Rohit Bansal
-
నకిలీ సెగ : బుక్కైన స్నాప్‌డీల్ ఫౌండర్స్
కోటా : ఆన్లైన్ షాపింగ్ సైట్ స్నాప్‌డీల్ చిక్కుల్లో పడింది. నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తోందన్నఆరోపణల నేపథ్యంలో కంపెనీ ఫౌండర్స్ అడ్డంగా బుక్కయ్యారు. రాజస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త ఇందర్‌మోహన్ సింగ్ హనీ ఫిర్యాదు మేరకు స్నాప్‌డీల్ సీఈవో కునాల్ బాల్, సీవోవో రోహిత్ బన్సల్ చీటింగ్ కేసు నమోదైంది. వ్యాపారవేత్త ఇంద్రమోహన్ సింగ్ హనీ జూలై 17న ఉడ్ ల్యాండ్ బెల్ట్, వాలెట్ లను స్నాప్‌డీల్‌లో ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేశాడు. ఈ బ్రాండెడ్ వస్తువులకు బదులుగా, నకిలీ వస్తువులు చేరడంతో, వాటిని ఉడ్‌ల్యాండ్ షోరూంకి వెళ్లి ఎంక్వయిరీ చేశాడు. అవి నకిలీవని ఉడ్‌ల్యాండ్ సిబ్బంది కూడా ధృవీకరించారు. దీంతో స్థానిక గుమన్‌పురా స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని ఆయన ఆరోపిస్తున్నారు. చేతి గడియారాన్ని ఆర్డర్ చేశా...డెలివరీ చేశామని కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది కానీ వాచ్ ఇంటికి చేరలేదని తెలిపారు. అయితే కంపెనీకి ఫిర్యాదు చేయడంతో తన డబ్బులను రిఫండ్ చేసిందంటూ గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఇంద్రమోహన్ ఫిర్యాదు ఆదారంగా సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారి మనోజ్ సింగ్ సికార్వాల్ తెలిపారు. చదవండి : స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం -
స్నాప్‌డీల్ విక్రయానికి మరో అడుగు!
నెక్సస్ వెంచర్స్‌తో సాఫ్ట్‌బ్యాంక్ చర్చలు న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌ను పోటీ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. స్నాప్‌డీల్‌లో కీలకమైన సహ ఇన్వెస్టరు నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్ (ఎన్వీపీ) నుంచి విక్రయానికి ఆమోదముద్ర దక్కించుకునే దిశగా సాఫ్ట్‌బ్యాంక్ మరికాస్త పురోగతి సాధించింది. ఇరు సంస్థలూ మంగళవారం సమావేశమయ్యాయని, త్వరలోనే ప్రతిష్టంభన తొలగిపోగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వారంలోనే నిర్ణయం రావొచ్చని పేర్కొన్నాయి. దీనిపై బుధవారం మరోసారి సమావేశం జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలియజేశాయి. స్నాప్‌డీల్ మాతృసంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ బోర్డులో సహ వ్యవస్థాపకులైన కునాల్ బెహల్, రోహిత్ బన్సల్‌తో పాటు సాఫ్ట్‌బ్యాంక్, కలారి క్యాపిటల్ తదితర ఇన్వెస్టర్లు డైరెక్టర్లుగా ఉన్నారు. స్నాప్‌డీల్‌ను ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించేందుకు సాఫ్ట్‌బ్యాంక్ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, డీల్ సాకారం కావాలంటే స్నాప్‌డీల్‌లో ప్రారంభ దశలో ఇన్వెస్ట్ చేసిన ఎన్వీపీ ఆమోదముద్ర తప్పనిసరి కావడంతో చర్చలు జరుపుతోంది. -
'ఉద్యోగాల భద్రతే మాకు టాప్-ప్రియారిటీ'
బెంగళూరు : నిన్నమొన్నటిదాకా ఆన్ లైన్ షాపింగ్ లో మారుమోగిన స్మాప్ డీల్ పరిస్థితి ప్రస్తుతం అతలాకుతలంగా మారింది. ఆ నష్టాలను అధిగమించడానికి ప్రత్యర్థైన ఫ్లిప్ కార్ట్ కు స్నాప్ డీల్ ను అమ్మేస్తున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. కానీ ఇప్పటివరకు దానిపై స్నాప్ డీల్ ఎలాంటి కామెంట్ చేయనప్పటికీ, ఉద్యోగులు మాత్రం తమ ఉద్యోగాలపై ఆందోళన చెందుతున్నారు. అయితే ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని కంపెనీ వ్యవస్థాపకులు కునాల్ బహల్, రోహిత్ బన్సాల్ భరోసా ఇస్తున్నారు. కంపెనీ ఇన్వెస్టర్లు వివిధ రకాల ఆప్షన్లపై చర్చలు సాగిస్తున్నప్పటికీ.. తాము మాత్రం జాబ్ సెక్రురిటీకే టాప్-ప్రియారిటీ ఇస్తామని చెప్పారు. ఉద్యోగాలకు భరోసా ఇస్తూ ఈ మేరకు ఓ ఈ-మెయిల్ ను ఆదివారం బహల్, స్నాప్ డీల్ ఉద్యోగులకు పంపారు. ''మేము చేయగలిగిందంతా చేస్తాం.. అంతకంటే ఎక్కువ చేయడానికైనా మేము సిద్ధమే. ఇన్వెస్టర్లతో కలిసి పనిచేసేటప్పుడు, ఎంప్లాయిమెంట్‌లో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకుంటాం'' అని ఈ-మెయిల్ లో తెలిపారు. గత రెండు నెలలుగా కంపెనీ భవితవ్యంపై ఉద్యోగుల్లో నెలకొన్న అనిశ్చితిపై వ్యవస్థాపకులు భరోసా కల్పిస్తూ స్పందించడం ఇది మూడోసారి. వచ్చే రెండు వారాల్లో ఇంక్రిమెంట్లు ప్రకటించబోతున్నట్టు కూడా వ్యవస్థాపకులు పేర్కొన్నారు. శరవేగంగా దూసుకెళ్తున్న ఈ-కామర్స్ మార్కెట్లో స్నాప్ డీల్ తట్టుకోలేక, నెంబర్ -2 స్థానాన్ని కోల్పోయింది. మరోవైపు ఊహాగానాలను నిజం చేస్తూ ఫ్లిప్ కార్ట్ కు స్నాప్ డీల్ అమ్మే విషయాన్ని కంపెనీ ఈ నెలలోనే ప్రకటించబోతుందట.