Rewari District
-
కన్నకూతుర్ని కడతేర్చిన రైతు
ఛండీగఢ్: అప్పులు పాలైన రైతు కన్నకూతుర్ని కర్కకశంగా హత్య చేసిన ఘటన హర్యానాలోని రెవారి జిల్లా బెరంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కూతురు పెళ్లి చేయలేమోనన్న భయంతో అన్నదాత తన 15 ఏళ్ల కుమార్తెను కడతెర్చాడు. నిందితుడు మహీందర్ సింగ్ పరారీలో ఉన్నాడు. శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న కుమార్తె సంజును గొడ్డలితో నరికి చంపాడు. మహీందర్ భార్య, అతడి ఇద్దరు కుమారులు ఇంట్లో లేకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆదివారం పొరుగింటామె మహీందర్ ఇంటికి వెళ్లి చూడడంతో ఈ దారుణోదంతం వెలుగు చూసింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన మహీందర్ కూతురు పెళ్లి చేయలేమోనన్న భయంతో ఈ కిరాతకానికి పాల్పడివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అరెస్ట్ చేస్తే కాని అసలు విషయం తెలియదని దర్యాప్తు అధికారి నరీందర్ సింగ్ అన్నారు. -
హర్యానాలో దళిత యువతిపై అత్యాచారం
దళిత యువతి(22)ని అపహరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన హర్యానాలోని రెవారి జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి దుండగుడు ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలిని నెల రోజుల పాటు బంధువుల ఇంట్లో బంధించాడు. పరారీలో ఉన్న నిందితుడు పవన్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బోడియా కమల్పూర్ గ్రామానికి చెందిన యువతిని పవన్ కుమార్ గత నెల 5న అపహరించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను తీసుకుపోయాడు. బంధువుల ఇంట్లో ఉంచి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడి ఎలాగో తప్పించుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. ఆమెను వైద్యపరీక్షలకు పంపించారు.