rohithvemula
-
రోహిత్ వేముల కుటుంబాన్ని ఆదుకోవాలి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల కుటుంబాన్ని ఆదుకోవాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఆనంద్‌బాబు డిమాండ్ చేశారు. గురువారం కేకే భవన్లో రోహిత్ ప్రథమ వర్ధంతి నిర్వహణపై కేవీపీఎస్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, దళిత హక్కుల సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోహిత్ ఆత్మహత్యతో సంబంధం ఉన్న కేంద్రమంత్రులు, వీసీ, ఇతర అధికారులను కాపాడడం కోసం అçసలు ఆయన దళితుడే కాదని చెప్పడం భావ్యం కాదన్నారు. రోహిత్ వేముల జ్ఞాపకార్థం జనవరి 17ను దళిత హక్కుల దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈనెల 17 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేకే భవన్లో 17న వర్ధంతి సభను నిర్వహిస్తామని తెలిపారు. నాయకులు రాధాకృష్ణ, నాగేశ్వరరావు, మహేష్ పాల్గొన్నారు. -
మూడో రోజుకు చేరుకున్న ఆమరణ నిరాహార దీక్ష
సాక్షి, హైదరాబాద్: దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీలు తమ పదవుల నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ యూనివర్సిటీలో ఎనిమిది మంది రీసెర్చ్ స్కాలర్స్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం మూడో రోజుకు చేరింది. తమకు న్యాయం జరిగే వరకు దీక్షను విరమించబోమని వారు స్పష్టం చేశారు. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్, ఎన్ఎస్యూఐ, డీఎస్‌యూ, బీఎస్ఎఫ్ తదితర విద్యార్ధి సంఘాలకు చెందిన విద్యార్థులు గుమ్మడి ప్రభాకర్, ఉమామహేశ్వర్, వైఖరి, జయారావు, మనోజన్, కృష్ణయ్య, జైలావ్, రమేశ్ ఈ దీక్షకు దిగారు. జేడీయూ బృందం ఈ రోజు హెసీయూకు చేరుకొని దీక్ష చేస్తున్న విద్యార్థులకు తమ సంఘీభావం తెలుపనున్నారు. దీక్ష చేస్తున్న విద్యార్థుల బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయాయని వైద్యులు తెలిపారు. -
రెండో రోజుకు చేరుకున్న ఆమరణ నిరాహార దీక్ష
సాక్షి, హైదరాబాద్: దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీలు తమ పదవుల నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ యూనివర్సిటీలో ఎనిమిది మంది రీసెర్చ్ స్కాలర్స్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష గురువారం రెండో రోజుకు చేరింది. తమకు న్యాయం జరిగే వరకు దీక్షను విరమించబోమని వారు స్పష్టం చేశారు. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్, ఎన్ఎస్యూఐ, డీఎస్‌యూ, బీఎస్ఎఫ్ తదితర విద్యార్ధి సంఘాలకు చెందిన విద్యార్థులు గుమ్మడి ప్రభాకర్, ఉమామహేశ్వర్, వైఖరి, జయారావు, మనోజన్, కృష్ణయ్య, జైలావ్, రమేశ్ ఈ దీక్షకు దిగారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం హెచ్సీయూకు రానున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా హెచ్‌సీయూను సందర్శించనున్నారు. రేపు జేడీయూ బృందం హెసీయూకు చేరుకొని దీక్ష చేస్తున్న విద్యార్థులకు తమ సంఘీభావం తెలుపనున్నారు.