సెహ్వాగ్‌కి ఊహించని కౌంటర్.. అంతా షాక్
సాక్షి, స్పోర్ట్స్ : సోషల్ మీడియలో సెటైర్లు వేయటంలో టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దిట్ట అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టైమింగ్ పంచులతో విరుచుకుపడటం వీరూకి చాలా మామలు విషయం. అయితే.. ఈ ట్విట్టర్ కింగ్ కే కౌంటర్(సరదాగా) ఇచ్చి సోషల్ మీడియాలో అందరిచేత నోళ్లు వెళ్లబెట్టించాడు ఓ ఆటగాడు. అది ఎవరో కాదు.. న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్.
భారత్ తో తొలి వన్డేలో కివీస్ విజయం సాధించిన విజయం తెలిసిందే. అద్భుతమైన ఇన్నింగ్స్ తో రాస్ టేలర్ విజయానికి కారణమయ్యాడు. దీంతో టేలర్ అభినందిస్తూ... వీరూ తన శైలిలో ఓ ట్వీట్ చేశాడు. ‘చాలా బాగా ఆడావు రాస్ టేలర్ దర్జీ జీ (టేలర్ ను టైలర్ అన్నడన్న మాట). దీపావళి సందర్భంగా వచ్చిన ఆర్డర్స్ తో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా దాన్ని అధిగమించావు’ అంటూ ట్వీట్ చేశాడు.
Thanks @virendersehwag bhai agli Baar Apna order time pe Bhej dena so Mai Apko agli Diwali ke pehle deliver kardunga ....happy Diwali
— Ross Taylor (@RossLTaylor) 23 October 2017
అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్. దానికి తగ్గట్లే హిందీలోనే ఆ దర్జీ(టేలర్) రిప్లై ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేశాడు. ‘ధన్యవాదాలు సెహ్వాగ్! వచ్చే ఏడాది దీపావళికి ఒకవేళ నువ్వు ఆర్డర్ ఇస్తే, ముందుగానే డెలివరీ చేసేస్తాను’ అంటూ రీట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ల పర్వం ఇక్కడితోనే ఆగలేదు. ‘హ హ హ మాస్టర్ జీ! ఈ ఏడాది దీపావళికి నేను తీసుకున్న ప్యాంటు చాలా లూజ్ గా ఉంది. దీన్ని బాగు చేసి వచ్చే ఏడాది దీపావళికి పంపించు. రాస్ ద బాస్’ అంటూ మరో ట్వీట్ చేశాడు.
Has your Darji not done a good job this Diwali 😜?
— Ross Taylor (@RossLTaylor) 23 October 2017
No one can match up to your high standards of stitching Darji ji , whether it is a pant or a partnership @RossLTaylor https://t.co/WDInvXL4EW
— Virender Sehwag (@virendersehwag) 23 October 2017
ఏమాత్రం తగ్గని రాస్ టేలర్ దానికి తగ్గట్లే ‘మీ దర్జీ ఈ దీపావళికి సరిగా కుట్టలేదా’ అంటూ ప్రశ్నించి అభిమానులను మరింత ఆశ్చర్యానికి గురి చేశాడు. ‘నీలా ఉన్నత ప్రమాణాలతో ఎవరూ రాణించలేరు కదా. అది కుట్టడంలో అయినా.. మైదానంలో భాగస్వామ్యం నెలకొల్పడంలోనైనా’ అంటూ ట్వీట్ చేశాడు. వెంటనే దాదా సౌరవ్ గంగూలీ సీన్ లోకి ఎంటర్ అయ్యి నీకు హిందీ వచ్చా అంటూ.. రాస్ టేలర్ ని ప్రశ్నించాడు. ఒక్క దాదానే కాదు.. ఈ ట్వీట్లు చూసిన ప్రతీ ఒక్కరూ టై(టే)లర్ టైమింగ్‌కు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతంలో రాస్ టేలర్ ఐపీఎల్ లో సెహ్వాగ్ తో కలిసి ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆడాడు కూడా.