మీరట్: నిఠారి సీరియల్ కిల్లర్ సురిందర్ కోలిని ఈ నెల 12వ తేదీన ఉరి తీయనున్నారు. 14 ఏళ్ల బాలిక రింపా హాల్దర్‌ను పాశవికంగా హత్య చేసిన నేరానికి గానూ కోలీకి ఉరిశిక్ష విధించారు. శిక్ష విధించే సమయంలో మరో నాలుగు కేసులను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అన్ని నియమ నిబందనల ప్రకారం ఉరిశిక్షను అమలు చేస్తామని మీరట్ జైలు సూపరింటెండెంట్ ఎస్‌హెచ్ రిజ్వీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సిఫారసు మేరకు 42 ఏళ్ల సురిందర్ కోలి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 27న తిరస్కరించారు.
కోలిపై మరో 11 హత్యకేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కోలీపై మొత్తం 16 కేసుల్లో చార్జిషీట్లు దాఖల య్యాయి. 2006లో రింపా హాల్దర్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో నోయిడా శివార్లలోని నిఠారి ప్రాం తంలో కోలీ పనిచేసే ఇంటిపక్కనున్న మురికి కాలువలో పలువురు చిన్నారుల అస్థిపంజరాల శిథిలాలు లభించాయి. కోలీకి దిగువ కోర్టు విధించిన మరణశిక్షను అలహాబాద్ హైకోర్టు, అనంతరం సుప్రీంకోర్టు సమర్ధించాయి.
నిఠారి కిల్లర్‌కు ఉరి
Published Fri, Sep 5 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM
Advertisement