
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, అతనితో సహజీవనం చేసిన మాజీ స్నేహితురాలు రియా పిళ్లై మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ‘కుటుంబ సంరక్షణ కేసు’లో దిగువ కోర్టుకు సుప్రీం కోర్టు మరో ఏడాది గడువు ఇచ్చింది. పేస్, రియా మధ్య ఉన్న వివాద పరిష్కారానికి సంవత్సరం వ్యవధి ఇచ్చి ఆపై తీర్పునివ్వాలని ఫ్యామిలీ కోర్టును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 2014లో పేస్‌పై రియా గృహ హింస కేసు పెట్టడంతో తొలిసారి వివాదం కోర్టుకు చేరింది.
తమ కూతురు సంరక్షణ, భరణం అంశాల్లో వీరిద్దరి మధ్య వివాదం ముదిరింది. వీరిద్దరు కూర్చొని సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు సూచించినా అది సాధ్యం కాలేదు. భరణం కింద ఇల్లు గానీ డబ్బు గానీ ఇవ్వాలని రియా కోరగా... తాను అసలు ఆమెను పెళ్లే చేసుకోలేదు కాబట్టి కుదరదని పేస్ కోర్టులో మరో కేసు దాఖలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment