RRC exams
-
'ఆర్ఆర్సీ' మాస్ కాపీయింగ్ కేసులో ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్: ఆర్ఆర్సీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పాల్పడిన ముగ్గురిని స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారి మశ్చేందర్తోపాటు సీనియర్ రైల్వేశాఖ అధికారి రాజశేఖర్‌తో పాటుమరో వ్యక్తిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. రైల్వేశాఖలో గ్రేడ్-1 ఆఫీసర్‌గా పనిచేస్తున్న మశ్చేందర్ 2008, 2010 ఆర్ఆర్బీ, వీఆర్ఓ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీకి విఫలయత్నం చేశాడు. కాగా, ఈ కేసులో మరో రైల్వేశాఖ ఉద్యోగి మహేందర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. గత నెల్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బి) గ్రూప్-బి పరీక్షను హైటెక్ పద్దతిలో మాస్ కాపీయింగ్ చేస్తున్న 34 మందితో కూడిన ముఠాను స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రైల్వే క్వార్టర్స్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఈ ముఠా మానిటరింగ్ చేస్తూ మాస్ కాపీయింగ్ కు పాల్పడింది. అప్పట్నుంచీ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మశ్చేందర్ ను తాజాగా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
ఆర్ఆర్సీ కేసులో పురోగతి
-
ఆర్ఆర్సీ పరీక్షలకు స్పెషల్ ట్రైన్
సాక్షి, హైదరాబాద్: ఆర్ఆర్సీ పరీక్షల అభ్యర్థుల కోసం ఈ నెల 23, 30 తేదీలలో సికింద్రాబాద్-భువనేశ్వర్ (08404) ప్రత్యేక జనసాధారణ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరనుంది. ఈ ట్రైన్ సాయంత్రం 3.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.30కి భువనేశ్వర్ చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఒక ప్రకటనలో తెలిపారు. -
ఆర్ఆర్సీ పరీక్షలకు జనసాధారణ్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ఆర్ఆర్సీ ఎగ్జామ్స్‌కు హాజరయ్యే అభ్యర్థుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాకినాడ-సికింద్రాబాద్ మధ్య జనసాధారణ్ స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈ నెల 15, 22, 29 తేదీలలో మధ్యాహ్నం 3.30 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మురుసటి రోజు ఉదయం 3.50 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్-కాకినాడ (07206) రైలు ఈ నెల 16, 23, 30 తేదీలలో రాత్రి 9.45కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.35కి కాకినాడ చేరుకుంటుంది. ధారూర్‌లో హాల్టింగ్... రంగారెడ్డి జిల్లా ధారూర్ మెథడిస్ట్ చర్చ్ వద్ద జరగనున్న క్రిస్ట్మస్ జాతరను దృష్టిలో ఉంచుకొని రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ధారూర్‌లో తాత్కాలిక హాల్టింగ్ సదుపాయాన్ని కల్పించినట్లు సీపీఆర్వో తెలిపారు. ఈ నెల 17వ తేదీ వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. నాందేడ్ నుంచి బెంగళూరుకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ (16593/16594)మధ్యాహ్నం 3.26 గంటలకు ధారూర్‌లో ఒక నిమిషం పాటు ఆగుతుంది. బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్లే సమయంలో మధ్యాహ్నం 1.02 గంటలకు ధారూర్ చేరుకుంటుంది. అలాగే హైదరాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (17429/17430) హైదరాబాద్ నుంచి వెళ్లేటప్పుడు సాయంత్రం 5.40 గంటలకు, తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఉదయం 5.10 గంటలకు ఒక నిమిషం పాటు ధారూర్‌లో ఆగుతుంది.