నా కూతురిని నేనే సంరక్షిస్తా | Leander Paes moves court for his daughter's custody | Sakshi
Sakshi News home page

నా కూతురిని నేనే సంరక్షిస్తా

May 5 2014 1:24 AM | Updated on Sep 2 2017 6:55 AM

నా కూతురిని నేనే సంరక్షిస్తా

నా కూతురిని నేనే సంరక్షిస్తా

భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ఈసారి భిన్నమైన కోర్టులో ఏస్ సంధించాడు. అయితే టెన్నిస్ మ్యాచ్‌లో పాయింట్ కోసం కాదు.. తన మాజీ జీవన సహచరి రియా పిళ్లైకి, తనకు జన్మించిన కూతురి సంరక్షణ బాధ్యతల కోసం.

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పేస్
 ముంబై: భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ఈసారి భిన్నమైన కోర్టులో ఏస్ సంధించాడు. అయితే టెన్నిస్ మ్యాచ్‌లో పాయింట్ కోసం కాదు.. తన మాజీ జీవన సహచరి రియా పిళ్లైకి, తనకు జన్మించిన కూతురి సంరక్షణ బాధ్యతల కోసం.
 
  రియా బాధ్యతారహిత ప్రవర్తన కారణంగా తన కూతురిలో అభద్రతా భావం నెలకొనే ప్రమాదం ఉందని, పాప సంరక్షణ బాధ్యతలు తనకే అప్పగించాలని కోరుతూ బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టులో పేస్ పిటిషన్ దాఖలు చేశాడు.  కోర్టు అనుమతి లేకుండా పాపను రియా ముంబై దాటి బయటికి తీసుకెళ్లకుండా ఆదేశించాలని కోరాడు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ మాజీ భార్య అయిన రియా పిళ్లై 2003లో విమాన ప్రయాణంలో పేస్‌కు పరిచయమైంది.
 
 ఆ తరువాత వీరికి 2006లో కూతురు జన్మించింది. వీరికి చట్టబద్ధంగా మాత్రం వివాహం కాలేదు. సంజయ్‌దత్‌తో రియాకు అధికారికంగా గత ఏడాది మాత్రమే విడాకులు వచ్చాయి.

అయితే సంజయ్‌దత్‌తో 2005లోనే తనకు విడాకులు వచ్చాయంటూ రియా తనకు అబద్ధం చెప్పిందని పిటిషన్‌లో పేస్ పేర్కొన్నాడు. తాము కలిసివున్న రోజుల్లో పాప బాధ్యతలన్నిటినీ తానే చూసుకున్నానని, రియాకు ఆమె సొంత విషయాలు తప్ప ఏవీ పట్టవని తెలిపాడు. పాప భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆమె బాధ్యతల్ని తనకే అప్పగించాలని కోర్టును పేస్ అభ్యర్థించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement