ఆంధ్రకు రెండో విజయం
ముంబై: ఈ ఏడాది రంజీ సీజన్లో ఆంధ్ర జట్టు వరుసగా రెండో మ్యాచ్ గెలిచింది. గత మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్‌పై నాలుగు వికెట్లతో నెగ్గిన ఆంధ్ర... తాజాగా హరియాణాపై 77 పరుగులతో నెగ్గింది. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో 371 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స ప్రారంభించిన హరియాణా 123.2 ఓవర్లలో 293 పరుగులకు ఆలౌటరుుంది. రోహిల్లా (118) సెంచరీ చేసినా జట్టును ఓటమి నుంచి రక్షించలేకపోయాడు. ఆంధ్ర బౌలర్లలో శివకుమార్ నాలుగు, భార్గవ్ భట్ మూడు వికెట్లు తీశారు.
హైదరాబాద్‌కు ‘డ్రా’
గౌహతిలో హైదరాబాద్, హిమాచల్ ప్రదేశ్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. హిమాచల్ రెండో ఇన్నింగ్సలో 301 పరుగులు చేసి ఆలౌట్ అరుుంది. దీంతో హైదరాబాద్‌కు 212 పరుగుల లక్ష్యం ఎదురరుుంది. ఆదివారం చివరి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 54 ఓవర్లలో ఆరు వికెట్లకు 200 పరుగులు మాత్రమే చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.