Ribbon
-
షర్ట్ మార్చేద్దాం..
న్యూలుక్ షర్ట్, టీ షర్ట్స్ అమ్మాయిల జాబితాలో ఎప్పుడో చేరిపోయాయి. ఎప్పుడూ వాటిని ఒకే మోడల్లో ధరిస్తే బోర్. వాటికే కొత్త హంగులు అద్దితే... చిన్న మార్పుతో ఫ్యాషన్‌లో ముందు వరసలో ఉండచ్చు. ఇందుకు చేయవలసిందల్లా... నచ్చిన టీ షర్ట్‌ని ఎంచుకోవాలి. మెడ భాగం, సైడ్స్ భాగం ఫొటోలో చూపిన విధంగా కట్ చేయాలి. కాంట్రాస్ట్ రిబ్బన్ని జత చేయాలి. ఒక కొత్త టాప్ రెడీ. షర్ట్ రూపం కొత్తగా మార్చేయాలంటే.. కాలర్ కింది భాగం అంటే ఛాతీ భాగం కత్తిరించి దీనికి లేస్ ఫ్యాబ్రిక్‌ని జత చేయాలి. షర్ట్‌తో చేసిన టాప్ ట్రెండీగా కనిపిస్తుంది. వైట్ కలర్ కాలర్ ఉన్న చొక్కాను తీసుకోవాలి. కాలర్ భాగాన్ని ఉంచి, కేవలం ఛాతీ పై భాగాన్ని మాత్రమే కట్ చేయాలి. లేస్ ఫ్యాబ్రిక్‌ని జత చేయాలి. అలాగే చేతులను షార్ట్ స్లీవ్స్ వచ్చేలా కట్ చేసి సన్నగా కుట్టాలి. ఇలా డిజైన్ చేసుకున్న న్యూ షర్ట్ టాప్... జీన్స్ మీదకు స్టైలిష్‌గా కనిపిస్తుంది. పొడవాటి చేతుల చొక్కా లేదా టీ షర్ట్‌ని ఎంచుకోవాలి. చొక్కాకున్న కాలర్ పార్ట్, హ్యాండ్స్, బాటమ్ పార్ట్స్‌ని కత్తిరించాలి. దీనికి అదే రంగు జార్జెట్ మెటీరియల్ లేదా లేస్‌ను జత చేసి కుట్టాలి. ఓ కొత్త రకం టాప్ క్యాజువల్ వేర్‌గా రెడీ అయిపోతుంది. -
అందమైన బంధనం
జిగేల్ ఒకప్పుడు జడకు రిబ్బన్ కడితే పల్లెటూరి పిల్ల అనేవారు. ఇప్పుడు తలకు ‘బంధనా’ చుట్టకపోతే అలా అంటున్నారు. ఎందుకంటే ఇదిప్పుడు లేటెస్ట్ అండ్ హాటెస్ట్ ఫ్యాషన్. రిబ్బన్ కంటే వెడల్పుగా.. స్కార్ఫ్ కంటే కాస్త చిన్నగా ఉండేదే బంధన్. సిల్క్, క్రేప్, కాటన్... మెటీరియల్ ఏదైనా కావొచ్చు. పువ్వులు, గీతలు, చుక్కలు... డిజైన్ ఏదైనా అవ్వొచ్చు. బంధనా అంటేనే అట్రాక్షన్. బంధనా కడితేనే ఫ్యాషన్. ఒకప్పుడు తొంభైల్లో బాలీవుడ్ తారామణులు ఈ ఫ్యాషన్‌ని అనుసరించారు. ఇప్పుడు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ అందరూ తలకు బంధనాని చుట్టేస్తున్నారు. మీరు మాత్రం ఎందుకు ఆగడం? వెంటనే బంధనాతో బంధం పెంచుకోండి. మీ స్టైల్‌ని అప్డేట్ చేసుకోండి. -
పేపర్ ప్లేట్ చేతాళాలు
ఒకే పరిమాణం గల రెండు కాగితపు ప్లేట్లను తీసుకోండి. వాటి మధ్యభాగంలో మూడు అంగుళాల దూరం ఉండేలా రెండు రంధ్రాలు చేయండి. అక్రిలిక్ లేదా పోస్టర్ కలర్స్‌తో ఆరంజ్ లేదా బంగారురంగును పేపర్ ప్లేట్ నిండా పూయాలి. రంగులు ఆరాలి. తరువాత పది అంగుళాల పొడవైన బంగారురంగు రిబ్బన్ ముక్కలను తీసుకుని పేపర్ ప్లేట్ రంధ్రంలోకి దూర్చి లోపలివైపు ముడివేయాలి. ప్లేట్ల అంచుల వెంబడి చిన్న నాణాలను లేదా మెటల్ బటన్స్‌ని అతికించాలి. చేతాళాలు సిద్ధమైపోయాయి. ఇక వాయించడం మీ వంతు. టాంబురైన్ రెండు పేపర్ ప్లేట్లు తీసుకోండి. ఒకేసారి వాటి అంచుల వెంబడి సమానమైన దూరం ఉండేలా నాలుగు లేక ఐదు రంధ్రాలు చేయండి. తరువాత ప్లేట్ వెనుక వైపు మీకు నచ్చిన బొమ్మలు గీసి రంగులు వేయండి. రెండు ప్లేట్ల అంచులను రంగులు వేయని వైపు కలిపి గ్లూతో అతికించండి. తీగకు లేదా దారానికి చిన్నమువ్వను ఎక్కించి ప్లేటు అంచులకు ఉన్న రంధ్రాలకు కట్టాలి. ఇప్పుడు టాంబురైన్ని పట్టుకుని చేత్తో ఊపండి. గలగలమంటుంది. షేకర్స్ రెండు పేపర్ కప్పులు తీసుకోండి. ఒక కప్పు సగం వరకు బియ్యం లేదా ఏవైనా పూసలు, మువ్వలు వేయండి. తరువాత రెండో కప్పును మొదటి కప్పుపై బోర్లించి వాటి అంచులను గ్లూతో అతికించండి. దానిపై పెన్సిల్‌తో బొమ్మలు గీసి రంగులు వేయండి. రెండు పేపర్ రిబ్బన్ ముక్కలు తీసుకుని బొమ్మలో చూపించిన విధంగా అతికించండి. ఇవి ఆడుకోవడానికే..