రోహిత్‌ వేముల కుటుంబాన్ని ఆదుకోవాలి | save to rohith vemula family | Sakshi
Sakshi News home page

రోహిత్‌ వేముల కుటుంబాన్ని ఆదుకోవాలి

Jan 12 2017 11:04 PM | Updated on Sep 5 2017 1:06 AM

రోహిత్‌ వేముల కుటుంబాన్ని ఆదుకోవాలి

రోహిత్‌ వేముల కుటుంబాన్ని ఆదుకోవాలి

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌ వేముల కుటుంబాన్ని ఆదుకోవాలని కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఆనంద్‌బాబు డిమాండ్‌ చేశారు.

 
 కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌ వేముల కుటుంబాన్ని ఆదుకోవాలని కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఆనంద్‌బాబు డిమాండ్‌ చేశారు. గురువారం కేకే భవన్‌లో రోహిత్‌ ప్రథమ వర్ధంతి నిర్వహణపై కేవీపీఎస్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, దళిత హక్కుల సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోహిత్‌ ఆత్మహత్యతో సంబంధం ఉన్న కేంద్రమంత్రులు, వీసీ, ఇతర అధికారులను కాపాడడం కోసం అçసలు ఆయన దళితుడే కాదని చెప్పడం భావ్యం కాదన్నారు. రోహిత్‌ వేముల జ్ఞాపకార్థం జనవరి 17ను దళిత హక్కుల దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఈనెల 17 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేకే భవన్‌లో 17న వర్ధంతి సభను నిర్వహిస్తామని తెలిపారు. నాయకులు రాధాకృష్ణ, నాగేశ్వరరావు, మహేష్‌ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement