Rock Climbing
-
'ఉద్యోగం తెచ్చుకోక ఆ కొండలెక్కడం ఏంటి'.. కట్‌చేస్తే
ఎవరూ చేయని పనులను ఎంచుకోవడం ఇష్టం. నలుగురూ వెళ్లేదారిలో కాకుండా తనకోసం తను కొత్త దారి వేసుకోవడం ఇష్టం. కన్న కల కోసం కఠోరశ్రమకైనా వెనకాడకుండా ముందుకు సాగడం ఇష్టం. మన త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ దేశాల పర్వతశిఖరాలపై ఎగురవేసి తీరాలన్నది మరీ మరీ ఇష్టం. తెలంగాణలోని భువనగిరి మండలం ఎర్రబెల్లి గ్రామంలో ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన పడమటి అన్విత ఇటీవల రష్యాలోని ఎల్బ్రస్ పర్వతంపై మన జాతీయ పతాకాన్ని ఎగురవేసి వార్తల్లో నిలిచింది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో అన్విత పంచుకున్న విశేషాలు.. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన అన్విత పర్వతారోహణలో బేసిక్ కోర్సులనూ పూర్తి చేసింది. ఇప్పటి వరకు ఐదు పర్వతాలను అధిరోహించిన 23 ఏళ్ల అన్విత ప్రస్తుతం భువనగిరి రాక్ క్లైంబింగ్లో సహాయ శిక్షకురాలిగా ఉంది. తనకు తానుగా ఏర్పర్చుకున్న లక్ష్యంతో ఇతర దేశాల పర్వతాలపై భారతీయజెండాను ఎగురవేయడం కోసం కఠోర శ్రమను సైతం ఆనందంగా స్వీకరిస్తూ పర్వత శిఖరాలను అవలీలగా అధిరోహిస్తోంది. పేరు: పడమటి అన్విత విద్యార్హత: ఎంబీఏ ఇప్పటి వరకు అధిరోహించిన పర్వతాలు: 2015లో రినాక్ పర్వతం( 4500 మీటర్లు) 2019లో బీసీ రాయ్ పర్వతం (6000 మీటర్లు) 2021 లో కిలిమంజారో (5849 మీటర్లు) 2021లో కడే పర్వతం (6000 మీటర్లు) 2021 లో ఎల్బ్రూస్ (5642 మీటర్లు) పర్వతారోహణ ఆలోచన ఎందుకు కలిగింది? అన్విత: ఇంటర్మీడియట్ చదువుతుండగా ఓ రోజు పత్రికలలో రాక్‌క్లైంబింగ్ ట్రెయినింగ్ గురించి చదివాను. నాకూ పర్వతారోహకురాలిగా గుర్తింపు తెచ్చుకోవాలి.. అనే ఆలోచన కలిగింది. అందుకు నా శక్తి సరిపోతుందా అని పరీక్షించుకోవడానికి రాక్ కై్ౖలంబింగ్ కోసం భువనగిరి ఖిలా వద్దకు వెళ్లాను. అక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులను చూశాక నేను కూడా అందులో ఎలాగైనా చేరాలనుకున్నాను. మా అమ్మనాన్నలతో ‘కొండలు ఎక్కేందుకు శిక్షణ తీసుకుంటా’ అన్నాను. ముందు వద్దన్నారు. ‘చదువు పూర్తి చేసి, ఉద్యోగం తెచ్చుకోక ఎందుకు ఆ కొండలెక్కడం, అదేమైనా చిన్నపనా’ అన్నారు. తర్వాత, నా పట్టుదల చూసి ‘సరే’ అన్నారు. 7 రోజుల్లోనే బేసిక్ కోర్సు పూర్తిచేశాను. ఆ తర్వాత డార్జిలింగ్‌లో 40 రోజుల శిక్షణ చదువుకు ఇబ్బంది కలుగకూడదని సెలవు రోజుల్లో తీసుకున్నాను. 