Mass copying case
-
TSPSC Case: ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ చిత్రం చూసి మాస్ కాపీయింగ్.
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజ్‌తోపాటు హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన నీటిపారుదల శాఖ పెద్దపల్లి ఏఈ పూల రమేష్ విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. సిట్ అధికారులు ఇతడిని బుధవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు ప్రస్తావించారు. హైటెక్ మాస్ కాపీయింగ్ ద్వారా ఇతడు రూ.1.1 కోటి వరకు ఆర్జించినట్లు తేల్చారు. ఒక్కో అభ్యర్ధితో రూ.20–30 లక్షల వరకు ఒప్పందం కుదుర్చుకుని, ఏడుగురితో ఏఈఈ, డీఏఓ పరీక్షలు రాయించినట్లు పేర్కొన్నారు. కొంత మొత్తం అడ్వాన్సుగా తీసుకున్న ఇతడు మిగిలింది ఫలితాల తర్వాత తీసుకోవాల్సి ఉందని అందులో చెప్పారు. కాగా, భార్యను హత్య చేసినట్లు రమేశ్‌పై ఆరోపణలున్నాయి. ఆస్పత్రిలో డాక్టర్ ద్వారా పరిచయం పెద్దపల్లిలో ఇరిగేషన్ ఏఈగా పనిచేస్తున్న రమేశ్‌కు గతంలో నార్కట్‌పల్లి వద్ద ప్రమాదం జరిగింది. అప్పట్లో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా... డాక్టర్ ద్వారా టీఎస్పీఎస్సీ ఉద్యోగి సురేష్ పరిచయం అయ్యాడు. ఆపై ఇద్దరూ స్నేహితులుగా మారడంతో నగరంలోని రమేష్ ఇంట్లో సురేష్ అద్దెకు దిగాడు. ఆపై ఇద్దరి మధ్యా స్నేహం బలపడింది. టీఎస్పీఎస్సీలో ఉద్యోగం మానేసిన సురేష్ పేపర్ల లీకేజ్‌లో కీలకంగా మారాడు. ఇతడి ద్వారా ఏఈ పరీక్షలకు సంబంధించిన పేపర్లు రమేష్‌కు అందాయి. వీటిని ఇతడు 30 మందికి విక్రయించాడు. ఇలా వచ్చిన సొమ్ములో సగం సగం తీసుకుందామని సురేష్ ప్రతిపాదించాడు. దీనికి అంగీకరించని రమేష్... తనకు 70 శాతం ఇచ్చేలా సురేష్‌ను ఒప్పించాడు. అభ్యర్థులను వెతికి పట్టుకోవడం, విక్రయించడం లాంటి రిస్కులు తనవే అని, అందుకే ఎక్కువ వాటా కావాలన్నాడు. దీంతో సురేష్ ఏఈఈ, డీఏఓ పేపర్ల లీకేజ్ విషయం ఇతడికి చెప్పలేదు. దీంతో ఏడుగురితో ఒప్పందం చేసుకుని హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పథకం వేశాడు. ఇతడు అనుసరించిన హైటెక్ కాపీయింగ్‌కు ఓ సినిమానే స్ఫూర్తిగా నిలిచింది. చదవండి: తెరపైకి కొత్త సీపీ.. సీఎంవోలో పని చేస్తున్న పోలీస్ ఉన్నతాధికారి ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ చిత్రం చూసిన రమేష్ అందులోని కాపీయింగ్ పంథాను కాస్త హైటెక్‌గా మార్చి టీఎస్పీఎస్సీ పరీక్షలకు వినియోగించాడు. కాపీయింగ్‌కు రమేష్ భారీ స్కెచ్ వేశాడు. ఇంటర్నెట్ నుంచి అత్యాధునికమైన చెవిలో ఇమిడిపోయే బ్లూటూత్, సిమ్‌కార్డు ఆధారంగా పని చేసే చిన్న రిసీవర్, ట్రాన్స్‌మీటర్ తదితరాలు ఖరీదు చేశాడు. బ్లూటూత్ డివైజ్ ఎవరికీ కనిపించకుండా చెవిలో పెట్టించాడు. వారి చొక్కా కింది భాగంగా ప్రత్యేకంగా కుట్టించిన జేబులో రిసీవర్ ఉంచాడు. ఏడుగురు అభ్యర్థులు కచ్చితంగా ఇన్‌షర్ట్ చేసుకునేలా సూచించి