
'ఇంకా తగ్గని ఉల్లి' కష్టాలు
విజయవాడ: కొద్దిరోజులుగా ఉల్లికష్టాలు రాష్ట్రవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నదీ తెలిసిందే. దాదాపు 30 రోజులు దాటిని ఇంకా ఉల్లిధరలు దిగిరాలేదు. తాజాగా ఉల్లి కృష్ణా జిల్లా విజయవాడలోని రైతు బజారులో బుధవారం పరిస్థితిని చూసినట్లయితే.. భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం సబ్సిడీ ధరతో రూ.20కే కిలో ఉల్లిపాయలు ఇస్తున్నామని ప్రకటించింది.
విషయం తెలుసుకున్న స్థానికులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. రేషన్, ఆధార్ కార్డులు చూపిస్తేనే కిలో ఉల్లిగడ్డలు ఇస్తామంటూ అధికారులు చెప్పటంతో పేద, మధ్య తరగతి మహిళలు క్యూలలో నిలబడ్డారు. గంటల తరబడి ఉల్లిగడ్డలు తీసుకుని ఇళ్లకు వెళ్లారు.