rising price
-
బంగారం ధర పెరుగుతుందా..? తగ్గుతుందా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు?
నరసాపురం(పశ్చిమగోదావరి): 20 రోజుల క్రితం తగ్గిన బంగారం ధరలు మళ్లీ 10 రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నాయి. ధరలు ఇంకా తగ్గుతాయని కొన్ని నెలలుగా బులియన్ వర్గాలు విశ్లేషిస్తూ వస్తున్నాయి. అయితే సీన్ రివర్స్ అయ్యింది. వారం రోజుల నుంచి పసిడి ధరలు పెరుగుతున్నాయి మరో వైపు వెండిదీ అదే దారి. ప్రస్తుతం నరసాపురం మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 53,400, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.48,200 వద్ద ట్రేడవుతోంది. 916 కేడీఎం ఆభరణాల బంగారం కాసు ప్రస్తుతం రూ 38,550కు చేరింది. నెలరోజుల క్రితం కాసుధర రూ.37,024గా ఉంది. నెలరోజుల్లో రూ.1536లు పెరిగింది. కిలో వెండి ధర 62,000గా ట్రేడవుతోంది. చదవండి: లోన్ యాప్స్ వేధింపులకు ఇక చెక్.. ట్రోల్ ఫ్రీ నంబర్ రిలీజ్ చేసిన హోంశాఖ నెలరోజుల క్రితం వరకూ బంగారం ధరలు తగ్గుతూ వస్తుండటంతో ఇంకా తగ్గుతాయని బులియన్ వర్గాలు అంచనా వేశాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. చైనా, ఆ్రస్టేలియా, లాటిన్ అమెరికా దేశాలు భారీగా బంగారం నిల్వలను పెంచుకునే ప్రయత్నం చేయడం, రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం చల్లారకపోవడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని అంటున్నాయి. రూపాయి మారకం విలువ రికార్డుస్థాయిలో పడిపోవడం మరో కారణం. షేర్మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీంతో మదుపర్లు బంగారం వైపు మళ్లడం ధరల పెరుగుదలకు కారణాలుగా మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింతగా పెరగొచ్చని భావిస్తున్నారు. రూ.4 కోట్ల వరకూ తగ్గిన అమ్మకాలు బంగారం ధరల పెరుగుదల అమ్మకాలపై పడింది. మొన్నటి వరకూ కళకళలాడిన జ్యుయెలరీ షాపులు వెలవెల బోతున్నాయి. ఒక్క నరసాపురం మార్కెట్లోనే హోల్‌సేల్, రిటైల్ కలిపి రోజుకు రూ.5 కోట్ల వరకూ అమ్మకాలు జరుగుతాయి. ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతాయి. పెరిగిన ధరలతో ఉమ్మడి పశ్చిమలో రోజుకు రూ 4 కోట్లు వరకూ అమ్మకాలు తగ్గినట్లు అంచనా. దీపావళికి బంగారం అమ్మకాలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. ధరల పెరుగుదల దీపావళి అమ్మకాలపై కూడా ప్రభావం చూపుతుందని బులియన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వేచి చూసే ధోరణిలో కొనుగోలుదారుడు ప్రస్తుతం బంగారం కొనాలా? కొన్ని రోజులు ఆగాలా? అనే సందిగ్ధంలో కొనుగోలుదారుడు ఉన్నాడు. ధరలు ఇంకా తగ్గుతాయనే విశ్లేషణతో, బంగారం కొనుగోళ్ళను చాలామంది వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఒక్కసారిగా పెరుగుతున్న ధరలు వారిని షాక్‌కు గురిచేసాయి. ఇప్పుడేమో ధరలు ఇంకా పెరుగుతాయని చెప్పడంతో కొనాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉంది బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ నష్టాల్లో ఉంది. అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది. దీంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ధరలు పెరగడంతో నరసాపురం మార్కెట్లోనే దాదాపు 40 శాతం అమ్మకాలు తగ్గాయి. దీపావళి పండుగ అమ్మకాలపై కూడా ప్రభావం పడింది. పండుగకు ముందస్తు ఆర్డర్లు పెద్దగా రావడంలేదు. పెట్టుబడుల రూపంలో కొనుగోలు చేసే బిస్కెట్ అమ్మకాలు మాత్రం నిలకడగా సాగుతున్నాయి. – వినోద్‌కుమార్‌జైన్, నరసాపురం చాంబర్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
Sakshi Cartoon: పెరుగుతూనే ఉన్న పెట్రోల్ ధరలు
పెరుగుతూనే ఉన్న పెట్రోల్ ధరలు -
చమురు, బొగ్గు ధరల భారం
ముంబై: అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు, బొగ్గు ధరలు భారత్‌కు సవాలుగా మారనున్నట్లు ఫారిన్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ గురువారంనాటి తన తాజా నివేదికలో విశ్లేషించింది. ఇప్పటికే ద్రవ్యోల్బణం, వృద్ధి సవాళ్లు పొంచిఉన్న భారత్‌కు కీలక కమోడిటీల ధరలు పెరగడం ప్రతికూలాంశమని వివరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► చమురు ధరలు వార్షికంగా 14 శాతం పెరిగి బేరల్‌కు 84 డాలర్లకు చేరాయి. ఇక బొగ్గు ధర మెట్రిక్ టన్నుకు 15 శాతం ఎగసి 200 డాలర్లకు చేరింది. ఇంధన ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుదల భయాలు నెలకొన్నాయి. దీనితో వృద్ధి మందగించే అవకాశం ఉంది. ఆయా పరిస్థితులు ద్రవ్య పరపతి విధానం కఠినతరం కావడానికి దారితీయవచ్చు. ► 10 శాతం చమురు ధర పెరిగితే ఆ ప్రభావం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంపై 0.40 శాతం మేర ఉంటుంది. చమురు ప్రధాన దిగుమతి దేశమైన భారత్‌పై ఈ బిల్లు భారంగా మారుతుంది. 10 శాతం చమురు దరల పెరుగుదల ప్రభావం కరెంట్ అకౌంట్‌పై (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిధుల మధ్య నికర వ్యత్యాసం) 0.30 శాతం (జీడీపీ విలువతో పోల్చి) ప్రభావం చూపుతుంది. ► తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత్ నుంచి ఎగుమతులు మరింత పెరగాల్సి ఉంటుంది. 78కి రూపాయి: యూబీఎస్ స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ సేవల దిగ్గజం యూబీఎస్ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల వల్ల భారత్ కరంట్ అకౌంట్ లోటు 14 బిలియన్ డాలర్లక చేరుతుందని (జీడీపీలో 0.5 శాతం) పేర్కొంది. చమురు ధర 100 డాలర్లు తాకితే, క్యాడ్ 3 శాతం వరకూ పెరుగుతుందని యూబీఎస్ అంచనా వేసింది. దీనితో రూపాయి డాలర్ మారకంలో 78కి చేరే అవకాశం ఉంటుందని అంచనావేసింది. అయితే క్యాడ్ సమస్య భారత్‌కు తాత్కాలికంగానే ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. భారత్ ఉన్న భారీ విదేశీ మారకపు నిల్వలు (600 బిలియన్ డాలర్లకుపైగా) ఈ నష్టాన్ని కట్టడి చేయడానికి దోహదపడతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదే విధంగా 2022 మార్చి నాటికి క్రూడ్ ధర బేరల్‌కు 68 బిలియన్ డాలర్లకు దిగివస్తుందన్న అంచనాలనూ వెలువరించింది. బొగ్గు కొరత వల్ల విద్యుత్ ఉత్పత్తికి, సెమికండక్టర్ చిప్స్ వల్ల ఆటో రంగానికి స్వల్ప కాలంలో తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఎదురుకానున్నాయని విశ్లేíÙంచింది. వ్యవస్థలో అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకోవడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రివర్స్ రెపో రేటును (ఆర్బీఐ వద్ద ఉంచిన తమ అదనపు నిధులకుగాను బ్యాంకులు పొందే వడ్డీరేటు– ప్రస్తుతం 3.35 శాతం) పెంచే అవకాశం ఉందని సంస్థ అంచనావేసింది. ఈ రేటును 0.15 శాతం–0.20 శాతం శ్రేణిలో పెంచే వీలుందని పేర్కొంది. వచ్చే ఏడాది డిసెంబర్, ఫిబ్రవరి ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. -
విజయనగరంలో వైఎస్సార్సీపీ ధర్నా
-
'ఇంకా తగ్గని ఉల్లి' కష్టాలు
విజయవాడ: కొద్దిరోజులుగా ఉల్లికష్టాలు రాష్ట్రవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నదీ తెలిసిందే. దాదాపు 30 రోజులు దాటిని ఇంకా ఉల్లిధరలు దిగిరాలేదు. తాజాగా ఉల్లి కృష్ణా జిల్లా విజయవాడలోని రైతు బజారులో బుధవారం పరిస్థితిని చూసినట్లయితే.. భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం సబ్సిడీ ధరతో రూ.20కే కిలో ఉల్లిపాయలు ఇస్తున్నామని ప్రకటించింది. విషయం తెలుసుకున్న స్థానికులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. రేషన్, ఆధార్ కార్డులు చూపిస్తేనే కిలో ఉల్లిగడ్డలు ఇస్తామంటూ అధికారులు చెప్పటంతో పేద, మధ్య తరగతి మహిళలు క్యూలలో నిలబడ్డారు. గంటల తరబడి ఉల్లిగడ్డలు తీసుకుని ఇళ్లకు వెళ్లారు.