దళిత యువతి(22)ని అపహరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన హర్యానాలోని రెవారి జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి దుండగుడు ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలిని నెల రోజుల పాటు బంధువుల ఇంట్లో బంధించాడు. పరారీలో ఉన్న నిందితుడు పవన్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
బోడియా కమల్పూర్ గ్రామానికి చెందిన యువతిని పవన్ కుమార్ గత నెల 5న అపహరించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను తీసుకుపోయాడు. బంధువుల ఇంట్లో ఉంచి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడి ఎలాగో తప్పించుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. ఆమెను వైద్యపరీక్షలకు పంపించారు.
హర్యానాలో దళిత యువతిపై అత్యాచారం
Published Thu, Aug 8 2013 8:34 PM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
Advertisement
Advertisement