river bank
-
అక్కడ మానవ పుర్రెలు.. ప్రజల్లో భయం
భువనేశ్వర్: నదీ తీరాల్లో మానవ పుర్రెలు తారస పడ్డాయి. ఈ సంఘటన పట్ల స్థానికులో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిసరాల్లో తాంత్రిక శక్తుల సాధన, ప్రయోగంతో మానవ పుర్రెలు వినియోగిస్తారు. ఈ ప్రాంతంలో పుర్రెలు తారసపడడం ఈ కార్యకలాపాలకు తార్కాణంగా పరిగణించి సాధారణ ప్రజానీకం ఆందోళన చెందుతోంది. జగత్సింగ్పూర్ జిల్లా తిర్తోల్ పోలీసు స్టేషన్ పరిధి కృష్ణనందపుర గ్రామంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణనందపుర ఔట్‌పోస్టు పోలీసు అధికారి అనిరుద్ధ నాయక్ సందిగ్ధ ప్రాంతాల్ని సందర్శించి రెండు ప్రాంతాల్లో 4 పుర్రెల్ని కనుగొన్నారు. ఈ నేపథ్యంలో విచారణ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. -
షాకింగ్ : గంగ పాలైన వేలాది ఆధార్ కార్డులు
తిరువూరు : నది ఒడ్డున కుప్పలు తెప్పలుగా ఆధార్ కార్డులు దర్శనమిచ్చిన ఘటన తమిళనాట కలకలం రేపింది. తమిళనాడులో తిరుప్పూరు జిల్లా తిరుత్తురైపూండి ముళ్లియారు నది ఒడ్డున వేలాది ఆధార్ కార్డులు పడి వున్నాయి. గురువారం ఉదయం మూడు గోనె సంచులను స్థానికులు కనుగొన్నారు. వాటిని విప్పి చూడటంతో దాదాపు 3 వేల ఆధార్ కార్డులు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం ఆధారంగా నదీ తీరానికి చేరుకున్న స్థానిక అధికారి రాజన్‌బాబు నేతృత్వంలోని రెవెన్యూ అధికారులు ఈ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కట్టిమేడు, అత్తిరంగం, వడపట్టి, పామణి గ్రామాల ప్రజలకు చెందినవిగా అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ప్రాథమిక సమాచారం ఆధారంగా పంపిణీకోసం పోస్టల్ శాఖకు పంపగా, తపాలా శాఖ ఉద్యోగులు వాటిని నదిలోకి విసిరివేసి వుంటారని అనుమానిస్తున్నారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత ఏడాది మార్చిలో ముంబైలోని ఒక పాడు బడ్డ బావిలో వేలాది ఆధార్ కార్డులు పడి ఉండడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. -
విద్యార్థుల ఉసురు తీసిన సరదా
తెనాలి: మరో పది రోజుల్లో పబ్లిక్ పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ప్రీ పబ్లిక్ పరీక్షలు ముగిశాయన్న అనందంలో సరదాగా నదీ తీరానికి వెళ్లి విగతజీవులుగా మారారు. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం బోస్ రోడ్డులో ఉన్న నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు శనివారం ఉదయం ప్రీ ఫైనల్ పరీక్షలు ముగిశాయి. తిరిగి మధ్యాహ్నం కళాశాలకు రావాల్సి ఉన్నా, తొమ్మిది మంది విద్యార్థులు కొల్లూరు మండలం చిలుమూరులంక కృష్ణానదీ తీరానికి వెళ్లారు. అనుకోకుండా లోతుకు వెళ్లిన వారిలో ఐదుగురు నీట మునిగిపోయి మృతి చెందారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుల్లో స్థానిక ముత్తంశెట్టిపాలేనికి చెందిన టి.బాలశివగణేష్(17), బిట్రా రూపేష్(17), చినరావూరు అక్కలవారి వీధికి చెందిన కొమ్ము మహేష్(17), గంగానమ్మపేట భవనంవారి వీధికి చెందిన వి.ఈశ్వర్ రఘువంశీ(17), రూరల్ మండలం పెదరావూరుకు చెందిన కుర్రా సాయివంశీ(17) ఉన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.