అగ్నిప్రమాదంలో 11 పూరిళ్లు దగ్ధం
విజయనగరం: విజయనగరం జిల్లా పుసపాటిరేగ మండలం రోలుచొప్పడిలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 పూరిళ్లు దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్‌సర్క్యూటే కారణమని స్థానికులు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.