2018 సెప్టెంబర్‌లో మరోసారి అడ్వాన్స్ కోర్సు నేర్చుకున్నాను. పర్వతారోహణ ద్వారా సాధించాలనుకున్న లక్ష్యం ఏమిటి? అన్విత: పర్వాతారోహణలో ఎలాగైనా శిఖరం అంచుకు చేరాలన్న పట్టుదల ఉంటుంది. అది ఏ పనినైనా సాధించగలననే ధైర్యాన్ని ఇస్తుంది. దీంతోపాటు ఎవరు చేయని వాటిని నేను చేయాలనుకున్నాను. ప్రపంచంలో ఉన్న ఏడు ప్రధాన పర్వతాలతోపాటు, ఇంతవరకు ఎవరూ ఎంపిక చేసుకోని పర్వతాలను అధిరోహించాలన్నది నా లక్ష్యం. అందులో ప్రధానంగా ఉత్తర అమెరికాలో ఉన్న దెనాలి పర్వతాన్ని ఎక్కాలనేది నా కల. ఈ పర్వతాన్ని భారతీయులు ఎవరూ అధిరోహించలేదు. ఒక దేశంలో ఎల్తైన పర్వతం ఆ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అలా అన్ని దేశాల్లోని ఎల్తైన పర్వతాలపై మన దేశ జాతీయ జెండాను ఎగురవేయాలి. దాని కోసమే కృషి చేస్తున్నాను. దేశదేశాల ఎల్తైన పర్వతాల జాబితాను రూపొందించుకున్నాను. అందులో భాగంగానే ఇటీవల రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ పై 10 మీటర్ల జాతీయ జెండాను ఎగుర వేసిన తొలి భారతీయ యువతిగా పేరొందాను. మైనస్ 40 డిగ్రీల ప్రతికూల ఉష్ణోగ్రతలో కూడా పర్వతాలు అధిరోహించడం నాకు ఎంతో ఇష్టంగా ఉంటుంది. పర్వతారోహణ సమయంలో తగిలే గాయాలు కాలంతోపాటు తగ్గిపోతాయి. కానీ, ఆ ఆనందం జీవితాంతం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్ని పర్వతాలు అధిరోహించారు? అన్విత: ఐదు పర్వతాలు అధిరోహించాను. మొదట 17 ఏళ్ల (2015లో) వయసులో మన దేశంలోని సిక్కింలోని రెనాక్, 2019లో బీసీ రాయ్, ఈ యేడాది లద్డాక్లోని కడే, ఆఫ్రికాలోని కిలిమంజారో, రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాలను అధిరోహించాను. దేశ విదేశాల్లో పర్వతారోహణ అంటే ఆర్థిక వనరులు కూడా అవసరం కదా..? అన్విత: పర్వతారోహణ శిక్షణ కోసం ఆరేళ్లుగా మా అమ్మనాన్నలే లక్షల రూపాయలు ఖర్చు చేశారు. రష్యాలోని ఎల్బ్రస్, కిలిమంజారో పర్వతాల అధిరోహణకు స్థానిక నేతలతో పాటు రైస్ మిల్లర్స్ అసోసియేషన్, జిల్లా కలెక్టర్ ప్రోత్సాహం మరువలేనిది. – యంబ నర్సింహులు, యాదాద్రి, సాక్షి కుటుంబ నేపథ్యం మాది సాధారణ రైతు కుటుంబం. భువనగిరి మండలం ఎర్రంబెల్లి గ్రామానికి చెందిన మా తల్లిదండ్రులు పడమటి చంద్రకళ, మధుసూదన్‌రెడ్డి. నాన్న వ్యవసాయం చేస్తారు. అమ్మ భువనగిరిలో అంగన్వాడీ టీచర్. కఠినమైన పర్వతారోహణ గురించి ముందు భయపడినా, నా పట్టుదలను గుర్తించి అమ్మనాన్నలు ప్రోత్సహించారు. గ్రామం నుంచి భువనగిరికి వచ్చి చదువుకోవడానికి బస్ సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డాం. అందుకని నేను, అక్క మా చదువుల కోసం భువనగిరిలో ఉంటున్నాం. – అన్విత -
సాహసమే శ్వాసగా సాగిపోతున్నారు
సాక్షి, గుంటూరు: దేనినైనా సాధించగలమనే ఆత్మ విశ్వాసం.. సాహస కృత్యాలపై మక్కువ.. కలగలిపిన వారి సంకల్ప బలం ముందు ఎత్తయిన పర్వతాలు చిన్నబోయాయి. జిల్లాకు చెందిన కొందరు యువతీ, యువకులు అవరోధాలను అధిగమిస్తూ.. శిఖరాలను ముద్దాడుతూ రికార్డులు కైవసం చేసుకుని తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన ఏడు పర్వతాలు అధిరోహించాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు గుంటూరుకు చెందిన ఆశ దళవాయి. గుంటూరులో నివాసం ఆశకు చిన్నతనం నుంచి క్రీడలపై ఆసక్తి. నగరంలోని టీజేపీఎస్ కళశాలలో 2007లో బీఎస్సీ పూర్తి చేశారు. డిగ్రీ చదివే రోజుల్లో ఎన్సీసీలో హిల్ మౌంటెనీరింగ్ కోర్సుకు సెలక్ట్ అయి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (పర్వతారోహణ)లో శిక్షణ తీసుకున్నారు. డిగ్రీ అనంతరం డార్జిలింగ్‌లోని హిమాలయా మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్లో బేసిక్ అడ్వెంచర్స్, వివిధ రకాల పర్వతారోహణ కోర్సుల్లో తర్ఫీదు పొందారు. అక్కడి నుంచి వచ్చి తన స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో ఔట్రైవల్ అడ్వెంచర్స్ అనే సంస్థను ప్రారంభించి వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు అడ్వెంఛర్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంస్థ ద్వారా 5 వేల మందికి పర్వతారోహణపై అవగాహన కల్పించారు. పర్వతారోహణ ఇలా.... 2019 జులై 16 నుంచి 20 వరకూ ఐదు రోజులు ప్రయాణం చేసి ఆఫ్రికా ఖండంలోని 5,895 మీటర్ల ఎత్తయిన కిలిమంజారో అధిరోహించారు. అనంతరం అదే సంవత్సరంలో యూరప్‌లోని 5,642 మీటర్ల ఎత్తయిన ఎల్‌బ్రూ శిఖరాన్ని, అర్జెంటినాలోని 6,962 మీటర్ల ఎత్తయిన అకోంకగువా పర్వతారోహణ చేశారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహణకు సిద్ధమైన తరుణంలో గత ఏడాది కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ ఆంక్షలు ఉండటంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ప్రస్తుతం ఎవరెస్ట్ అధిరోహణకు సన్నద్ధం అవుతున్నానని ఈ ఏడాది అధిరోహణ పూర్తి చేస్తానని ఆమె చెబుతున్నారు. కిలిమంజారో శిఖరంపై సాయికిరణ్ (ఫైల్) యువకిరణం చిలకలూరిపేట పట్టణం ఎంవీఆర్ కాలనీకి చెందిన సాయికిరణ్‌కు పర్వతారోహణంపై మక్కువ. ఈ నేపథ్యంలో పాఠశాల దశలోనే అడ్వెంచర్ సంస్థలను సంప్రదించి పర్వతారోహణకు ప్రయత్నించాడు. అయితే వయసు సరిపోదని అందరూ చెప్పడంతో, 2019లో ఇంటర్మీడియట్ చదివేప్పుడు 18 ఏళ్లు నిండిన వెంటనే తెలంగాణ రాష్ట్రం భువనగిరి గుట్టలోని రాక్ క్లైంబింగ్లో జనవరి మాసంలో చేరి శిక్షణ పొందాడు. అనంతరం ఫిబ్రవరి నెలలో దాతల సహకారం లభించడంతో కిలిమాంజారో శిఖరాన్ని అధిరోహించాడు. అదే ఏడాది ఆగస్టు నెలలో సిక్కింలోని వెస్ట్‌టెంజింగ్‌కాన్‌లో శిక్షణ పొంది ఏ గ్రేడ్ సాధించాడు. అనంతరం ఉత్తర భారతదేశంలోని లీలాధన్‌లో 6,158 మీటర్ల ఎత్తయిన స్టోక్ కాంగ్రీ పర్వతాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరితో కలిసి ఎక్కి 365 అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల ఎత్తుగల జాతీయ పతాకాన్ని పర్వతంపై రెపరెపలాడించారు. ఇందుకు గాను హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సాయి కిరణ్ 2019 డిసెంబర్లో ప్రసంశ పత్రం అందుకున్నాడు. ప్రస్తుతం ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితులు సహకరించక దాతల సహకారం కోసం ఎదురుచూస్తున్నాడు. ఘనతకు ప్రభుత్వ గుర్తింపు... వెల్దుర్తి మండలం చిన్నపర్లపాటి తండాకు చెందిన వడితె సంధ్యబాయి 2017 మే నెలలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. 2017లో నాగార్జున సాగర్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో సంధ్య ఇంటర్ చదువుతున్న సమయంలో ఎవరెస్ట్ అధిరోహణకు దరఖాస్తులు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 170 మంది వరకూ దరఖాస్తు చేసుకోగా విజయవాడలో జరిగిన ప్రైమరీ సెలక్షన్స్‌లో 30 మంది ఎంపికయ్యారు. అనంతరం వీరిని జమ్మూ కశ్మీర్‌కు తరలించి అక్కడ ఫైనల్ సెలక్షన్స్ ముగిసే సమయానికి 13 మంది మిగిలారు. 13 మందిలో అబ్బాయిలు 11 మంది కాగా ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు సంధ్య, మరో అమ్మాయి పశ్చిమ గోదావరి వాస్తవ్యురాలు. ప్రత్యేక శిక్షణ అనంతరం దిగ్విజయంగా ఎవరెస్ట్ పర్వతారోహణ సంధ్య పూర్తి చేసింది. ఈమె సాధించిన ఘనతకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించింది. రూ.10 లక్షల రివార్డును అందించడంతో పాటు, ప్రస్తుతం ఆమె చదువుకు అయ్యే ఖర్చులను సర్కార్ భరిస్తోంది. -
భువనగిరి ఖిలాపై ట్రైనీ ఐఏఎస్‌ల సందడి
]సాక్షి, భువనగిరి: ట్రైనీ ఐఏఎస్‌ల బృందం ఆదివా రం భువనగిరి ఖిల్లాను సదర్శించింది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల ఇన్స్టిట్యూట్కు శిక్షణ నిమిత్తం వచ్చిన 13మంది ఖిలాను చూసేందుకు వచ్చారు. రాక్ క్లైంబింగ్ నిర్వహించి కోటపై కట్టడాలను పరిశీలించారు. కోట చరిత్రను భావి తరాలకు అందిల్సాన బా ధ్యత అందరిపై ఉందన్నారు. భువనగిరి రాక్ క్లైంబింగ్ శిక్షణ పాఠశాల నిర్వాహకుడు బచేనపల్లి శేఖర్‌బాబు, కోచ్ పరమేశ్వర్, రాకేశ్, వినోద్, వెంకటేశ్ తదితరులు ఉన్నారు. రాక్ క్లైంబింగ్ -
నెలాఖరులో ‘కోట’ ఫెస్టివల్..!