తనిఖీల్లో దొరక్కుండా చేశాడు. ఓ పరీక్ష కేంద్రం నిర్వాహకుడితో ఒప్పందం చేసుకున్న రమేష్ పరీక్ష పత్రం బయటకు పంపేలా ప్రేరేపించాడు. ఆయా పరీక్షలకు గైర్హాజరైన వారి ప్రశ్నపత్రాలు అన్ని సిరీస్‌లవి ఫొటోలు తీసి ఈ నిర్వాహకుడు వాట్సాప్ ద్వారా రమేశ్‌కు పంపాడు. అప్పటికే ఇతడు సిద్ధం చేసుకున్న బృందానికి వీటిని పంపాడు. వాళ్లు చాట్‌జీపీటీ యాప్ ద్వారా ఆయా ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి.. వాటిని తమ వద్ద ఉన్న ట్రాన్స్‌మీటర్ ద్వారా ఏడుగురు అభ్యర్థులకు చెప్పారు. ఒక సిరీస్ తర్వాత మరో సిరీస్‌లోని ప్రశ్నల జవాబులను వీళ్లు చెప్పారు. రమేశ్‌తోపాటు ముగ్గురు అభ్యర్థులను అరెస్టు చేసిన సిట్ మిగిలిన నిందితుల కోసం గాలిస్తోంది. అరెస్టయిన ఇతర నిందితులను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవాలని సిట్ నిర్ణయించింది. ‘లీకేజీ’ వ్యవహారంలో 50 మంది డిబార్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన పలువురిని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇలా అరెస్టయి కస్టడీలో ఉన్న అభ్యర్థులను టీఎస్పీఎస్సీ పరీక్షల నుంచి డిబార్ చేసింది. ఆయా అభ్యర్థులను ఇప్పటికే టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో అనర్హులుగా ప్రకటించగా... భవిష్యత్తులోనూ వారిని పరీక్షలకు అనుమతించబోమని తేల్చింది. ఇలా 50మందిని పరీక్షల నుంచి డిబార్ చేస్తూ టీఎస్పీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. డిబార్ చేసిన అభ్యర్థులు వివరణ సమర్పించాలని భావిస్తే రెండ్రోజుల్లోగా కమిషన్‌కు సమరి్పంచాల్సి ఉంటుందని వెబ్‌నోట్ ద్వారా వెల్లడించింది. అయిన అభ్యర్థులు వీరే.. పులిదిండి ప్రవీణ్‌కుమార్, అట్ల రాజశేఖర్‌రెడ్డి, రేణుక రాథోడ్, లవడ్యావత్ దాఖ్య, కే.రాజేశ్వర్, కే.నీలేశ్ నాయక్, పి.గోపాల్‌నాయక్, కే.శ్రీనివాస్, కే.రాజేందర్ నాయక్, షమీమ్, ఎన్.సురేశ్, డి.రమేశ్‌కుమార్, ఏ.ప్రశాంత్‌రెడ్డి, టి.రాజేంద్రకుమార్, డి.తిరుపతయ్య, సాన ప్రశాంత్, వై.సాయిలౌకిక్, ఎం.సాయి సుష్మిత, కోస్గి వెంకట జనార్థన్, కోస్గి మైబయ్య, కోస్గి రవి, కోస్గి భగవంత్ కుమార్, కొంతం మురళీధర్ రెడ్డి, ఆకుల మనోజ్ కుమార్, ఆది సాయిబాబు, పొన్నం వరున్‌కుమార్, రమావత్ మహేశ్, ముదావత్ శివకుమార్, దానంనేని రవితేజ, గున్రెడ్డి క్రాంతికుమార్ రెడ్డి, కొంతం శశిధర్‌రెడ్డి, అట్ల సుచరితారెడ్డి, జీపీ పురేందర్, నూతన్ రాహుల్ కుమార్, లవ్‌డ్యా శాంతి, రమావత్ దత్తు, అజ్మీరా పృథీ్వరాజ్, జాదవ్ రాజేశ్వర్, పూల రవికిశోర్, రాయపూర విక్రమ్, రాయపురం దివ్య, ధనావత్ భరత్ నాయక్, పాశికంటి రోహిత్‌కుమార్, గాదె సాయిమధు, లోకిని సతీశ్‌కుమార్, బొడ్డుపల్లి నర్సింగ్‌రావు, గుగులోత్ శ్రీనునాయక్, భుక్య మహేశ్, ముదావత్ ప్రశాంత్, వడిత్య నరేశ్, పూల రమేశ్‌కుమార్. -
గ్రూపుల్లోనే గూడుపుఠాణి!.. మాస్ కాపీయింగ్‌లో వాట్సాప్ గ్రూపులే కీలకం!
