Rome Masters tennis tournament
-
చరిత్ర తిరగరాసిన జకోవిచ్
రోమ్ మాస్టర్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరడం ద్వారా సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. ఒకే మాస్టర్స్ 1000 ఈవెంట్లో 17 సార్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2007 నుంచి ఈ టర్నీలో పాల్గొంటున్న జకో.. ఆడిన ప్రతిసారి కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరి రికార్డుల్లోకెక్కాడు. ఈ టోర్నీ ప్రారంభ రౌండ్లలో ఇప్పటివరకు ఓటమి ఎరుగని జకో.. తాజా ప్రదర్శనతో దిగ్గజ ఆటగాడు రఫెల్ నదాల్ రికార్డును (16 సార్లు క్వార్టర్స్ చేరిన రికార్డు) బద్దలు కొట్టాడు. రోమ్ మాస్టర్స్‌లో ప్రస్తుతం జకోవిచ్ గెలుపోటముల రికార్డు 67-10గా ఉంది. 2007 నుంచి జకో ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు ముందు ఓడింది లేదు. ఇదిలా ఉంటే, 22 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన జకోవిచ్ ఇటీవల తన సహచర ఆటగాళ్లు రోజర్ ఫెదరర్, రఫెల్ నదాల్‌లను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. తాను ఫెదరర్, నదాల్లతో ఎప్పుడు స్నేహం చేయలేదని జకో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రత్యర్థుల మధ్య స్నేహం ఎప్పటికీ కుదరదని చెప్పిన జకో.. తాను ఫెదరర్, నదాల్‌లను ఎప్పుడూ గౌరవిస్తానని అన్నాడు. తాను ఫెదరర్, నదాల్‌లను చూస్తూ పెరిగానని, ప్రస్తుతం తాను ఈ స్థాయిలో ఉన్నానంటే వారి వల్లేనని చెప్పుకొచ్చాడు. కాగా, పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన రికార్డును జకోవిచ్.. రఫెల్ నదాల్ (22)తో పాటు షేర్ చేసుకున్నాడు. ఈ ఇద్దరు మోడ్రన్ టెన్నిస్ దిగ్గజాల తర్వాత రోజర్ ఫెదరర్ (20) ఉన్నాడు. చదవండి: కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో ప్రణయ్ -
చెమటోడ్చిన జోకర్
రోమ్: టెన్నిస్ వరల్డ్ నెంబర్ 1 నోవాక్ జకోవిచ్ రోమ్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్లో ప్రవేశించాడు. శుక్రవారం రోమ్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మాజీ యూఎస్ చాంపియన్ అర్జెంటినా ఆటగాడు డెల్ పోట్రోపై 4-6,7-6(8-6),6-4 తేడాతో చెమటోడ్చి గెలిచాడు. మోకాలి గాయంతో గత కొంత కాలంగా టెన్నిస్‌కు దూరంగా ఉన్న పోట్రో ఆట ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. 12 ఏస్‌లతో జోకర్‌ను బెంబేలెత్తించాడు. ఓటమి నుంచి గెలుపు దిశగా.. మొదటి సెట్ గెలిచిన పోట్రో రెండో సెట్లోనూ దూకుడును ప్రదర్శించాడు. బేస్‌లైన్ షాట్స్ ఆడుతూ జోకర్‌కు చుక్కలు చూపించాడు. అయితే రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్న జకోవిచ్ మ్యాచ్‌ను టై బ్రేక్‌కు తీసుకెళ్లాడు. టై బ్రేక్‌లో 8-6తో గెలిచి రెండో సెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడో సెట్‌ను గెలిచి సెమీఫైనల్లో ప్రవేశించాడు. సెమీఫైనల్లో మరో అర్జెంటీనా ఆటగాడు డియాగో ష్వార్జ్జ్టమాన్తో తలపడనున్నాడు. అదృష్టంతో గట్టెక్కా.. ‘‘ సరైన సమయంలో నాకు అదృష్టం తోడైంది. మొదటి సెట్లో పోట్రో అద్భుతంగా ఆడాడు. రెండో సెట్లో నేను రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం నాలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత నా ఆటతీరు కాస్త గాడి తప్పింది. అయితే ఈ మ్యాచ్ ద్వారా తిరిగి నా పూర్వపు ఫామ్‌ను అందుకున్నానని ఆశిస్తున్నాను ’’ -జకోవిచ్ -
సెమీస్‌లో సానియా జోడి
రోమ్ : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి రోమ్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో సానియా జోడి 6-4, 6-3తో జులియా జార్జెస్ - సిల్వ సోలెర్ జంటపై గెలిచింది. గంటా 11 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో టాప్‌సీడ్ సానియా జోడి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఇదే టోర్నీ పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్) - ఫ్లోరిన్ (రుమేనియా) జోడి క్వార్టర్స్‌లో 2-6, 7-5, 8-10తో జీన్ రోజెర్ (నెదర్లాండ్స్)-హోరియా (రుమేనియా) జోడి చేతిలో ఓడిపోయింది.