Dalit girl raped
-
లైంగిక దాడి ఆపై సజీవ దహనం
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం తల్లితండ్రులు ఆస్పత్రిలో ఉండగా, 14 ఏళ్ల దళిత మైనర్ బాలికపై దుండగలు లైంగిక దాడికి పాల్పడి అనంతరం సజీవ దహనం చేసిన ఉదంతం వెలుగుచూసింది. ఈ కేసులో ఏడుగురిపై కేసు నమోదు చేసినా ఇప్పటివరకూ పోలీసులు ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు. ముజఫర్‌పూర్‌లో బాలిక పనిచేసే ఇటుక బట్టీ వద్ద ఓ చిన్న గదిలో బాధితురాలి దగ్ధమైన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇటుక బట్టీలో పనిచేస్తూ పొట్టపోసుకునే బాలిక కుటుంబం పక్కనే ఉన్న గదిలో నివసిస్తుండేదని స్ధానికులు చెప్పారు. గత వారం బాలిక తల్లితండ్రులు అస్వస్ధతతో ఆస్పత్రిలో చేరగా తమ్ముడితో కలిసి బాధితురాలు గదిలో ఉంటోంది. బాలికపై కన్నేసిన ఇటుక బట్టీ యజమాని మరో ఆరుగురుతో కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి సజీవ దహనం చేశారు. కాగా, నిందితులపై హత్య, లైంగిక దాడి, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని బీమ్ ఆర్మీ హెచ్చరించింది. -
అత్యాచార ఘటన సమాజానికి తలవంపు
సాక్షి, హైదరాబాద్: జగదేవ్‌పూర్ మండలం రామారంలో దళిత బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని బీజేపీ ప్రధానకార్యదర్శి చింతా సాంబమూర్తి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయనొక ప్రకటన విడుదల చేశారు. ఘనట జరిగి 2 రోజులైనా దోషు లను అరెస్టు చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. వెంటనే దోషులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి 5 ఎకరాల భూమి, రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
దళిత బాలికపై అత్యాచారం
♦ బాలిక తమ్ముడిపై హత్యాయత్నం ♦ న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు ♦ పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు గణపురం : బాలికపై సమీప బంధువు కన్నేశాడు. బాలిక తల్లిదండ్రులు లేని సమయం చూసి కాటేశాడు. వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరుకు చెందిన దళిత బాలిక (13) స్థానిక ప్రభుత్వం పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో సమీప బంధు వు అల్లూరి వినయ్ మరో బాలికతో సదరు బాలికను అల్లూరి తిరుపతి ఇంటికి పిలిపిం చాడు. ఆ బాలిక ఇంట్లోకి రాగానే తలుపులు వేసి అత్యాచారం చేశాడు. బాలిక సోదరుడు కల్లెపు వినయ్ తన అక్కకోసం వచ్చి తిరుపతి ఇంట్లో జరుగుతున్న సంఘటనను చూసి మొత్తుకున్నాడు. అమ్మనాన్నలతో చెప్పుతానని వెనుతిరిగాడు. అల్లూరి వినయ్ తలుపులు తీసి బాలి కను బయటకు పంపించి వెంటనే తన మిత్రులను జతచేసి ఆటోలో వెళ్లి కల్లెపు వినయ్‌ను పట్టుకుని జంగుపల్లివైపు వచ్చారు. హత్యాప్రయత్నం చేయబోగా విషయం ఎవరికీ చెప్పననడంతో వదిలారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరగగా.. మంగళవారం సదరు బాలిక తన తల్లిదండ్రులతో కలసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడు అల్లూరి వినయ్‌తో పాటు, ఆరెల్లి అబ్దులు, ఎ.శ్రీకాంత్ (బాతు), సిలివేరు రాకేష్, అల్లూరి సిద్దులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినయ్ వెంటనే వెళ్లిన నలుగురికి అత్యాచార సంఘటన గూర్చి తెలియదు. కానీ, స్నేహితుడు వినయ్ వెంట ఆటోలో వెళ్లారు. నలుగురులో ముగ్గురు మైనర్లే. -
దళిత బాలికపై అత్యాచారం
జంగారెడ్డిగూడెం : దళిత బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి డీఎస్పీ జె.వెంకటరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన 14 సంవత్సరాల బాలిక స్థానిక జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. ఈ నెల 18వ తేదీన ఆమె తన స్నేహితురాలితో కలిసి పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. 19న బాలిక తల్లి తన కూతురు, మరో స్నేహితురాలు కనిపించడం లేదని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అయితే మరునాడు ఒక బాలిక తిరిగి వచ్చేసిందని, మరొక బాలిక 22వ తేదీన రాగా, ఆమె తల్లితండ్రులకు అప్పగించామన్నారు. అయితే శుక్రవారం తన బాలికపై అత్యాచారం జరిగిందని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. 18న పట్టణానికి చెందిన ఆటోపై కూరగాయలు రవాణా చేసే గండ్రోతు లక్ష్మణ్ ఇద్దరు బాలికలను తాడేపల్లిగూడెం తీసుకువెళ్లి అందులో ఒక బాలిక అమ్మమ్మ ఇంట్లో ఉంచాడని, మరునాడు ఒక బాలిక తిరిగి వచ్చేసిందన్నారు. మరో బాలికపై గండ్రోతు లక్ష్మణ్ అత్యాచారం చేశాడని, అతని స్నేహితుడు తాడేపల్లిగూడానికి చెందిన ఆటో డ్రైవర్ శ్రీను కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు డీఎస్పీ చెప్పారు. ఈ నెల 22వ తేదీన బాలిక తిరిగి జంగారెడ్డిగూడెం వచ్చిందని, దీంతో ఆమెను తల్లితండ్రులకు అప్పగించామన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు గండ్రోతు లక్ష్మణ్, శ్రీనులపై కేసు నమోదు చేశామన్నారు. వీరిపై పోక్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అఫెన్సెస్ చట్టం) కింద , ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తాను దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హెచ్‌సీ సూర్యచంద్రంపై బాలిక తల్లి ఫిర్యాదు చేశారని దానిపై శాఖాపరమైన విచారణ చేస్తామన్నారు. ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్నారు బాలిక తల్లి విలేకరులతో మాట్లాడుతూ గండ్రోతు లక్ష్మణ్ ఆరు నెలలుగా తన కూతురుపై అత్యాచారం చేస్తున్నాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని పేర్కొన్నారు. తన కూతురికి ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి ప్రలోభ పెట్టాడని, తన కూతురిపై గండ్రోతు లక్ష్మణ్ అత్యాచారం చేయడమే కాకుండా తాడేపల్లిగూడానికి చెందిన ఆటో డ్రైవర్ శ్రీను కూడా అత్యాచారం చేశాడని వివరించారు. ఈ నెల 18వ తేదీన తన కూతురు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని అప్పటి నుంచి పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు సక్రమంగా స్పందించలేదని పేర్కొంది. హెచ్‌సీ సూర్యచంద్రం తనను అవమాన పరిచి అసభ్యకర పదజాలంతో తిట్టారని పేర్కొన్నారు. శుక్రవారం తన కూతురిపై జరిగిన అత్యాచార ఘటన, హెచ్‌సీ సూర్యచంద్రంపైనా పోలీసులకు ఫిర్యాదు చేశానని, ప్రతులను జిల్లాకలెక్టర్‌కు, డీఎస్పీ, ఎస్పీ, డీఐజీ, హోంమినిస్టర్, ముఖ్యమంత్రులకు పంపినట్టు తెలిపారు. -
హర్యానాలో దళిత యువతిపై అత్యాచారం
దళిత యువతి(22)ని అపహరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన హర్యానాలోని రెవారి జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి దుండగుడు ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలిని నెల రోజుల పాటు బంధువుల ఇంట్లో బంధించాడు. పరారీలో ఉన్న నిందితుడు పవన్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బోడియా కమల్పూర్ గ్రామానికి చెందిన యువతిని పవన్ కుమార్ గత నెల 5న అపహరించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను తీసుకుపోయాడు. బంధువుల ఇంట్లో ఉంచి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడి ఎలాగో తప్పించుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. ఆమెను వైద్యపరీక్షలకు పంపించారు.