సాక్షి, సిటీబ్యూరో: టోఫెల్, జీఆర్‌ఈ తదితర పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ముఠాలకు సంబంధించిన కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టు ఆదేశాలతో జ్యుడీíÙయల్ రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానంలో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో ఇంకా అరెస్టు కావాల్సిన సంఖ్య 19గా పేర్కొన్నారు. ఈ నివేదికలో కేసుకు సంబంధించిన ఆసక్తికర అంశాలను పొందుపరిచారు.
బ్యాచులర్ రూములే అడ్డాలు..
ఆన్‌లైన్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కోసం అనేక ముఠాలు పని చేస్తున్నాయి. వీటిలో గుణ శేఖర్, శ్రావణ్‌లకు చెందినవి ఉన్నాయి. ఇవి నగరంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న బ్యాచులర్స్ రూములే అడ్డాగా ఈ దందా చేస్తున్నాయి. ఆ యువకులకు గంటల లెక్కన అద్దె చెల్లిస్తూ అక్కడే తాత్కాలిక కంప్యూటర్, హై స్పీడ్ ఇంటర్‌నెట్ కనెక్షన్ ఏర్పాటు చేసుకున్నాయి. గుణ శేఖర్‌కు నగరం నడిబొడ్డున పది రూమ్స్ ఉండగా... శ్రావణ్ గ్యాంగ్‌కు శివార్లలో 13 వరకు ఉన్నాయి. తమతో ఒప్పందం కుదుర్చుకున్న వారిని పరీక్ష రాయడానికి ఇక్కడికే పిలిచే వాళ్లు. ఈ సూత్రధారులు టోఫెల్, జీఆర్‌ఈ పరీక్షల్లో ఉండే సబ్జెక్టులను అనుగుణంగా ఎక్స్‌పర్ట్స్‌ను ఎంగేజ్ చేసుకున్నారు. ఒక్కో సజ్జెక్టుకు కనీసం ఐదుగురు చొప్పున నిపుణులతో ఒప్పందం చేసుకుని వారితో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశాయి.
‘బయటకు–లోపలకు’ వీటి ద్వారానే..
పరీక్ష జరిగే సమయంలో ఏమాత్రం గందరగోళానికి ఆస్కారం లేకుండా వీళ్లు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే గ్రూపు కాకుండా ఒక్కోదానికి ఒక్కోటి చొప్పున ఏర్పాటు చేసుకున్నారు. గణితం కోసం ‘జోరో జోరో’ పేరుతో, ఫిజిక్స్‌కి ‘దేశీ బాయ్స్’ పేరుతో ఇవి పని చేశాయి. అభ్యర్థి పరీక్ష రాసే గదిలోనే ఈ ముఠాకు చెందిన వ్యక్తి రహస్యంగా దాక్కుని ఉండేవాడు. కెమెరా కంట పడకుండా కూర్చుకుని తెరపై కన్న ప్రశ్న పత్రాన్ని తన సెల్‌ఫోన్‌లో ఫొటో తీసేవాడు. ఏ సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రశ్నలను ఆ గ్రూపులో పోస్టు చేసేవాడు. దీని చూసే ఎక్స్‌పర్ట్స్ తక్షణం స్పందించి సమాధానాలు అదే గ్రూపులో పోస్టు చేయడం, దాన్ని కను సైగలు, వేళ్ల కదలికల ద్వారా పరీక్ష రాసే అభ్యర్థికి ముఠా సభ్యుడు అందించడం నిమిషాల్లో జరిగిపోయేవి.
మరికొన్ని ముఠాలు ఉన్నట్లు గుర్తింపు..
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం మండల శ్రావణ్ కుమార్, మండల సాయి సంతో‹Ù, పి.కిశోర్, ఎ.కిరణ్‌కుమార్‌లను అరెస్టు చేశారు. వీరిలో అమెరికాలో ఉన్న గుణశేఖర్‌తో కలిసి కిషోర్ పని చేయగా.. మిగిలిన ముగ్గురూ మరో విడిగా ముఠా కట్టి మాస్ కాపీయింగ్ కథ నడిపారు. ఇలాంటి గ్యాంగ్స్ తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. వీరిలో జ్యోతిరాదిత్య (వైజాగ్), తేజేందర్ రెడ్డి (గుంటూరు), హైదరాబాద్‌కు చెందిన అభిజిత్ రెడ్డి, బోలిశెట్టి భాను తేజ, వినీత్ రెడ్డి, సూర్య వంశి, మండా విశ్వక్‌సేన్ రెడ్డి, బడిని రవి కుమార్, సతీ‹Ù, కిక్ బౌస్కీ, సుద్ని సాయి కిరణ్ రెడ్డి, దినే‹Ù, సాయి కిరణ్ రెడ్డి, కిషక్షర్ కుమార్, అభి, యువ, తేజ రెడ్డిలతో పాటు అమెరికాలో ఉన్న గుణ శేఖర్‌ను పరారీలో ఉన్న నిందితులుగా పేర్కొన్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు
గాలిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment