Surinder Koli
-
నరరూప రాక్షసులకు ఉరిశిక్ష
ఘజియాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వరుస అత్యాచారాలు. ఆపై హత్యల కేసులో దోషులైన వ్యాపారవేత్త మొనీందర్సింగ్, అతని సహాయకుడు సురేందర్ కోలీలకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. 2006లో పనిమనిషి అంజలిపై అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేశారని, అందువల్ల కఠినాతికఠినమైన శిక్షకు వారు అర్హులని న్యాయమూర్తి పీకే తివారి తీర్పు సందర్భంగా శుక్రవారం వ్యాఖ్యానించారు. సురేందర్ కోలీ బాధితురాలిని ఇంటిలోకి ఈడ్చుకొచ్చాడని, ఆ తర్వాత ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయేలా చేశాడని, అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడని, అంతటితో ఆగకుండా ఆమె మాంసం తిన్నాడని, అందువల్ల చట్టం ప్రకారం మరణశిక్ష విధించడం తప్ప అంతకుమించిన శిక్ష లేదన్నారు. తుదిశ్వాస విడిచేదాకా ఉరి తీయాలని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారిరువురినీ జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని సూచించారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (అత్యాచారం), సెక్షన్ (302 (హత్య), సెక్షన్ 201 (సాక్ష్యాలను చెరిపివేయడం)కింద వీరిరువురినీ న్యాయస్థానం గురువారం దోషులుగా నిర్ధారించడం తెలిసిందే. పసికూనల అపహరణ, లైంగిక వేధింపులకు గురిచేయడం, ఆ తర్వాత నోయిడాలోని పాంధేర్ నివాసంలో హత్య చేయడం కేసుల్లో వీరిరువురు ప్రధాన నిందితులు. పాంధేర్పై సీబీఐ...అభియోగపత్రం దాఖలు చేయకపోయినప్పటికీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని 319వ సెక్షన్ కింద నిందితుడికి సమన్లు జారీచేసి విచారణ జరిపింది. 25 ఏళ్ల క్రితం నాటి ఈ వ్యవహారం ఎలా బయటపడిందనే దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2006, అక్టోబర్, 12వ తేదీన పనిమనిషి ఇంటికి రాలేదు. దీంతో ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. అదే ఏడాది డిసెంబర్, 26వ తేదీన పోలీసులు కోలీని అరెస్టు చేశారు. ఆ ఇంటి వెనుకభాగంలో కొన్ని పుర్రెలు పోలీసులకు లభించాయి. అందులో ఒక పుర్రె ... అంజలి తల్లి, సోదరుడి డీఎన్ఏలతో సరిపోలింది. దీంతో ఈ కేసుకు సంబంధించి బలమైన ఆధారం లభించింది. ఇదే వారు దోషులని రుజువు చేసేందుకు తోడ్పడింది. కుటుంబసభ్యులు బాధితురాలి దుస్తులను గుర్తించారు. మరో ఎనిమిది కేసుల్లో కోలీ దోషిగా తేలాడు. మొత్తం 19 కేసులు నమోదు కాగా అందులో 16 కేసుల్లో వీరు నిందితులు. అందులో పది కేసులకు సంబంధించి కోర్టు ఓ నిర్ణయానికొచ్చింది. -
కోలీకి ఉరిశిక్షపై పునస్సమీక్షకు ‘సుప్రీం’ నో
న్యూఢిల్లీ: రింపా హల్దార్ హత్యకేసులో తనకు విధించిన మరణశిక్షను ధ్రువీకరిస్తూ ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలని నిఠారి హత్యలకేసులో దోషి, సురీందర్ కోలీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. మరణశిక్ష విధించిన కేసుల్లో దాఖలైన రివ్యూ పిటిషన్‌పై తొలిసారిగా జరిగిన కోర్టు బహిరంగ విచారణ అనంతరం చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తుతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరించింది. కోలీ మరణశిక్షను ధ్రువీకరిస్తూ ఇచ్చిన తీర్పునువుళ్లీ సమీక్ష జరపాల్సినంత పొరపాటు ఏదీ జరగలేదని కోర్టు సంతృప్తిచెందినట్టు ధర్మాసనం అభిప్రాయుపడింది. -
