'ఆర్ఆర్సీ' మాస్ కాపీయింగ్ కేసులో ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్: ఆర్ఆర్సీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పాల్పడిన ముగ్గురిని స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారి మశ్చేందర్తోపాటు సీనియర్ రైల్వేశాఖ అధికారి రాజశేఖర్తో పాటుమరో వ్యక్తిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. రైల్వేశాఖలో గ్రేడ్-1 ఆఫీసర్గా పనిచేస్తున్న మశ్చేందర్ 2008, 2010 ఆర్ఆర్బీ, వీఆర్ఓ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీకి విఫలయత్నం చేశాడు. కాగా, ఈ కేసులో మరో రైల్వేశాఖ ఉద్యోగి మహేందర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు స్పష్టం చేశారు.
గత నెల్లో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బి) గ్రూప్-బి పరీక్షను హైటెక్ పద్దతిలో మాస్ కాపీయింగ్ చేస్తున్న 34 మందితో కూడిన ముఠాను స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రైల్వే క్వార్టర్స్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఈ ముఠా మానిటరింగ్ చేస్తూ మాస్ కాపీయింగ్ కు పాల్పడింది. అప్పట్నుంచీ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మశ్చేందర్ ను తాజాగా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.