సురీందర్ కోలీ(ఫైల్)
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యల కేసు దోషి సురీందర్ కోలీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అతడు పెట్టుకున్న రివ్యూ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తిరస్కరించింది. నోయిడాలోని 14 ఏళ్ల బాలిక రింపా హాల్దర్‌ను దారుణంగా హతమార్చిన కేసులో కోలీకి ఉరిశిక్ష పడింది.
మీరట్ జైల్లో అతడిని సెప్టెంబర్ 12వ తేదీన ఉరి తీసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే కోలీ మరణశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో అతడిని ఉరి తీయలేదు. సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ తిరస్కరించడంతో అతడికి మరణశిక్ష అమలు చేసే అవకాశముంది.