సెల్వా చిత్రంలో సిమ్రాన్
టీనగర్ : సెల్వా దర్శకత్వంలో అరవింద్ స్వామి, రిత్తికా సింగ్ నటిస్తున్న చిత్రంలో నటి సిమ్రాన్ ముఖ్య పాత్రను పోషించనున్నారు. మేజిక్ బాక్స్ బ్యానర్‌పై నిర్మాత గణేశ్ నిర్మిస్తున్న చిత్రం మేజిక్ బాక్స్ ప్రొడక్షన్ నంబర్–3. దీనికి సెల్వా దర్శకత్వం వహిస్తున్నారు. అరవింద్‌స్వామి హీరోగా, రిత్తికా సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం గతవారం పూజతో ప్రారంభమైంది. ఈ చిత్రంలో సుదీర్ఘ విరామం తర్వాత నటి సిమ్రాన్ పోలీసు కథా పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మరో హీరోయిన్గా నందిత నటిస్తున్నారు.
అంతేగాకుండా ఇతర పాత్రల్లో తంబిరామయ్య, చాందిని, హాసిని, హరీష్ ఉత్తమన్, రాజ్‌కపూర్, నాగినీడు, రమేష్ పండిట్, ఓఏకే సుందర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో పేరున్న నటీనటులంతా నటిస్తుండడంతో చిత్ర వ్యాపారం ఇప్పటి నుంచే ఊపందుకుంటోంది. ఈ చిత్రం టైటిల్ ‘వనంగాముడి’గా పలువురు పేర్కొంటున్నారని, అయితే ఇది వాస్తవ విరుద్ధమని, త్వరలో ఈ చిత్రం టైటిల్‌ను చిత్ర యూనిట్ తరఫున విడుదల చేస్తామని నిర్మాత గణేశ్ తెలిపారు. ఈ చిత్రానికి గోకుల్ ఛాయాగ్రహణం చేపడుతుండగా, ఇమాన్ సంగీతం సమకూరుస్తున్నారు