సాక్షి, సిటీబ్యూరో: టోఫెల్, జీఆర్ఈ తదితర పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ముఠాలకు సంబంధించిన కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టు ఆదేశాలతో జ్యుడీíÙయల్ రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానంలో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో ఇంకా అరెస్టు కావాల్సిన సంఖ్య 19గా పేర్కొన్నారు. ఈ నివేదికలో కేసుకు సంబంధించిన ఆసక్తికర అంశాలను పొందుపరిచారు. బ్యాచులర్ రూములే అడ్డాలు.. ఆన్లైన్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కోసం అనేక ముఠాలు పని చేస్తున్నాయి. వీటిలో గుణ శేఖర్, శ్రావణ్లకు చెందినవి ఉన్నాయి. ఇవి నగరంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న బ్యాచులర్స్ రూములే అడ్డాగా ఈ దందా చేస్తున్నాయి. ఆ యువకులకు గంటల లెక్కన అద్దె చెల్లిస్తూ అక్కడే తాత్కాలిక కంప్యూటర్, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేసుకున్నాయి. గుణ శేఖర్‌కు నగరం నడిబొడ్డున పది రూమ్స్ ఉండగా... శ్రావణ్ గ్యాంగ్‌కు శివార్లలో 13 వరకు ఉన్నాయి. తమతో ఒప్పందం కుదుర్చుకున్న వారిని పరీక్ష రాయడానికి ఇక్కడికే పిలిచే వాళ్లు. ఈ సూత్రధారులు టోఫెల్, జీఆర్ఈ పరీక్షల్లో ఉండే సబ్జెక్టులను అనుగుణంగా ఎక్స్‌పర్ట్స్‌ను ఎంగేజ్ చేసుకున్నారు. ఒక్కో సజ్జెక్టుకు కనీసం ఐదుగురు చొప్పున నిపుణులతో ఒప్పందం చేసుకుని వారితో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశాయి. ‘బయటకు–లోపలకు’ వీటి ద్వారానే.. పరీక్ష జరిగే సమయంలో ఏమాత్రం గందరగోళానికి ఆస్కారం లేకుండా వీళ్లు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే గ్రూపు కాకుండా ఒక్కోదానికి ఒక్కోటి చొప్పున ఏర్పాటు చేసుకున్నారు. గణితం కోసం ‘జోరో జోరో’ పేరుతో, ఫిజిక్స్‌కి ‘దేశీ బాయ్స్’ పేరుతో ఇవి పని చేశాయి. అభ్యర్థి పరీక్ష రాసే గదిలోనే ఈ ముఠాకు చెందిన వ్యక్తి రహస్యంగా దాక్కుని ఉండేవాడు. కెమెరా కంట పడకుండా కూర్చుకుని తెరపై కన్న ప్రశ్న పత్రాన్ని తన సెల్ఫోన్లో ఫొటో తీసేవాడు. ఏ సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రశ్నలను ఆ గ్రూపులో పోస్టు చేసేవాడు. దీని చూసే ఎక్స్పర్ట్స్ తక్షణం స్పందించి సమాధానాలు అదే గ్రూపులో పోస్టు చేయడం, దాన్ని కను సైగలు, వేళ్ల కదలికల ద్వారా పరీక్ష రాసే అభ్యర్థికి ముఠా సభ్యుడు అందించడం నిమిషాల్లో జరిగిపోయేవి. మరికొన్ని ముఠాలు ఉన్నట్లు గుర్తింపు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం మండల శ్రావణ్ కుమార్, మండల సాయి సంతో‹Ù, పి.కిశోర్, ఎ.కిరణ్‌కుమార్‌లను అరెస్టు చేశారు. వీరిలో అమెరికాలో ఉన్న గుణశేఖర్‌తో కలిసి కిషోర్ పని చేయగా.. మిగిలిన ముగ్గురూ మరో విడిగా ముఠా కట్టి మాస్ కాపీయింగ్ కథ నడిపారు. ఇలాంటి గ్యాంగ్స్ తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. వీరిలో జ్యోతిరాదిత్య (వైజాగ్), తేజేందర్ రెడ్డి (గుంటూరు), హైదరాబాద్‌కు చెందిన అభిజిత్ రెడ్డి, బోలిశెట్టి భాను తేజ, వినీత్ రెడ్డి, సూర్య వంశి, మండా విశ్వక్సేన్ రెడ్డి, బడిని రవి కుమార్, సతీ‹Ù, కిక్ బౌస్కీ, సుద్ని సాయి కిరణ్ రెడ్డి, దినే‹Ù, సాయి కిరణ్ రెడ్డి, కిషక్షర్ కుమార్, అభి, యువ, తేజ రెడ్డిలతో పాటు అమెరికాలో ఉన్న గుణ శేఖర్‌ను పరారీలో ఉన్న నిందితులుగా పేర్కొన్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. -
