
రోడ్డుపై నిలిచిన వర్షం నీరు
- ఇళ్లలోకి నీరు చేరడంతో ఇబ్బందులు పడిన ప్రజలు
జగదేవ్‌పూర్: మండలంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తిగుల్ గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు, మిషన్ భగీరథ పనుల కారణంగా ప్రధాన వీధుల్లో మురికి కాల్వలు లేకుండాపోయాయి. వర్షం కురవడంతో నీరు రోడ్డుపై నిలిచింది. దీంతో కొంత సేపు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అలాగే బీసీ కాలనీలో మురికి కాల్వలు నిండి నీళ్లు ఇళ్లలోకి చేరాయి. ఇళ్లలోని నీళ్లను బయటికి ఎత్తిపోసుకున్నారు. కాలనీవాసులు మాట్లాడుతూ నీళ్లు వెళ్లేందుకు మురికి కాలువలు ఏర్పాటు చేయాలని అధికారులను కొరారు.