rolling party
-
చిరు,పవన్‌ల ఎంట్రీ.. అధికార పార్టీలకే నష్టం..!
సాక్షి, వైజాగ్: సినీ నటుల రాజకీయ ప్రవేశంపై విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన మహా కామేశ్వర పీఠం అధిపతి యద్ధనపూడి అయ్యన్న పంతులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌లు రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి , పవన్‌లు రాజకీయాల్లోకి రావడం అధికార పార్టీలకే నష్టమని అయ్యన్న పంతులు అన్నారు. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే మరో పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కాలసర్ప దోషం ఉందని ఆయన పేర్కొన్నారు. యద్ధనపూడి అయ్యన్న పంతులు -
ఆక్రమణల పర్వం
సాక్షి, ఒంగోలు: జిల్లాలో అధికార పార్టీ నేతల భూ ఆక్రమణలు రోజుకొకటి చొప్పున బయటపడుతున్నాయి. ముఖ్యంగా సంతనూతలపాడు, మార్కాపురం నియోజకవర్గాల పరిధిలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను నేతలు కబ్జా చేసి అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు కొందరు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారు. అర్హులైన పేదలకు మాత్రం సెంటు భూమి కూడా దక్కే పరిస్థితి లేకుండాపోయింది. సంతనూతలపాడు మండలం పి.గుడిపాడు గ్రామానికి చెందిన సర్వే నంబరు 16/ఏలో 12.12 ఎకరాలు, సర్వే నెం.12/బీలో 18.97 ఎకరాలు డొంక పోరంబోకు భూమి ఉంది. దానిలో 16/1ఏలో 2.72 ఎకరాలు, 12/బీ2లో 1.80 ఎకరాలు కలిపి మొత్తం 4.52 ఎకరాల డొంక పోరంబోకును 2017 నవంబర్ 16న ఆన్లైన్లో చీమకుర్తి తహశీల్దార్‌గా పనిచేస్తున్న అశోక్‌వర్ధన్ చీమకుర్తి రెవెన్యూ కార్యాలయంలో ఎక్కించారు. ఆన్‌లైన్‌లోకి ఎక్కించిన రోజునే సంతనూతలపాడు మండల తహశీల్దార్‌గా పి.నీలకంఠేశ్వరరావు నూతనంగా విధులలో చేరారు. అప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న చీమకుర్తి తహశీల్దార్ అశోక్‌వర్ధన్ సంతనూతలపాడులో ఛార్జి ఇచ్చి డిజిటల్ కీ ఇవ్వకుండా చీమకుర్తిలో భూమిని ఎక్కించినట్లు తెలుస్తోంది. డిజిటల్ కీని మాత్రం నవంబర్ 23న సంతనూతలపాడు తహశీల్దార్‌కు అప్పగించారు. ఇదే విషయాన్ని ఈ నెల 6న పి.గుడిపాడులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఫిర్యాదులు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చట్టాన్ని ధిక్కరించి దందా.. దీంతో పాటు 16/1ఏలో 2.40 ఎకరాలు, 16/ఏ3లో 2.18 ఎకరాల డొంక పోరంబోకు భూమిని 2015 అక్టోబర్ 30న అప్పటి తహశీల్దార్ ఆర్.ప్రభాకర్‌రావు ఆన్లైన్లో ఎక్కించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ చట్టాలు ప్రకారం.. డొంక పోరంబోకు, వాగులు, కుంటలకు చెందిన భూములను కన్వర్షన్ చేయకుండా ఆన్లైన్లో ఎక్కించకూడదు. ఒక వేళ ఎక్కించాలంటే వీఆర్ఓ, ఆర్ఐ, సర్వేయర్ రిపోర్ట్లు తీసుకొని దానిని ఆర్డీఓ ద్వారా కలెక్టర్ అనుమతి తీసుకుని మాత్రమే అనాధీనం (ఏడబ్లు్య) భూమిగా మార్చి ఎక్కించాలి. అసలు పోరంబోకు భూములను కలెక్టర్ సైతం కన్వర్షన్ చేయకూడదని మెమో నంబరు 865/ఎం1 తేదీ 1983లో ఆనాటి ప్రభుత్వం విడుదల చేసింది. ఇన్ని చట్టాలు పోరంబోకు భూములకు రక్షణగా ఉంటే వాటిని కాపాడాల్సిన అధికారులే దగ్గరుండి బినామీల పేర్లుతో అడ్డగోలుగా భూములను అధికార ర్టీ నేతలకు ధారాదత్తం చేయడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. డొంకపోరంబోకు భూమి సంతనూతలపాడు–చీమకుర్తి మధ్య కర్నూల్ రోడ్డు ఫేసింగ్‌లో ఉంది. రోడ్డు ఫేసింగ్‌లో అక్కడ ఎకరం భూమి రూ.2 కోట్లు పలుకుతుంది. ఈ లెక్కన ఈ కుంభకోణం విలువ రూ.25 కోట్ల పైనే ఉంటుందని అంచనా. డివిజనల్ స్థాయి రెవెన్యూ అధికారి సైతం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. జరిగిన దానిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆర్డీఓ ఆదేశాల మేరకు తహశీల్దారు ఇప్పటికే నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆక్రమించి.. ఆన్లైన్ చేశారు.. ఇటీవల పొదిలిలోనూ భూ ఆక్రమణలు అడ్డు అదుపు లేకుండా సాగుతున్నాయి. పొదిలి పట్టణంలోనూ 50 ఎకరాల విస్తీర్ణంలోని చెరువును సైతం అధికార పార్టీ నేతలు ఆక్రమించారు. ఏకంగా పట్టాలు పొంది ఆన్లైన్లో సైతం ఎక్కించారు. దీని విలువ సుమారు రూ.20 కోట్లు ఉండవచ్చునని అంచనా. దీంతో పాటు పట్టణంలో పలు విలువైన స్థలాలను నేతలు ఆక్రమించి అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.40 కోట్ల విలువైన స్థలాలను అధికార పార్టీ నేత అమ్మినట్లు అధికార పక్షం నుంచే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భూ ఆక్రమణలపై ఉన్నతాధికారుల విచారణ జరిపిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. -
తొలి హామీనే మరిచిపోయిన లోకేష్
-
నాడు అయ్యో పాపం అన్నవారేరీ?
► నేడు ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం పరామర్శలా.. ► రాజకీయాల్లోకి దించి.. ఉసురు పోసుకున్నారు ► అధికార పార్టీ ఆధిపత్య పోరులో మాజీ చైర్మన్ కుటుంబం బలి ► అనాథగా మారిన మాజీ చైర్మన్ తనయుడు గుంటూరు : వారికి రాజకీయాలంటే ఏమిటో తెలియదు ఎక్కడో అమెరికాలో ఉన్నారు. మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మూడేళ్ల కిందట అభంశుభం తెలియని ఆధ్యాత్మిక చింతన కల్గిన కుటుంబాన్ని 15వ వార్డులో పోటీకి పెట్టారు. వారికున్న మంచి పేరును సద్వినియోగం చేసుకుని వారిని రాజకీయ ఊబిలోకి దించారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టించారు. పదవి ఎర చూపి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టించారు. తీరా గెలిచి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అధిష్టించిన గోపవరపు శ్రీదేవి ఆమె భర్త మల్లికార్జునరావును అధిపత్య పోరుతో వారు చనిపోయే వరకూ వెంటాడి వెంటాడి సొంత పార్టీ నాయకులే వారి మృతికి కారణమయ్యారు. గతేడాది జులై రెండో వారంలో రెండు సంవత్సరాల పదవీ కాలంలో ఉన్న తమను ఒక్క పనిచేయించుకోనీకుండా అడుగడునా అడ్డంపడి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టారని మాజీ మున్సిపల్ చైర్మన్ కుటుంబ సభ్యులు నిత్యం వేదనకు గురయ్యేవారు. ఒకరు పదవి నుంచి దిగమని, ఒకరు మేమున్నాం దిగవద్దని చెప్పి వారి జీవితాలతో ఆటలాడుకున్నారు. ఇదే సమయంలో రాయపాటి సాంబశివరావు సతీమణి లీలావతి మృతి చెందిన సమయంలో ఆమె మృతదేహాన్ని సందర్శించేందుకు వెళ్లిన వీరిని పదవీ కాలం ముగిసింది కదా రాజీనామా చేయాలని కోరినట్లు తెలిసింది. అనేక విషయాల్లో సొంత పార్టీ వారి నుంచే రాజకీయ ఒత్తిళ్లు ఎదుర్కొన్న మాజీ మున్సిపల్ చైర్మన భర్త మల్లికార్జునరావును నామినేటెడ్ పోస్టులో ఉన్న అదే వార్డుకు చెందిన ఓ నాయకుడు రాజీనామా చేయాల్సిందేనంటూ బెదిరించడంతో మరింత ఒత్తిడికి లోనై గుండెపోటుతో మృతి చెందారు. భర్త మృతితో ఉన్న ఒక్కగానొక్క కుమారుడితో మూడు నెలల పాటు ఇంటిలో నుంచి బయటకు రాకుండా మనోవేదనలో ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీదేవిని జిల్లా టీడీపీ నాయకులు, జిల్లా మంత్రి, ఎంపీలు, పక్క నియోజక వర్గ శాసన సభ్యులు, టీడీపీ నాయకులు పరామర్శల పేరుతో ఓదార్చారు. భర్తను కోల్పోయి ఒంటరి అయిన శ్రీదేవి పదేళ్ల పసి బాలుడిని ఏ విధంగా పెంచాలో అర్థంకాక అయోమయంతో ఆమె మరింత కుంగిపోయింది. దీంతో ఆమె గతేడాది ఆగస్టు 4వ తేదీన పురుగుమందు తాగి తన స్వగృహంలో బవన్మరణానికి పాల్పడింది. దీంతో ఆమె సామాజిక వర్గంలో ఆగ్రహం వ్యక్తం అయింది. అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యే అదిగో ఇదిగో మేము సాయం చేస్తాం, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామంటూ ప్రకటన చేశారు. ప్రలోభాలకు గురిచేస్తూ.. అధికార పార్టీ నాయకులు ఓట్ల కోసం ప్రలోభాలకు గురి చేస్తూ ఆ వార్డులో ఓటమి భయం నుంచి బయటపడేందుకు పర్యటన చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనాథగా మారిన శ్రీదేవీ కుమారుడికి ఇప్పుడు ఎవరు దిక్కు అంటూ ఆ సామాజిక వర్గంలో చర్చ జరుగుతుంది. ఎన్నికల కోసం లక్షల రూపాయలు ఖర్చుపెడుతున్న అధికార పార్టీ నాయకులు ఆ కుటుంబ బాధను ఎందుకు పట్టించుకోవడం లేదని అధికారపార్టీ నేతలను స్థానికులు నిలదీస్తున్నారు. అయ్యో పాపం అనని అధికార పార్టీ నాయకులంతా నేడు ఓట్ల కోసం వార్డులోకి వచ్చారని మండి పడుతున్నారు. ఏకగ్రీవానికి ఎమ్మెల్యే ప్రకటన.. వారు చనిపోయి సంవత్సరం నిండక ముందే ఆ వార్డుకు ఉప ఎన్నికలు వచ్చిన సమయంలో కూడా పార్టీ నాయకులు స్పందించలేదు. మాజీ చైర్మన్ కుటుంబ సభ్యులు ఎన్నికల బరిలో నిలిస్తే తాము పోటీ నుంచి తప్పుకుని వారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటామంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ టీడీపీ తరఫున నామినేషన్ వేసేందుకు వారు విముఖత చూపారంటే అధికారపార్టీపై వారిలో ఏ స్థాయిలో అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ వార్డులో ఆదివారం ఉప ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో కంటి తుడుపు చర్యలు కోసం కొంతమంది నాయకులు హడావుడిగా దివంగత మాజీ చైర్మన్ కుటుంబాన్ని పరామర్శించి వెనుదిరిగి వెళ్లారు.