సాక్షి, హైదరాబాద్: జగదేవ్‌పూర్ మండలం రామారంలో దళిత బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని బీజేపీ ప్రధానకార్యదర్శి చింతా సాంబమూర్తి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయనొక ప్రకటన విడుదల చేశారు. ఘనట జరిగి 2 రోజులైనా దోషు లను అరెస్టు చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. వెంటనే దోషులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి 5 ఎకరాల భూమి, రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment