అందమైన బంధనం
జిగేల్
ఒకప్పుడు జడకు రిబ్బన్ కడితే పల్లెటూరి పిల్ల అనేవారు. ఇప్పుడు తలకు ‘బంధనా’ చుట్టకపోతే అలా అంటున్నారు. ఎందుకంటే ఇదిప్పుడు లేటెస్ట్ అండ్ హాటెస్ట్ ఫ్యాషన్. రిబ్బన్ కంటే వెడల్పుగా.. స్కార్ఫ్ కంటే కాస్త చిన్నగా ఉండేదే బంధన్. సిల్క్, క్రేప్, కాటన్... మెటీరియల్ ఏదైనా కావొచ్చు. పువ్వులు, గీతలు, చుక్కలు... డిజైన్ ఏదైనా అవ్వొచ్చు. బంధనా అంటేనే అట్రాక్షన్.
బంధనా కడితేనే ఫ్యాషన్. ఒకప్పుడు తొంభైల్లో బాలీవుడ్ తారామణులు ఈ ఫ్యాషన్‌ని అనుసరించారు. ఇప్పుడు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ అందరూ తలకు బంధనాని చుట్టేస్తున్నారు. మీరు మాత్రం ఎందుకు ఆగడం? వెంటనే బంధనాతో బంధం పెంచుకోండి. మీ స్టైల్‌ని అప్‌డేట్ చేసుకోండి.