నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
అనంతపురం న్యూసిటీ : ‘‘భవన నిర్మాణ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్లాన్‌లో పొందుపర్చిన విధంగానే నిర్మాణం ఉండాలి. లైసెన్స్ సర్వేయర్లు ప్లాన్ సక్రమంగా ఇవ్వాలి. అలా చేయని పక్షంలో వారిని బ్లాక్‌లిస్టు జాబితాలో ఉంచాలి’’ అని టౌన్ ప్లానింగ్ ఆర్జేడీ వెంకటపతి రెడ్డి టీపీఓ, టీపీఎస్‌లకు సూచించారు. బుధవారం నగరపాలక సంస్థలోని కౌన్సిల్ హాల్లో నాలుగు జిల్లాల టీపీఓ, టీపీఎస్‌లకు ఆన్లైన్ బిల్డింగ్ నమోదులో భాగంగా డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్న అంశంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఆర్జేడీ మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదన్నారు. నిబంధనలకు అతిక్రమిస్తే భవనాలను కూల్చడంతో పాటు కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సాఫ్ట్‌టెక్ ప్రతినిధి జస్టిన్ మాట్లాడుతూ ఆన్లైన్లో ఫస్ట్, పోస్టు అప్రూవల్ ఇచ్చే విధానాన్ని ప్రొజెక్టర్ ద్వారా వివరించారు.