rickshaw puller
-
మేమొస్తే బెంగాల్లో పారిశ్రామికీకరణ
సింగూరు/హౌరా/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికీకరణ చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం సింగూరులో భారీ రోడ్ షో నిర్వహించారు. భూసేకరణకు వ్యతిరేకంగా గతంలో తీవ్రస్థాయిలో పోరాటం జరిగిన ఇదే ప్రాంతంలో అమిత్ షా పారిశ్రామికీకరణ హామీ ఇవ్వడం విశేషం. తాము అధికారంలోకి రాగానే సింగూరులో చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. పరిశ్రమల స్థాపనతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, బంగాళదుంప రైతులను ఆదుకోవడానికి రూ.500 కోట్లతో ప్రత్యేక నిధిని నెలకొల్పుతామని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించామని గుర్తుచేశారు. రోడ్ షో సందర్భంగా అమిత్ షా మీడియాతో మాట్లాడారు. తాము ద్వేష రాజకీయాలు కాదు, అభివృద్ధి రాజకీయాలు చేస్తామన్నారు. దీదీ చాలా ఆలస్యం చేశారు బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార సభల్లో హిందూ దేవుళ్లను పూజించడం, చండీ స్తోత్రాలు పారాయణం చేయడాన్ని అమిత్ షా స్వగతించారు. అయితే, ఆమె ఇప్పటికే చాలా ఆలస్యం చేశారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను బీజేపీ 200కి పైగా స్థానాలు గెలుచుకుంటుందని పునరుద్ఘాటించారు. సింగూరులో బీజేపీ అభ్యర్థిగా రవీంద్రనాథ్ భట్టాచార్య(89) పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి టికెట్ నిరాకరించడంతో బీజేపీలో చేరారు. మొదటి 3 దశల్లో 63–68 సీట్లు గెలుస్తాం బెంగాల్లో ఇప్పటివరకు మూడు దశల శాసనసభ ఎన్నికలు పూర్తయ్యాయి. 91 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, వీటిలో 63 నుంచి 68 స్థానాలను తాము దక్కించుకోవడం తథ్యమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలపై భారీ ఆధిక్యత సాధిస్తామని అన్నారు. మిగిలిన ఐదు దశల ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు గెలుచుకుంటామని తెలిపారు. 200కు పైగా సీట్లు సాధించాలన్న లక్ష్యాన్ని ఛేదిస్తామని వ్యాఖ్యానించారు. ఆయన హౌరా జిల్లాలోని దోంజూర్ నియోజకవర్గంలో ఒక రిక్షా కార్మికుడి ఇంట్లో బుధవారం మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రిక్షావాలా ఇంట్లో అమిత్ షా కింద కూర్చొని పప్పు కూరతో అన్నం తిన్నారు. అంతకుముందు దోంజూర్‌లో రోడ్ షోలో పాల్గొన్నారు. మల్లిఖ్ ఫటాక్‌లోనూ రోడ్ షో నిర్వహించారు. మమతా బెనర్జీ పెద్ద నాయకురాలని, పెద్ద సీట్ల తేడాతోనే ఆమె ఓడిపోతారని అమిత్ షా జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రౌడీయిజాన్ని అంతం చేస్తామని హామీ ఇచ్చారు. అక్రమ వలసలను కఠినంగా అణచి వేస్తామని, సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేస్తామని వెల్లడించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో విద్యా వ్యవస్థను సంస్కరిస్తున్నామని, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామని, పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. -
రిక్షాలో ఉన్నదెవరో చెప్పుకోండి?
