RPF staff
-
‘మేరీ సహేలీ’తో మహిళా ప్రయాణికులకు రక్ష
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): రైళ్లలో ప్రయాణించే మహిళల భద్రతే ముఖ్య ఉద్దేశంగా మేరీ సహేలీ(మై ఫ్రెండ్) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రైల్వే భద్రతా దళం(ఆర్పీఎఫ్) అందుబాటులోకి తీసుకొచ్చింది. శనివారం విశాఖ రైల్వే స్టేషన్లో సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ జితేంద్ర శ్రీవాస్తవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గోదావరి స్పెషల్ ఎక్స్‌ప్రెస్, ఏపీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్ల వద్ద మహిళా ప్రయాణికులకు ఆర్పీఎఫ్ సిబ్బంది అవగాహన కల్పించారు. భద్రత ఇలా: ఆర్పీఎఫ్ సిబ్బంది ముందుగా మహిళా ప్రయాణికుల సీటు, బెర్త్, కోచ్ నంబర్లు తదితర సమాచారం సేకరించి వారిని అప్రమత్తం చేస్తారు. ఇదే సమాచారాన్ని ఆ రైలు ప్రయాణించే అన్ని స్టేషన్లలోని ఆర్పీఎఫ్ సిబ్బందికి ఆందజేస్తారు. ఆ రైలు ఆ స్టేషన్‌కు వెళ్లే సమయానికి అక్కడ ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయాణికుల వద్దకు వెళ్తారు. వారి స్థితిని తెలుసుకుంటారు. ఇలా ఆ రైలు గమ్యం చేరే వరకు ప్రతి స్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది వారిని అనుసరిస్తుంటారు. అత్యవసరమైతే ఉచిత హెల్ప్‌లైన్ 182 నంబర్లో సంప్రదించాలని ప్రయాణికులకు చెబుతున్నారు. -
ఆ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకే
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)లో ఖాళీ కానున్న ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం కేటాయించనున్నామని శుక్రవారం ప్రకటించారు. ఆర్పీఎఫ్లో దాదాపు 9 వేల కానిస్టేబుల్, సబ్-ఇన్స్పెక్టర్ పోస్టులు త్వరలో ఖాళీ కానున్నాయని, ఇందులో 50 శాతం మహిళలకే కేటాయించ నున్నామంటూ ఆయన ట్వీట్ చేశారు. అంటే 4500 ఉద్యోగాలు మహిళలు దక్కించుకోనున్నారు. రైల్వేలో ఎక్కువమంది మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్రమంత్రి వెల్లడించారు రైల్వేలలో 1.32 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, మరో రెండేళ్లలో ఒక లక్ష మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారని ఈ ఏడాది జనవరిలో వెల్లడించిన సంగతి తెలిసిందే. గత ఏడాది ప్రారంభించిన నాలుగు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ రాబోయే రెండు నెలల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రైల్వేలకు చెందిన మౌలిక సౌకర్యాలు, రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిరక్షణ బాధ్యతను ఆర్పీఎఫ్ చూసుకుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో గవర్నమెంట్ రైల్వే (జీఆర్పీ)శాంతి భద్రతల అంశాలను చూసుకుంటుందని, గడచిన రెండేళ్లలో మహిళల భద్రత, చిన్న పిల్లలు తప్పిపోకుండా నివారించే చర్యలను విజయవంతంగా నిర్వర్తించామని గోయల్ తన ట్వీట్లో పేర్కొన్నారు. -
యువతిపై అత్యాచార యత్నం
