డివైడర్ ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
మెదక్: మెదక్ జిల్లాలోని గజ్వేల్ మండలం రిమ్మనగూడ హైవేపై మంగళవారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి అక్కడిక్కడే మృతిచెందగా, మరో విద్యార్థికి తీవ్రగాయాలు అయ్యాయి.
వారు ప్రయాణిస్తున్న బైక్ డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. గాయపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.