భువనగిరి : రాచరిక వ్యవస్థకు స్మృతి చిహ్నం.. చారిత్రక కట్టడాలకు సజీవ సాక్షంగా ఉన్న భువనగిరి కోట ఉత్సవాలను ఈ నెలాఖరులో నిర్వహించేందుకు సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భువనగిరి ఖిలాపై నిర్మించిన కోట చరిత్రను విశ్వవ్యాప్తంగా చాటి చేప్పేలా రూ 50లక్షల ఖర్చుతో ఫెస్టివెల్ నిర్వహించనున్నారు. జిల్లాల పునర్విభజన అనంతరం నూతనంగా ఏర్పడిన యాదాద్రిభువనగిరి జి ల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలు అందరికీ తెలియజేసేలా ఫెస్టివెల్ పేరుతో ఉత్సవాలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భువనగిరి కోట, కొలనుపాక, రాచకొండ, భూదాన్‌పోచంపల్లిలు ఉన్నాయి. మొదటగా ఈ సంవత్సరం భువనగిరి కోట ఫెస్టివెల్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. రూ. 50 లక్షలతో ప్రతిపాదనలు భువనగిరి కోట ఉత్సవాల కోసం అధికారులు రూ. 50 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రణాళికను రూపొందించారు. ఇందులో భా గంగా భువనగిరి కోటపై మూడురోజుల పాటు లైటింగ్, ఒకరోజు లేజర్ షో, ప్రతిరోజు సాయంత్రం సమయంలో తెలంగాణ కళారూపాలతో సాంస్కృతిక పోటీలను నిర్వహించనున్నారు. భువనగిరి కోట ప్రాముఖ్యత, ప్రాశస్త్యం తెలిపే విధంగా వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. రాక్ క్లైంబింగ్ పై అవగాహన, జిల్లాలోని వివిధ రంగాల్లో ప్రావీణ్యం కలిగిన వారికి సన్మానం, భూదాన్‌పోచంపల్లి వస్త్రాలతో పోచంపల్లి ఇక్కత్‌మేళా, తెలంగాణ పుడ్ ఫెస్టివెల్ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెలాఖరులోని శుక్ర, శని, అదివారం వచ్చేలా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఫెస్టివెల్‌కు వివిధ జిల్లా లు, ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా వి దేశీయులు కూడా వచ్చే అవకాశం ఉంది. మొదటి సారి ఉత్సవాలు నిర్వహిస్తుండడం వల్ల అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. -
భువనగిరి ఖిలాపై రాక్‌క్లైంబింగ్
భువనగిరి: సాంఘిక సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు మంగళవారం భువనగిరి ఖిలాపై రాక్కైంబింగ్ శిక్షణ ఇచ్చారు. కోచ్ శేఖర్‌బాబు ఆధ్వర్యంలో 80 మంది విద్యార్థులు శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అధికారి ఎం.రమేష్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 సాంఘిక సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో పాఠశాలకు ఇద్దరి చొప్పున ఎంపిక చేసినట్లు తెలిపారు. 23వ తేదీ వరకు ఖిలాపై విద్యార్థులు బేసిక్ ఫిట్నెస్ లెవల్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం మెరుగైన గ్రేడ్ సాధించిన వారిని పర్వతారోహణకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ వీర్యానాయక్ ఉన్నారు. -
ఖిల్లాపై రాక్ క్లైంబింగ్ శిక్షణ
భువనగిరి టౌన్: వివిధ జిల్లాలకు చెందిన గురుకుల పాఠశాల విద్యార్థులకు రాక్ క్లైంబింగ్ శిక్షణను ఆదివారం భువనగిరిలో ప్రారంభించారు. ఈ శిక్షణలో వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీనగర్ జిల్లాలకు చెందిన 45 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి కోచ్ శేఖర్‌బాబు ఆధ్వర్యంలో ప్రాధమిక అవగాహన కలిపంచి రాక్ క్లైంబింగ్పై శిక్షణ ఇచ్చారు. -
ఖిల్లాపై రాక్ క్లైంబింగ్ శిక్షణ
భువనగిరి టౌన్: వివిధ జిల్లాలకు చెందిన గురుకుల పాఠశాల విద్యార్థులకు రాక్ క్లైంబింగ్ శిక్షణను ఆదివారం భువనగిరిలో ప్రారంభించారు. ఈ శిక్షణలో వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీనగర్ జిల్లాలకు చెందిన 45 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి కోచ్ శేఖర్‌బాబు ఆధ్వర్యంలో ప్రాధమిక అవగాహన కలిపంచి రాక్ క్లైంబింగ్పై శిక్షణ ఇచ్చారు. -
భువనగిరి ఖిలాపై రాక్ క్లైంబింగ్ శిక్షణ
భువనగిరి టౌన్: భువనగిరి ఖిల్లాపై ఆదివారం పలువురు యువతీ, యువకులకు రాక్క్లైంబింగ్పై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో పలు కంపెనీలకు చెందిన 50 మందికి కోచ్ శేఖర్‌బాబు రాక్ క్లైంబింగ్పై శిక్షణ ఇచ్చారు. ఈ మేరకు వారు తాళ్ల సాయంతో కోటపైకి ఎక్కి కొద్ది సేపు సేదతీరారు. -
భువనగిరి ఖిలాపై రాక్‌క్లైంబింగ్ శిక్షణ
భువనగిరి టౌన్ : సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు శుక్రవారం భువనగిరి ఖిల్లాపై రాక్క్లైౖంబింగ్ శిక్షణ ఇచ్చారు. కోచ్ బి. శేఖర్‌బాబు ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్నగర్జిల్లాలోని 46 మంది ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. -
రాష్ట్రంలో బంగీ జంప్!
