roja faints
-
రోజాకు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి పరామర్శ
హైదరాబాద్ : నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే రోజాను శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించారు. ఆమె ఆరోగ్యంగ గురించి అడిగి తెలుసుకున్నారు. సస్పెన్షన్‌పై సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా కూడా తనను అసెంబ్లీకి అనుమతించకపోవడంతో మండుటెండలో మౌనదీక్ష చేసిన ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం నిమ్స్‌కు తరలించారు. రోజాకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెకు బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోవటంతో ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. -
సొమ్మసిల్లిన రోజా.. నిమ్స్‌కు తరలింపు
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అస్వస్థతతో సొమ్మసిల్లి పడిపోయారు. సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు చెప్పినా కూడా తనను అనుమతించకపోవడంతో మండుటెండలో మౌనదీక్ష చేసిన ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఉదయం 9 గంటల నుంచి ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం, దానికితోడు ఎండలో ఉండటంతో ఆమె డీహైడ్రేషన్‌కు గురైనట్లు తెలుస్తోంది. ఆమె తీవ్రంగా నీరసించారు. అయినా కూడా దీక్షాస్థలం నుంచి కదల్లేదు. తోటి మహిళా శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి రోజాను తన ఒళ్లో తల పెట్టించి పడుకోబెట్టారు. పలువురు ఎమ్మెల్యేలు ఆమెకు సంఘీభావంగా అక్కడే ఉన్నారు. చివరకు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 108 అంబులెన్సులో ఆమెను ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా నీరసించడంతో ఆమెకు చికిత్స అందించేందుకు నిమ్స్ ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.. అంటే మూడున్నర గంటల పాటు ఆమె ఎండలోనే మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఉండిపోయారు. అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడిన తర్వాత పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలంతా ఆమె వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. అనంతరం అక్కడి నుంచి ట్యాంక్‌బండ్ మీద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించేందుకు ర్యాలీగా వెళ్లారు.