బాలికపై సమీప బంధువు కన్నేశాడు. బాలిక తల్లిదండ్రులు లేని సమయం చూసి కాటేశాడు.
♦ బాలిక తమ్ముడిపై హత్యాయత్నం
♦ న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు
♦ పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు
గణపురం : బాలికపై సమీప బంధువు కన్నేశాడు. బాలిక తల్లిదండ్రులు లేని సమయం చూసి కాటేశాడు. వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరుకు చెందిన దళిత బాలిక (13) స్థానిక ప్రభుత్వం పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో సమీప బంధు వు అల్లూరి వినయ్ మరో బాలికతో సదరు బాలికను అల్లూరి తిరుపతి ఇంటికి పిలిపిం చాడు. ఆ బాలిక ఇంట్లోకి రాగానే తలుపులు వేసి అత్యాచారం చేశాడు. బాలిక సోదరుడు కల్లెపు వినయ్ తన అక్కకోసం వచ్చి తిరుపతి ఇంట్లో జరుగుతున్న సంఘటనను చూసి మొత్తుకున్నాడు.
అమ్మనాన్నలతో చెప్పుతానని వెనుతిరిగాడు. అల్లూరి వినయ్ తలుపులు తీసి బాలి కను బయటకు పంపించి వెంటనే తన మిత్రులను జతచేసి ఆటోలో వెళ్లి కల్లెపు వినయ్‌ను పట్టుకుని జంగుపల్లివైపు వచ్చారు. హత్యాప్రయత్నం చేయబోగా విషయం ఎవరికీ చెప్పననడంతో వదిలారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరగగా.. మంగళవారం సదరు బాలిక తన తల్లిదండ్రులతో కలసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడు అల్లూరి వినయ్‌తో పాటు, ఆరెల్లి అబ్దులు, ఎ.శ్రీకాంత్ (బాతు), సిలివేరు రాకేష్, అల్లూరి సిద్దులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినయ్ వెంటనే వెళ్లిన నలుగురికి అత్యాచార సంఘటన గూర్చి తెలియదు. కానీ, స్నేహితుడు వినయ్ వెంట ఆటోలో వెళ్లారు. నలుగురులో ముగ్గురు మైనర్లే.