రక్షించిన ఆర్పీఎఫ్ సిబ్బంది అపరిచితులను నమ్మవద్దని ఎస్ఐ రమణయ్య సూచన తాడేపల్లి రూరల్ : అపరిచిత వ్యక్తి బారి నుంచి ఓ యువతిని తాడేపల్లి ఆర్పీఎఫ్ సిబ్బంది రక్షించిన సంఘటన తాడేపల్లి కృష్ణాకెనాల్ జంక్షన్లో గురువారం చోటుచేసుకుంది. ఆర్పీఎఫ్ ఎస్ఐ కెవి రమణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల సమీపంలో గాజులపల్లి గ్రామంలో నివాసం ఉండే యువతికి రెండు నెలల క్రితం గిద్దలూరుకు చెందిన వెంకటేశ్వరరావుతో వివాహం జరిగింది. బుధవారం రాత్రి యువతి భర్త వెంకటేశ్వరరావు కొట్టి ఇంటి నుంచి గెంటివేయడంతో పుట్టింటికి వెళదామని వచ్చిన మాధవి పొరపాటున విజయవాడ వచ్చే రైలు ఎక్కింది. ఈ సమయంలో రైల్లో పరిచయమైన ఓ అపరిచిత వ్యక్తి తన ఇంటికి తీసుకువెళతానంటూ నమ్మబలికి కృష్ణాకెనాల్ జంక్షన్లో దింపాడు. మరొకరిని తన భార్యలా యువతితో ఫోనులో మాట్లాడించాడు. అతని మాటలు నమ్మిన యువతి కృష్ణాకెనాల్ జంక్షన్లో రైలు దిగి అపరిచితుడితోపాటు అతని ఇంటికి వెళ్లడానికి సిద్ధమైంది. అయితే సదరు అపరిచితుడు ఇంటికి తీసుకువెళ్లకుండా పాడు పడిన రైల్వే క్వార్టర్స్‌లోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నం చేశాడు. యువతి పెద్దగా కేకలు వేయడంతో సమీపంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అక్కడికి వెళ్లారు. దీంతో సదరు అపరిచితుడు పరారయ్యాడు. యువతిని పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి గిద్దలూరు, నంద్యాల ఆర్పీఎఫ్ పోలీసులను సంప్రదించి మాధవి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు వచ్చిన అనంతరం యువతిని అప్పగించారు. అపరిచితులను నమ్మవద్దు.. రైళ్లలో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మహిళలు అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని ఆర్పీఎఫ్ ఎస్ఐ కెవి రమణయ్య సూచించారు. ప్రయాణంలో తెలియని వ్యక్తులు తినుబండారాలు ఇచ్చినా తీసుకోవద్దని, ఒకవేళ ఒక రైలు ఎక్కబోయి, మరో రైలు ఎక్కితే రైల్వే స్టేషన్లో విధులు నిర్వహించే సిబ్బందిని కలిసి సమాచారం తెలుసుకోవాలని, అపరిచితుల మాటలు నమ్మవద్దని ఆయన అన్నారు. భార్యభర్తల మధ్య గొడవలు అయిన సమయంలో ఇలాగే మహిళలు అసాంఘిక శక్తుల చేతుల్లో పడి వారి జీవితాలను కోల్పోతున్నారని అన్నారు. -
‘గుట్కా’ కేసులో ఇద్దరు ఆర్పీఎఫ్ జవాన్ల అరెస్టు
సాక్షి, ముంబై: గుట్కా కేసులో ఇద్దరు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్పీఎఫ్)సిబ్బందిని అరెస్టు చేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... లోకమాన్య తిలక్ టర్మినస్ స్టేషన్లో ఒకటవ ఫ్లాట్‌ఫాం సమీపంలో, అక్టోబర్ 15 వ తేదీన రూ. 3 లక్షల విలువ చేసే గుట్కాను సీజ్ చేశారు. ఆ సందర్భంగా జీఆర్పీ సిబ్బంది ఆర్ఆర్ జైస్వాల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. కాగా, అతడిని విచారించగా తనకు గుట్కాను ఇద్దరు ఆర్పీఎఫ్ సిబ్బందే అందజేశారని చెప్పాడు. అతడిచ్చిన సమాచారం మేరకు ఆర్పీఎఫ్కు చెందిన కానిస్టేబుళ్లు విశాల్ పాటిల్, విజయ్ అమాడేలను అరెస్టు చేసినట్లు జీఆర్పీ అధికారి తెలిపారు. అలాగే వారిద్దరినీ సస్పెండ్ చేసినట్లు వివరించారు.