'నిఠారీ' హంతకుడి రివ్యూ పిటిషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యల కేసు దోషి సురీందర్ కోలీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అతడు పెట్టుకున్న రివ్యూ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తిరస్కరించింది. నోయిడాలోని 14 ఏళ్ల బాలిక రింపా హాల్దర్‌ను దారుణంగా హతమార్చిన కేసులో కోలీకి ఉరిశిక్ష పడింది. మీరట్ జైల్లో అతడిని సెప్టెంబర్ 12వ తేదీన ఉరి తీసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే కోలీ మరణశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో అతడిని ఉరి తీయలేదు. సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ తిరస్కరించడంతో అతడికి మరణశిక్ష అమలు చేసే అవకాశముంది. -
కిల్లర్ కోలీ మరణ శిక్షపై సుప్రీం కోర్టు స్టే
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారి వరుస హత్యల కేసు దోషి సురీందర్ కోలీకి తాత్కాలిక వూరట లభించింది. కోలీ మరణశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నోయిడాలోని 14 ఏళ్ల బాలిక రింపా హాల్దర్‌ను దారుణంగా హతమార్చిన కేసులో కోలీకి ఉరిశిక్ష పడింది. మీరట్ జైల్లో అతడిని 12వ తేదీన ఉరి తీసేందుకు రంగం సిద్ధం అయిన విషయం తెలిసిందే. కాగా కోలీ మరణ శిక్ష అమలుపై న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తూ వారం రోజుల పాటు స్టే విధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో సురేందర్ కోలీకి వేసిన ఉరిశిక్ష అమలులో మరింత జాప్యం జరిగే అవకాశముంది. ఉరిశిక్ష అమలుపై అతడు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు పరిశీలించి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సిఫారసు మేరకు 42 ఏళ్ల సురిందర్ కోలి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 27న తిరస్కరించారు.కాగా కోలిపై మరో 11 హత్యకేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కోలీపై మొత్తం 16 కేసుల్లో చార్జిషీట్లు దాఖలయ్యాయి. 2006లో రింపా హాల్దర్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో నోయిడా శివార్లలోని నిఠారి ప్రాం తంలో కోలీ పనిచేసే ఇంటిపక్కనున్న మురికి కాలువలో పలువురు చిన్నారుల అస్థిపంజరాల శిథిలాలు లభించాయి. కోలీకి దిగువ కోర్టు విధించిన మరణశిక్షను అలహాబాద్ హైకోర్టు, అనంతరం సుప్రీంకోర్టు సమర్ధించాయి. -
కోలీకి ఉరి అమలవుతుందా?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిఠారీ’ కేసుల నిందితుడు సురేందర్ కోలీకి వేసిన ఉరిశిక్ష అమలులో మరింత జాప్యం జరిగే అవకాశముంది. ఈ నెల 12వ తేదీన కోలీకి ఉరి తీయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అతడిని ఉరి తీసేందుకు తగిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అయితే వాస్తవానికి కోలిని 12వ తేదీన ఉరి అమలవుతుందా అనే సందేహాలు వెలువడుతున్నాయి. అతడిపై పెట్టిన ఇతర కేసులు ఇంకా పెండింగ్‌లోనే ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. కాగా, అతడిని కొత్తగా రివ్యూ పిటిషన్ వేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఉరి మరింత జాప్యమయ్యే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ నెల 12వ తేదీన తనకు అమలు చేయనున్న ఉరి శిక్షపై చాంబర్స్ ఆఫ్ జడ్జెస్‌లో వేసుకున్న రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయమూర్తులు బహిరంగ కోర్టులో అతడు రివ్యూ పిటిషన్ వేసుకోవచ్చని సూచించారు. ఈ ఏడాది జూలై 24వ తేదీన 14 ఏళ్ల రింపా హల్దార్ అనే బాలిక హత్య కేసులో కోలీకి కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. కాగా, కోలీ ఉరిశిక్ష అమలు అయితే అతడిపై ఉన్న ఇతర 15 కేసులు మూసివేయాల్సి ఉంటుందని, దాంతో ఆయా బాధిత కుటుంబాలకు అన్యాయం చేసినట్లే అవుతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిలో నాలుగు కేసులు విచారణ దశలో, 11 కేసులు అప్పీల్ దశలో ఉన్నాయి. వీటిలోని 8 కేసుల్లో కోలీ యజమాని మణిందర్ సింగ్ పంధేర్ కూడా నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులన్నింటిలోనూ ప్రధాన సాక్షి కోలీ మాత్రమే. ఒకవేళ కోలీకి ఉరిశిక్ష అమలు అయితే ఆ కేసులన్నీ మూసేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ఒక మాజీ న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఒక నేరస్తుడిపై ఉన్న అన్ని కేసుల విచారణ పూర్తయిన తర్వాతే అతడికి ఉరిశిక్ష విధించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ ధింగ్రా మాట్లాడుతూ ఒక నేరస్తుడిపై ఉన్న అన్ని కేసులు కొట్టేసిన తర్వాతే ఉరి తీయాలని ఏ చట్టంలోనూ లేదని స్పష్టం చేశారు. కోలీ ఉరిశిక్ష ఇతర నిఠారీ కేసులపై ప్రభావం చూపుతుందని సీనియర్ న్యాయవాది సుశీల్ కుమార్ అన్నారు. ‘పంధేర్‌పై నడుస్తున్న కేసుల్లో విచారణ చేపట్టేందుకు కష్టమవుతుంది. చాలా కేసుల్లో వీరిద్దరినీ ఒకే చట్టం కింద అరెస్టు చేశారు..ఒకవేళ కోలీని ఉరితీసేస్తే తర్వాత ఆయా కేసులను నిరూపించడం ప్రాసిక్యూషన్‌కు సాధ్యమవుతుందా..?’ అని ఆయన ప్రశ్నించారు. ‘నిఠారీ కేసుల్లో చాలావరకు క్రాస్ ఎగ్జామిన్ దశలో ఉన్నాయి.. క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు కోలీ లేకపోతే అది ఆయా కేసులపై తప్పక చెడు ప్రభావం చూపుతుంద’ని సుప్రీంకోర్టు న్యాయవాది జ్ఞానంత్ సింగ్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా కోలీని ఈ నెల 12వ తేదీన ఉరితీయాలని కోర్టు అనుకుంటే అతడిపై ఉన్న మిగిలిన అన్ని కేసులను ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని ప్రముఖ క్రిమినల్ న్యాయవాది మజీద్ మెమన్ వ్యాఖ్యానించారు. -
నిఠారీ కేసు: కోలీకి 12న ఉరిశిక్ష అమలు
నిఠారీ సీరియల్ హంతకుడు సురీందర్ కోలీని ఈ నెల 12న ఉరి తీయనున్నారు. 14 ఏళ్ల అమ్మాయిని దారుణంగా హతమార్చిన కేసులో కోలీకి ఉరిశిక్ష పడిన విషయం తెలిసిందే. మీరట్ జైల్లో అతడిని 12వ తేదీన ఉరి తీయనున్నట్లు జైలు సూపరింటెండెంట్ రిజ్వీ తెలిపారు. నియమ నిబబంధనలన్నింటినీ తాము పాటిస్తున్నామని, ఆరోజే ఉరి తీస్తామని ఆయన చెప్పారు. న్యాయపరంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవడంతో, 42 ఏళ్ల కోలీని చనిపోయేవరకు ఉరి తీయాలంటూ ఘజియాబాద్ అదనపు సెషన్స్ జడ్జి అతుల్ కుమార్ గుప్తా బుధవారం వారంటు జారీ చేశారు. ప్రస్తుతం ఘజియాబాద్ జైల్లో ఉన్న కోలీకి రింపా హల్దర్, మరో నలుగురిని చంపిన కేసులో ఉరిశిక్ష పడింది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేస్తున్న మొదటి ఉరిశిక్ష ఇదే అవుతుంది. కోలీ పెట్టుకున్న క్షమాభిక్ష విజ్ఞప్తిని తిరస్కరించాలని కేంద్ర హోం మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నెల రోజులకే రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. దాంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 27న క్షమాభిక్షను తిరస్కరించారు. కోలీపై మొత్తం 16 హత్యకేసులు ఉన్నాయి. ఆడపిల్లలపై వరుసపెట్టి అత్యాచారాలు చేయడం, వాళ్లను చంపేయడం సురీందర్ కోలీకి అలవాటని, ఇలా మొత్తం 16 కేసులు అతడిపై ఉన్నాయని సీబీఐ తన ఛార్జిషీటులో పేర్కొంది. 2006లో తొలిసారిగా ఒక హత్య వెలుగులోకి వచ్చింది. తర్వాత దర్యాప్తు మొదలుపెట్టగా.. వరుసపెట్టి అన్నీ తెలిసి దేశం యావత్తు విస్తుపోయింది. నోయిడాలోని నిఠారీ కాలనీలో కోలి పనిమనిషిగా పనిచేసేవాడు. -
నిఠారి కిల్లర్‌కు ఉరి
మీరట్: నిఠారి సీరియల్ కిల్లర్ సురిందర్ కోలిని ఈ నెల 12వ తేదీన ఉరి తీయనున్నారు. 14 ఏళ్ల బాలిక రింపా హాల్దర్‌ను పాశవికంగా హత్య చేసిన నేరానికి గానూ కోలీకి ఉరిశిక్ష విధించారు. శిక్ష విధించే సమయంలో మరో నాలుగు కేసులను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అన్ని నియమ నిబందనల ప్రకారం ఉరిశిక్షను అమలు చేస్తామని మీరట్ జైలు సూపరింటెండెంట్ ఎస్‌హెచ్ రిజ్వీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సిఫారసు మేరకు 42 ఏళ్ల సురిందర్ కోలి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 27న తిరస్కరించారు. కోలిపై మరో 11 హత్యకేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కోలీపై మొత్తం 16 కేసుల్లో చార్జిషీట్లు దాఖల య్యాయి. 2006లో రింపా హాల్దర్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో నోయిడా శివార్లలోని నిఠారి ప్రాం తంలో కోలీ పనిచేసే ఇంటిపక్కనున్న మురికి కాలువలో పలువురు చిన్నారుల అస్థిపంజరాల శిథిలాలు లభించాయి. కోలీకి దిగువ కోర్టు విధించిన మరణశిక్షను అలహాబాద్ హైకోర్టు, అనంతరం సుప్రీంకోర్టు సమర్ధించాయి. -
నిఠారీ కేసులో కోలీకి డెత్ వారెంట్
ఘజియాబాద్: నిఠారీ వరుస హత్యల కేసులో 14ఏళ్ల రింపా హాల్దర్ దారుణ హత్యకు సంబంధించి దోషిగా తేలిన సురీందర్ కోలీకి ఘజియాబాద్ సెషన్స్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో దోషికి చట్టపరమైన అవకాశాలన్నింటినీ సురీందర్ కోలీ ఇప్పటికే వినియోగించున్నందున అతనికి మరణశిక్ష విధిస్తూ అదనపు సెషన్స్ న్యాయమూర్తి అతుల్ కుమార్ గుప్తా తీర్పు చెప్పినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. మిగిలిన నాలుగు హత్యకేసుల్లో కూడా కోలీకి మరణశిక్ష పడినందున శిక్షల అమలుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు వీలుగా వారెంట్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి పంపించారు. సురీందర్ కోలీని ఈ నెల 12న ఉరితీయాలని కోర్టు నిర్ణయించిందని, శిక్ష అమలు చేసే తేదీని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపుల అనంతరం తుదిగా ఖరారు చేస్తారని సీబీఐ వర్గాలు తెలిపాయి.