎస్సీ, ఎస్టీ’ తీర్పుపై సమీక్షకు ఓకే
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై గత ఏడాది ఇచ్చిన తీర్పుపై సమీక్ష జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, యు.యు.లలిత్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ.. కేసును వచ్చే వారం త్రిసభ్య ధర్మాసనం విచారిస్తుందని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అరెస్టులకు సంబంధించిన నిబంధనలను సడలిస్తూ సుప్రీంకోర్టు 2018 మార్చి 20న కొన్ని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో ఈ చట్టం దుర్వినియోగమవుతోందని అభిప్రాయపడ్డ అత్యున్నత న్యాయస్థానం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తక్షణం అరెస్ట్ చేయడం కుదరదని తీర్పునిచ్చింది. ప్రభుత్వ అధికారులు ఈ చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అవడం వల్ల వారి విధి నిర్వహణ కుంటుపడుతోందని పేర్కొంది. అంతేకాకుండా, ముందస్తు బెయిల్ ఇవ్వడంపై ఎలాంటి నిషేధాలు లేవని స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేసేందుకు ఉన్నతస్థాయి అధికారి అనుమతి అవసరమని కూడా ఆ తీర్పులో పేర్కొంది. దీనిపై దేశవ్యాప్తంగా పలు సంస్థలు ఆందోళనలు చేపట్టాయి. దీంతో ఈ తీర్పు సమస్యాత్మకమైందని, సమీక్షించాలని కేంద్రం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. దీనిపై మే 1వ తేదీన వాదనలు పూర్తి కాగా తాజా తీర్పు వెలువరించింది. ట్రిపుల్ తలాక్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ వచ్చిన చట్టంపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ముస్లిం న్యాయవాదుల అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం చేసిన ముస్లిం విమెన్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఇన్ మ్యారేజీ) చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ ఇప్పటికే దాఖలైన పలు పిటిషన్లకు తాజా పిటిషన్‌ను జత చేశారు. ఇదిలా ఉండగా.. బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై విచారణ జరుపుతున్న న్యాయమూర్తి పదవీకాలాన్ని పొడిగిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
రఫెల్ డీల్ తీర్పుపై సుప్రీంకోర్టు సమీక్ష
న్యూఢిల్లీ: రఫెల్ డీల్‌పై తీర్పును రివ్యూ చేసేందుకు సుప్రీం కోర్టు అంగీకారం తెలిపింది. రఫెల్ ఒప్పందంపై గతేడాది డిసెంబర్ 14న తీర్పును వెలువరించిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యవహరంలో కేంద్రం తీరును సమర్ధించిన సంగతి తెలిసిందే. ఇందులో భారీ అవకతవకలు జరిగనట్టు కనిపించడం లేదని అభిప్రాయపడ్డ న్యాయస్థానం.. చిన్న పొరపాట్లకు ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన పనిలేదని పేర్కొంది. వివాదస్పద రఫెల్ డీల్‌కు సంబంధించి సుప్రీం తీర్పుపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీలు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. ప్రభుత్వ పెద్దలు సరైన సమాచారం ఇవ్వకుండా కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. కాగా, వీటిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పును రివ్యూ చేసేందుకు అంగీకారం తెలిపారు. రివ్యూ పిటిషన్లపై తక్షణ విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని.. ఇందుకోసం ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రఫెల్ డీల్‌పై డిసెంబర్లో సుప్రీం ఇచ్చిన తీర్పు: రఫేల్ ఒప్పందం సక్రమమే -
'నిఠారీ' హంతకుడి రివ్యూ పిటిషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యల కేసు దోషి సురీందర్ కోలీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అతడు పెట్టుకున్న రివ్యూ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తిరస్కరించింది. నోయిడాలోని 14 ఏళ్ల బాలిక రింపా హాల్దర్‌ను దారుణంగా హతమార్చిన కేసులో కోలీకి ఉరిశిక్ష పడింది. మీరట్ జైల్లో అతడిని సెప్టెంబర్ 12వ తేదీన ఉరి తీసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే కోలీ మరణశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో అతడిని ఉరి తీయలేదు. సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ తిరస్కరించడంతో అతడికి మరణశిక్ష అమలు చేసే అవకాశముంది.