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ చలికి వణుకుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న చలితో హస్తిన వాసులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. చలి పులి మనుషులనే కాదు మూగ ప్రాణలను వణికిస్తోంది. వాటి బాధను అర్థం చేసుకున్న మంచి మనిషి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హయత్ అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన ఈ ఫొటో హృదయాలను కదిలిస్తోంది. రిక్షా నడిపే వ్యక్తి కుక్కను దుప్పటి చుట్టి తన రిక్షాలో కూర్చోబెట్టి తీసుకున్నపోతున్న దృశ్యం ఫొటోలో ఉంది. ఈ ఫొటోకు దాదాపు 4 వేల లైకులు వచ్చాయి. రిక్షా పుల్లర్‌ను ప్రశంసిస్తూ చాలా మంది ట్విటర్లో కామెంట్లు పెడుతున్నారు. వారిద్దరూ పరస్పర విశ్వాసం, నిజాయితీ, గౌరవం కలిగివున్నారడానికి ఈ ఫొటో అద్దం పడుతోందని ఒకరు పేర్కొన్నారు. భావోద్వేగ, స్ఫూర్తిదాయక చిత్రం అంటూ మరొకరు మెచ్చుకున్నారు. మౌలానా ఆజాద్ రోడ్‌లోని హోలీ ఆస్పత్రి సమీపంలోని ప్రతిరోజు రిక్షా పుల్లర్ కుక్కను ఇలాగే తన రిక్షాలో తీసుకెళతాడని, ఈ దృశ్యాన్ని చాలాసార్లు చూశానని అభిషేక్ షా అనే వ్యక్తి వెల్లడించారు. ఈరోజు ఇంటర్నెట్లో తాను చూసిన మంచి ఫొటో ఇదని ఇంకొందరు ప్రశంసించారు. zoom in on the rickshaw and thank the heavens later pic.twitter.com/PFDvrlwxGw — hayat ✨ (@sevdazola) January 2, 2020 -
వర్షం రూపంలో అదృష్టం: రిక్షావాలకు 50 లక్షల లాటరీ
దిమాపూర్: పశ్చిమ బెంగాల్‌కు చెందిన గౌర్ దాస్ రిక్షావాలా.. పొరుగున ఉన్న నాగాల్యాండ్‌లోని దిమాపూర్ నగరంలో రిక్షా నడుపుకుంటూ.. బతుకు వెళ్లదీసే గౌర్ దాస్ దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. నాగాల్యాండ్ ప్రభుత్వ లాటరీలో అతను తాజాగా రూ. 50 లక్షలు గెలుపొందాడు. దీంతో రిక్షావాలా కాస్తా ఓవర్‌నైట్ రిచ్వాలా అయిపోయాడు. ఆ రోజు వర్షమే రాకపోతే.. సెప్టెంబర్ 29వ తేదీన గౌర్ దాస్ తన తోటి రిక్షా యూనియన్ స్నేహితులతో కలిసి పిక్నిక్కు వెళ్లాలనుకున్నాడు. కానీ ఆ రోజు తెడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పిక్నిక్ వెళ్లాలన్న ఆలోచన మానుకున్నాడు. ఈ తర్వాత ఇంటికి తిరిగొస్తుండగా ఓ వ్యక్తి ఎదురుపడి.. నాగాలాండ్ ప్రభుత్వ లాటరీ టికెట్లు కొనుమంటూ బతిమాలాడు. గౌర్ దాస్ వద్దు జేబులో 70 రూపాయలు మాత్రమే ఉన్నాయి. లాటరీ టికెట్టు ధర రూ. 30. లాటరీ కొనాలని లేకపోయినా.. అమ్మే వ్యక్తి పదేపదే బతిమాలి.. బలవంతం చేయడంతో దానిని కొన్నాడు. ఆ రోజు వర్షం పడకపోయి ఉంటే.. తాము పిక్నిక్కు వెళ్లేవాళ్లమని, లాటరీ టికెట్‌ను తాను కొని ఉండేవాడిని కాదని గౌర్ దాస్ ‘న్యూస్-18’కు తెలిపాడు. గత ఆదివారం లాటరీ ఫలితాలు వచ్చాయి. తనకు అంతగా నమ్మకం లేకపోయినా ఓ దుకాణం వద్దకు వెళ్లి ఫలితాలను చెక్ చేసిన గౌర్ దాస్ షాక్ తిన్నాడు. లాటరీ విజేతల్లో తన టికెట్ నంబర్ ఉంది. తనకు రూ. 