ఇప్పటిదొక కాలం
ఆనాటి ప్రేమలు వేరు ఆ కలయికల తీరు వేరు మమతల మాధుర్యం వేరు మాటలకు విలువలు వేరు
ఈనాటి పలకరింపులు వేరు సంబంధాలకిచ్చే గౌరవం వేరు పిలిస్తే పలకడం వేరు వెళ్తే స్వాగతాలు వేరు
పోల్చుకుంటూ పోతే దానికీ దీనికీ పోటీ కుదరదు వాదించుకుంటూ కూర్చుంటే పంచుకోవడానికి ప్రేమే మిగలదు
అది అప్పటిదొక కాలం ఇది ఇప్పటిదొక కాలం అన్నిటినీ పక్కన పెట్టి సర్దుకొని పోవడమే జీవితం
- ఆశారాజు