సాక్షి, హైదరాబాద్: బంగీ జంప్.. నడుముకు తాడులాంటి దాన్ని కట్టుకుని అంతెత్తు నుంచి కింద ఉన్న నీటిలోకి దూకే ఓ సాహస విన్యాసం. మన దేశంలో అంతగా ప్రాచుర్యంలో లేనప్పటికీ విదేశాల్లో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే సాహస క్రీడ. ఇప్పుడలాంటి అద్భుత అవకాశం మన రాష్ట్రంలో అందుబాటులోకి వస్తోంది. అయితే, విదేశాల్లో ఉన్నట్టుగా ఏ కొండ అంచు నుంచో దూకేలా మాత్రం కాదు. అలనాడు నిజాం జమానాలో రూపుదిద్దుకుని వయసైపోయి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఓ పురాతన వంతెన పైనుంచి. సాహస క్రీడలంటే ఎంతో ఆసక్తి చూపే యువతను ఆకట్టుకునేందుకు రాష్ట్రంలో అడ్వెంచర్ టూరిజంను అభివృద్ధి చేయాలనుకున్న ప్రభుత్వం.. ఈ వంతెనను అందుకు వేదిక చేసుకోవాలని నిర్ణయించింది. ఆర్మూరు-నిర్మల్ మధ్య సోన్ వద్ద గోదావరిపై 1936లో ఓ భారీ వంతెనను నిర్మించారు. కిలోమీటరుకు మించిన పొడవున్న ఈ వంతెన నిర్మాణ కౌశలం కూడా కళాత్మకంగా ఉంటుంది. ఇంతకాలం సేవలందించిన ఈ వంతెన వయసైపోయిందన్న ఉద్దేశంతో ప్రభుత్వం దానికి సమాంతరంగా కొత్త వంతెనను నిర్మించి వినియోగంలోకి తెచ్చింది. ప్రస్తుతం పాత వంతెన మీదుగా వాహనాలను అనుమతించడం లేదు. కానీ ఇప్పటికీ అది పటిష్టంగానే ఉంది. దిగువన గోదావరి, చుట్టూ అందమైన ప్రకృతి, కళాత్మకంగా నిర్మితమై ఉన్న ఆ వంతెనను సాహస క్రీడలకు వినియోగించుకోవాలని ఇటీవల పర్యాటక శాఖ భావించింది. దీనికి ప్రభుత్వం అనుమతించడంతో కార్యాచరణకు సిద్ధమైంది. ఆ వంతెన మీదుగా నదిలోకి మినీ బంగీ జంపింగ్‌కు అవకాశం కల్పించాలని తాజాగా నిర్ణయించారు. దీంతోపాటు వంతెన దిగువన నుంచి పైకి రాక్ క్లైంబింగ్లాంటివి ఏర్పాటు చేయనున్నారు. వంతెన మీద ఆ ప్రాంత సంప్రదాయాల్ని ప్రతిబింబించే ప్రదర్శనలు, చేతి వృత్తుల ఉత్పత్తులతో ప్రదర్శనలు, ఇతర మేళాలు ఏర్పాటు చేయనున్నారు. దాని మీదుగా కేవలం సైక్లిస్టులు, పాదచారులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. త్వరలో వీటిని అందుబాటులోకి తేనున్నారు. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం ఆ వంతెన ప్రాంతాన్ని సందర్శించి స్థానిక అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. ప్రస్తుతం దిగువన గోదావరిలో నీళ్లు లేవు. వచ్చే వానాకాలంలో నీళ్లు చేరిన తర్వాత అవి ఎప్పుడూ నిల్వ ఉండేలా దిగువన మినీ రబ్బర్ డ్యాం నిర్మించే యోచనలో ఉన్నారు.