50 లక్షలు వచ్చాయి. ఆనందంతో ఎగిరి గంతేసిన గౌర్ దాస్ తన భార్యకు మాత్రేమే ఈ విషయాన్ని చెప్పాడు. కానీ, సెక్యూరిటీ భయంతో ఇరుగు-పొరుగు వారికి చెప్పలేదు. మరునాడు బ్యాంకుకు వెళ్లి లాటరీ టికెట్‌ను డిపాజిట్ చేశాడు. ఈ లోపు ఈ వార్త మీడియాలో రావడంతో లాటరీ విజేతగా గౌర్ దాస్ స్థానికంగా ఫేమస్ అయిపోయాడు. -
డాక్యుమెంటరీ ‘హీరో’ దుర్మరణం
సాక్షి, న్యూఢిల్లీ : అది రంజాన్ మాసం రోజులు. పాత ఢిల్లీలోని ఓ రోడ్డు మీద ఇల్లూ వాకిలి లేని ఓ యాభై ఏళ్ల అనాథ పడుకొని ఉన్నాడు. వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు అతని మీదుగా దూసుకెళ్లి పల్టీ కొట్టింది. అల్లంత దూరాన ఎగిరిపడ్డ ఆ అనాథ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు గుర్తు తెలియని వ్యకిగా పేర్కొంటూ శవాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి పంపించారు. పోస్టు మార్టమ్ అనంతరం 15 రోజులు అయినాగానీ ఆయన శవం మార్చురీలోనే ఉండిపోయింది. గుర్తు తెలియని వ్యక్తి మరణించినప్పుడు స్థానిక పత్రికల్లో ఆయన ఫొటోగానీ, వార్తగానీ రావాలట. అప్పటి వరకు శవాన్ని శ్మశానికి పంపించమని పోలీసులు తెలిపారు. రోడ్డు పక్కనో, రోడ్డు డివైడర్ మీద గూడులేని పేదలు, అనాథలు పడుకుంటూనే ఉంటారు. నిర్లక్ష్యంగానో, తాగిన మైకంలోనో ట్రక్కులనో, బస్సులనో నడుపుకుంటూ రావడం, అవి రోడ్డు డివైడర్‌కో, ఫుట్పాత్లనో ఢీకొనడం, అనాథలు, అభాగ్యులు మరణించడం సర్వసాధారణం. అలాంటప్పుడు ‘రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి’ అనే శీర్షికన వార్త రావాలంటే కష్టమే. గుర్తు తెలిసిన వ్యక్తుల మరణిస్తేనే స్థలాభావం వల్ల వార్త రాదు. ఇక గుర్తు తెలియని వ్యక్తి గురించి ఎవరు పట్టించుకుంటారు? అలాంటి వారు ఎక్కడి నుంచి వచ్చారో! ఎలా బతికారో ఎవరికి ఎరుక! వారికి దహన సంస్కారాలుగానీ, నివాళులుగానీ ఉండవు. అసలు అలాంటి వారికి జీవించిన దాఖలాలు కూడా ఉండవు. ఆ రోజు ఆ రోడ్డు డివైడర్ మీద పడుకొని దుర్మరణం చెందిన వ్యక్తి మాత్రం గుర్తు తెలియని వ్యక్తి కాదు. ఆయన పేరు మొహమ్మద్ అబ్దుల్ కాసిం అలీ షేక్. రిక్షా కార్మికుడు. పశ్చిమ బెంగాల్ నుంచి ఎనిమిదవ ఏట బతుకు తెరువు కోసం ఢిల్లీకి వచ్చాడు. బెంగాల్ నుంచి అయినవాళ్లెవరో బలవంతంగా పంపిస్తే ఢిల్లీకి వచ్చినట్లు ఆయనకు గుర్తు. పంపించిన వారు ఎవరో, ఏమిటో కూడా ఆయనకు గుర్తు లేదు. అప్పటి నుంచి చిన్న చితకా పనులు చేస్తూ దానితో దొరికిన కాడికి తింటూ రోడ్లపై పడుకుంటూ పెరిగాడు. లైంగిక వేధింపులు కాస్త