Rhea pillai
-
పేస్-రియాల వివాదం.. మరో ఏడాది గడువు!
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, అతనితో సహజీవనం చేసిన మాజీ స్నేహితురాలు రియా పిళ్లై మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ‘కుటుంబ సంరక్షణ కేసు’లో దిగువ కోర్టుకు సుప్రీం కోర్టు మరో ఏడాది గడువు ఇచ్చింది. పేస్, రియా మధ్య ఉన్న వివాద పరిష్కారానికి సంవత్సరం వ్యవధి ఇచ్చి ఆపై తీర్పునివ్వాలని ఫ్యామిలీ కోర్టును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 2014లో పేస్పై రియా గృహ హింస కేసు పెట్టడంతో తొలిసారి వివాదం కోర్టుకు చేరింది. తమ కూతురు సంరక్షణ, భరణం అంశాల్లో వీరిద్దరి మధ్య వివాదం ముదిరింది. వీరిద్దరు కూర్చొని సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు సూచించినా అది సాధ్యం కాలేదు. భరణం కింద ఇల్లు గానీ డబ్బు గానీ ఇవ్వాలని రియా కోరగా... తాను అసలు ఆమెను పెళ్లే చేసుకోలేదు కాబట్టి కుదరదని పేస్ కోర్టులో మరో కేసు దాఖలు చేశాడు. -
మాజీ క్రికెటర్ అతుల్ శర్మకు ఊరట!
ముంబై: మాజీ క్రికెటర్ అతుల్ శర్మ స్టానిక కోర్టులో ఊరట లభించింది. తనను, తన కూతుర్ని చంపుతానంటూ బెదిరించారని అతుల్ శర్మపై టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో లియాండర్ పేస్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ముంబై స్థానిక కోర్టు... అతుల్ శర్మను నవంబర్ 27 తేది వరకు అరెస్ట్ చేయవద్దని తీర్పునిచ్చింది. గతంలో రియాపిళ్లై,లియాండర్ పేస్ లిద్దరూ సహజీవనం చేశారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా కోర్టులో వివాదాలు నడుస్తున్నాయి. రియాపిళ్లై తో అతుల్ శర్మ సన్నిహితంగా ఉంటున్నట్టు మీడియాలో రూమర్లు చెలరేగుతున్నాయి. -
అతుల్ శర్మ నన్ను చంపుతానని బెదిరించాడు: పేస్
ముంబై: తనను, తన కూతుర్ని చంపుతానని బెదిరించారని క్రికెటర్ అతుల్ శర్మపై టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అతుల్ శర్మతో తన మాజీ భార్య రియా పిళ్లై తో సంబంధాలున్నట్టు తెలిపే సాక్ష్యాధారాలను కోర్టుకు పేస్ సమర్పించారు. బంద్రా కోర్టు కాంప్లెక్స్ లో నన్ను, నాకూతుర్ని చంపుతానని అతుల్ శర్మ బెదిరించారని లియాండ్ పేస్ తెలిపారు. లియాండర్ పేస్ ఫిర్యాదు మేరకు అతుల్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
నా కూతురిని నేనే సంరక్షిస్తా
న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పేస్ ముంబై: భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ఈసారి భిన్నమైన కోర్టులో ఏస్ సంధించాడు. అయితే టెన్నిస్ మ్యాచ్‌లో పాయింట్ కోసం కాదు.. తన మాజీ జీవన సహచరి రియా పిళ్లైకి, తనకు జన్మించిన కూతురి సంరక్షణ బాధ్యతల కోసం. రియా బాధ్యతారహిత ప్రవర్తన కారణంగా తన కూతురిలో అభద్రతా భావం నెలకొనే ప్రమాదం ఉందని, పాప సంరక్షణ బాధ్యతలు తనకే అప్పగించాలని కోరుతూ బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టులో పేస్ పిటిషన్ దాఖలు చేశాడు. కోర్టు అనుమతి లేకుండా పాపను రియా ముంబై దాటి బయటికి తీసుకెళ్లకుండా ఆదేశించాలని కోరాడు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ మాజీ భార్య అయిన రియా పిళ్లై 2003లో విమాన ప్రయాణంలో పేస్‌కు పరిచయమైంది. ఆ తరువాత వీరికి 2006లో కూతురు జన్మించింది. వీరికి చట్టబద్ధంగా మాత్రం వివాహం కాలేదు. సంజయ్‌దత్‌తో రియాకు అధికారికంగా గత ఏడాది మాత్రమే విడాకులు వచ్చాయి. అయితే సంజయ్‌దత్‌తో 2005లోనే తనకు విడాకులు వచ్చాయంటూ రియా తనకు అబద్ధం చెప్పిందని పిటిషన్లో పేస్ పేర్కొన్నాడు. తాము కలిసివున్న రోజుల్లో పాప బాధ్యతలన్నిటినీ తానే చూసుకున్నానని, రియాకు ఆమె సొంత విషయాలు తప్ప ఏవీ పట్టవని తెలిపాడు. పాప భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆమె బాధ్యతల్ని తనకే అప్పగించాలని కోర్టును పేస్ అభ్యర్థించాడు.