RK Sharma
-
'నన్ను కొట్టేవాడు.. మరో మహిళా సైక్లిస్ట్‌తో సంబంధం అంటగట్టి'
మాజీ జాతీయ సైక్లింగ్ కోచ్ ఆర్కే శర్మపై ఇటీవలే లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. భారత టాప్ మహిళా సైక్లిస్ట్.. గదిలోకి పిలిచి తనను అత్యాచారం చేయడమే గాక అతనికి భార్యగా ఉండాలంటూ వేధింపులకు పాల్పడ్డాడంటూ సాయ్‌కి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఈ విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) ఆర్కే శర్మపై వేటు వేసింది. దీనికి సంబంధించిన కేసును సాయ్ ఇటీవలే మానవ హక్కుల కమీషన్‌కు బదిలీ చేసింది. తాజాగా ఆర్కే శర్మ విషయంలో మరో టాప్ సైక్లిస్ట్.. జాతీయ చాంపియన్ డెబోరా హెరాల్డ్ విస్తుపోయే విషయాలు పేర్కొంది. ''ఆర్కే శర్మతో పాటు అతని అసిస్టెంట్ కోచ్ గౌతామని దేవి నన్ను రెండుసార్లు కొట్టారు. ప్రతీ చిన్న విషయానికి ఎగతాళి చేసేవారు. దానిని అడ్డుకోవాలని చూస్తే మరింత వేధించేవారు. అంతేకాదు మరో మహిళా సైక్లిస్ట్‌తో నేను రిలేషన్షిప్లో ఉన్నట్లు పుకార్లు కూడా పుట్టించారు. నిజం ఏంటన్నది నాకు తెలుసు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. వాళ్లు పుకార్లు పుట్టిన ఆ సైక్లిస్ట్ వ్యక్తిగతంగా నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. అయితే దీనిని కోచ్ ఆర్కే శర్మ.. అసిస్టెంట్ కోచ్ గౌతామని దేవి వేరే రకంగా ఊహించుకునేవారు. ఒక సందర్భంలో మేము ఉన్న గదిలో ఎయిర్ కండీషనర్ పని చేయకపోవడంతో కింద ఫ్లోర్లో ఉన్న అబ్బాయిల గదిలోకి వెళ్లాం. అంతకముందు వాళ్ల అనుమతి తీసుకున్నాం. ఈ విషయం తెలుసుకోకుండా కోచ్ ఆర్కే శర్మ ఆరోజు ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు.'' అంటూ పేర్కొంది. ఇక డెబోరా హెరాల్డ్ 2012 నుంచి భారత్ తరపున సైక్లింగ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది. ఆర్కే శర్మ నేతృత్వంలో మరింత రాటుదేలిన హెరాల్డ్.. 2014లో జరిగిన ఆసియా కప్ ట్రాక్‌లో 500 మీటర్ల టైమ్ ట్రయల్‌లో విజేతగా నిలిచింది. 2015 అక్టోబర్‌లో జరిగిన తైవాన్ కప్ ఇంటర్నేషనల్ క్లాసిక్‌లో ఐదు మెడల్స్ సాధించిన హెరాల్డ్.. ఆ తర్వాత ట్రాక్ ఇండియా కప్‌లో మూడు మెడల్స్ సొంతం చేసుకుంది. ఇక యూసీఐ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానం సంపాదించిన హెరాల్డ్.. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా సైక్లిస్ట్‌గా చరిత్ర సృష్టించింది. చదవండి: 'గదిలోకి పిలిచి తన భార్యగా ఉండాలన్నాడు'.. జాతీయ కోచ్‌పై భారత మహిళా సైక్లిస్ట్ ఆరోపణలు -
'గదిలోకి పిలిచి తన భార్యగా ఉండాలన్నాడు'
క్రీడలు ఏవైనా లైంగిక వేధింపులు సహజం. పాశ్చాత్య క్రీడల్లో భాగంగా ఉన్న ఇలాంటి వేధింపులు భారత్‌కు పాకాయి. తాజాగా భారత టాప్ మహిళా సైక్లిస్ట్.. భారత సైక్లింగ్ జాతీయ కోచ్ ఆర్కే శర్మపై సంచలన ఆరోపణలు చేసింది. ఆర్కే శర్మ తనను తన గదికి బలవంతంగా లాక్కెళ్లి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. విషయంలోకి వెళితే.. స్లోవేనియాలో జరుగుతున్న సైక్లింగ్ పోటీలకు భారత సైక్లింగ్ టీమ్‌లో ఐదురుగు పురుషులు, ఓ మహిళా సైక్లిస్ట్ వెళ్లారు. వాస్తవానికి స్లోవేనియాలో భారత జట్టుకి మహిళా కోచ్‌లు ఎవ్వరూ అందుబాటులో లేరు. దీంతో ఆర్కే శర్మ సదరు మహిళకు కూడా కోచ్‌గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. గదిలోకి లాక్కెళ్లి తనకు బార్యగా ఉండాలని పేర్కొంటూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కాగా భారత జట్టు సైక్లింగ్ పోటీల్లో పాల్గొని జూన్ 14న స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. అయితే లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఈ టూర్‌ని మధ్యలోనే రద్దు చేసుకుని, వెనక్కి రావాల్సిందిగా సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మెన్ ఓంకార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు ఈ ఘటనపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సీఎఫ్ఐ కలిసి రెండు ప్యానెల్స్‌తో విచారణ నిర్వహిస్తున్నాయి. ‘అథ్లెట్ ఫిర్యాదును స్వీకరించిన వెంటనే ఆమె భద్రత దృష్ట్యా, సైక్లింగ్ బృందాన్ని స్వదేశానికి రప్పించడం జరిగింది. కమిటీ ఈ విషయంపై పూర్తి విచారణ చేయనుంది. అతి త్వరలో నిజాలను నిగ్గు తేల్చి, బాధితురాలికి న్యాయం చేస్తాం.’ అని సాయ్ అధికారులు తెలిపారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కే శర్మ ఇప్పటిదాకా స్వదేశానికి చేరుకోలేదు. త్వరలోనే అతన్ని స్లోవేనియా నుంచి స్వదేశానికి రప్పించి, నోటీసులు జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. చదవండి: మెస్సీకి వీరాభిమాని.. రెచ్చగొట్టే ఫోటోలతో చేతులు కాల్చుకుంది Tiger Woods: వేల కోట్లు వద్దనుకున్నాడు.. బిలీనియర్ అయ్యే చాన్స్ మిస్ -
చుక్క నీరు రాక చిక్కులు
నోయిడా: సెక్టార్ -72వాసుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఇందుకు కారణం గత ఎనిమిది రోజులుగా నీరు రాకపోవడమే. దీంతో తమ అవసరాలను తీర్చుకునేందుకు సమీపంలోని సర్ఫాబాద్ గ్రామంలోని బోర్‌బావులపై వారు ఆధారపడుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ నడిచీ నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇదే అంశంపై సెక్టార్ 72లోని ఏ బ్లాక్‌లో నివసించే డాక ్టర్ ఆర్కే శర్మ మాట్లాడుతూ ‘గురువారం నుంచి నీరు రావడం లేదు. పండుగల సీజన్ కావడంతో ఇళ్లకు బంధువులు వచ్చిపోతున్నారు. ఇంటి పనులకు కూడా మినరల్ వాటర్‌ను కొనుగోలు చేయడం తప్ప మరో మార్గమే లేకుండాపోయింది. ఇలా ఎంతకాలం డబ్బులు వెచ్చించగలుగుతాం. నీరు, విద్యుత్ లాంటి కనీస అవసరాలు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపైనే ఉంది’ అని అన్నారు. ఇదే అంశంపై ఈ బ్లాక్ నివాసి త్రిపాఠి మాట్లాడుతూ ‘ప్రతిరోజూ సర్ఫాబాద్ గ్రామానికి వెళ్లి అక్కడి బోరుబావుల్లో నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇంతకుమించి మరో మార్గమే లేకుండాపోయింది. ఇదేదో ఒకటి లేదా రెండు రోజుల సమస్య కాదు. ఎనిమిది రోజుల నుంచి నానా ఇబ్బందులు పడుతున్నాం. మా అవసరాలను తీర్చుకోవడానికి నానాయాతన పడాల్సివస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. పునరావృతమవుతూనే ఉంది ఈ సమస్యపై రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్డబ్ల్యూ) ప్రధాన కార్యదర్శి ముఖేష్ భండారీ మాట్లాడుతూ ‘ఈ సమస్య పునరావృతమవుతూనే ఉంది. ఈ సెక్టార్లో ఎప్పుడూ ఏదో ఒక మరమ్మతు పని కొనసాగుతూ ఉండడమే. రెండు రోజులపాటు నేను స్నానమే చేయలేదు. చివరికి ధంతేరాస్ రోజున కూడా సర్ఫాబాద్ గ్రామానికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చింది’ అని వాపోయారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని నీటి విభాగం అధికారి యోగేంద్ర కస్నా హామీ ఇచ్చారు. మంగళవారంలోగా సెక్టార్ 72లకు నీరు సరఫరా అయ్యేవిధంగా చూస్తామన్నారు. పైప్లైన్లు పగిలిపోయిన కారణంగా మరమ్మతు పనులను చేపట్టామని, అందువల్లనే ఈ సమస్య తలెత్తిందని ఆయన వివరించారు.