యుక్త వయస్సు రాగానే షేక్‌కు లైంగిక వేధింపులు ప్రారంభమయ్యాయి. ఇంట్లో పని ఇప్పిస్తానంటూ, భోజనం పెట్టిస్తానంటూ మగవాళ్లే ఆ కుర్రవాణ్ని తీసుకెళ్లి వారి లైంగిక వాంఛలు తీర్చుకునేవారట. పూర్తి యవ్వనంలోకి అడుగుపెట్టాక అలాంటి వారిని దూరం పెట్టేందుకు నెలలకొద్ది స్నానం చేసేవాడు కాదట షేక్. అలా వారి పీడను వదిలించుకున్న అలీ షేక్, తాను కూడ బెట్టుకున్న డబ్బులతో సొంతంగా రిక్షా కొనుక్కున్నాడు. ఆ తర్వాత ఆమన్ బిరాదరిలో తనలాంటి నిరాశ్రీయులు నడుపుతున్న అనాథాశ్రయంలో చేరాడు. ఓ రోజు ఆరోగ్యం బాగా లేక వైద్యుడిని దగ్గరికెళ్లి పరీక్షలు చేయించుకుంటే ‘ఎయిడ్స్’ వ్యాధి ముదిరిందని తెల్సింది. ఆయనపై డాక్యుమెంటరీ చిత్రం ఈ మధ్యన ‘కారవాన్ ఏ మొహమ్మద్’ అనే బృందం ఆయనకు తారసపడింది. సామాజిక సమస్యలపై పోరాడే ఆ బృందం అలీ షేక్ మీద చిన్న డాక్యుమెంటరీ చిత్రాన్ని తీసింది. అందులో ఆయన తన ఆత్మకథను చెబుతూ వలసవచ్చిన వారు ఎప్పుడూ నిరాశ్రీయులేనని, కష్టపడి డబ్బు సంపాదించి సొంతంగా ఇల్లు కట్లుకున్నాక కూడా ఈ నేల నీది కాదంటూ తరిమేస్తారంటూ ఓ బెంగాలీ కవితను ఉదహరిస్తాడు. అలీ షేక్ చనిపోయిన రోజున అనాథాశ్రమంలో దోమల బెడద తట్టుకోలేక రోడ్డు డివైడర్ మీదకు వచ్చి పడుకున్నాడు. ఆయన లాగా ఎంతోమంది అనాథలు. అభాగ్యులు ప్రాణాలను పణంగా పెట్టి డివైడర్లమీదనో, ఫుట్‌పాత్‌లపైనే పడుకోవడానికి అసలు కారణం దోమలేనట. వాహనాలు తిరేగే చోట వాహన కాలుష్యానికి దోమలు అస్సలు ఉండవట. రోడ్లపై వీచే గాలిలో వాహనాల శబ్దాలను తట్టుకొని నాలుగైదు గంటలు పడుకునేందుకు వారు అంతటి సాహసం చేస్తారు. రోజు చస్తూ బతికే జీవితాల్లో అదే అత్యంత సుఖం కాబోలు. పోలీసుల సహకారంలో ఆస్పత్రి మార్చురీ నుంచి అలీ షేక్ శవాన్ని స్వాధీనం చేసుకున్న ‘కారవాన్ ఏ మొహమ్మద్’ బృందం సభ్యులు ఆయనకు దహన సంస్కారాలు చేసి ఘనంగా నివాళులర్పించింది. -
తాగేసి.. పోలీసును చితకబాదేశాడు!
అతడో రిక్షా కార్మికుడు. అతడికి బాగా మద్యం తాగే అలవాటుంది. తూర్పు ఢిల్లీ నడి వీధుల్లో అలాగే పూటుగా మద్యం తాగి వెళ్తూ.. మహిళలను దుర్భాషలాడుతుండగా ఓ ట్రాఫిక్ పోలీసు అతడిని చూశాడు. ఆపేందుకు ప్రయత్నించాడు.. అంతే, రిక్షా కార్మికుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. గతంలో తనను ట్రాఫిక్ పోలీసులు ఆపి వేధించిన విషయాలు ఏవైనా గుర్తుకొచ్చాయో ఏమో గానీ, ఇప్పుడు తనను ఆపిన కానిస్టేబుల్‌ను పట్టుకుని చితక బాదేశాడు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని మధువిహార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి రిక్షా కార్మికుడిని అరెస్టు చేశారు. అయితే, తన పేరు చెప్పే పరిస్థితిలో గానీ, వాంగ్మూలం ఇచ్చే పరిస్థితిలో గానీ అతగాడు లేడట!