దాగుడు మూతలతో మాస్ కాపీయింగ్
సాక్షి,హిమాయత్‌నగర్: అంతర్జాతీయ విద్యాసంస్థల్లో సీటు పొందేందుకు ఉద్దేశించిన టోఫెల్, జీఆర్ఈ ఆన్లైన్ టెస్టుల్లో ‘దాగుడు మూతల’ పంథాలో మాస్ కాపీయింగ్ చేస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. దాదాపు రెండేళ్లుగా ఈ దందా చేస్తున్న చేస్తున్న నిందితులను డెకాయ్ ఆపరేషన్ ద్వారా పట్టుకున్నట్లు జాయింట్ సీపీ డాక్టర్ గజరావ్ భూపాల్ మంగళవారం తెలిపారు. మండల శ్రావణ్ కుమార్, మండల సాయి సంతోష్ పి.కిశోర్, ఎ.కిరణ్‌కుమార్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సూత్రధారి, ప్రధాన నిందితుడు గుణశేఖర్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నట్లు తెలిపారు. డీసీపీ స్నేహ మెహ్రా, ఏసీపీ కేవీఎం ప్రసాద్, ఇన్స్పెక్టర్లు నవీన్, హరి భూషణ్ రావులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హస్తినాపురం కేంద్రంగా వ్యవహారం... టోఫెల్, జీఆర్ఈ టెస్టుల్లో అధిక స్కోరు వచ్చేలా తాము సహాయ సహకారాలు అందిస్తామంటూ నగరానికి చెందిన గుణశేఖర్ సోషల్ మీడియా ద్వారా కోవిడ్ సీజన్ నుంచి ప్రచారం చేస్తున్నాడు. దీనికి సంబంధించి కొందరు విద్యార్థులు గుణశేఖర్‌ను సంప్రదించగా.. ఒక్కో విద్యార్థి నుంచి రూ.20 వేలు చొప్పున తీసుకున్నాడు. ఇలా దాదాపు ఇతనొక్కడే వంద మంది విద్యార్థులకు మాస్ కాపీయింగ్‌కు సహకరించినట్లు విచారణలో వెల్లడైంది. తమతో ఒప్పందం చేసుకున్న వారికి టెస్టు మరో గంటలో ఉందనగా హస్తినాపురంలోని ఎగ్జామ్ రూమ్ అడ్రస్ చెప్పేవాడు. అక్కడికి వచ్చిన స్టూడెంట్‌తో పాటు తాను ఏర్పాటు చేసిన టెస్టు టేకర్‌ను లోపలికి పంపేవాడు. కెమెరా 360 డిగ్రీస్ తిప్పుతున్న సమయంలో టెస్టు టేకర్ స్టూడెంట్ వెనుక దాక్కునేవాడు. టెస్టు ప్రారంభం అయ్యాక సుమారు 20 నిమిషాల వరకు ప్రశ్నలను టెస్ట్ టేకర్ వాట్సప్ ద్వారా పంపేవాడు. ఆన్సర్స్‌ను తిరిగి అదే వాట్సప్ నంబర్‌కు వచి్చన తర్వాత కనుసైగలు, చేతి వేళ్లతో సమాధానాలు స్టూడెంట్‌కు చెప్పి రాయించే వాడు. రాయ్‌పూర్ ఎన్ఐటీ స్టూడెంట్స్‌తో జవాబులు.. గుణశేఖర్‌కు పరిచయం ఉన్న వైజాగ్‌కు చెందిన ఆదిత్య, నగరానికి చెందిన శ్రావణ్ రాయ్‌పూర్‌లోని ఎన్ఐటీలో చదువుతున్నారు. వీరికి టోఫెల్, జీఆర్ఈలకు సంబంధించిన ఆన్సర్స్ చెప్పడంలో మంచి ప్రతిభ ఉంది. తొలి రోజుల్లో బంధువులకు, స్నేహితులకు సాయం చేయాలని చెప్పి వారి నుంచి ఆన్సర్స్ రాబట్టేవాడు. కొన్నాళ్లకుæ ఇదో దందాగా తెలుసుకున్న వారిద్దరూ గుణశేఖర్‌కు వస్తున్న రూ.20 వేలలో నుంచి కొంత డబ్బును కమీషన్‌గా తీసుకుంటూ ఈ మాస్ కాపీయింగ్‌లో భాగస్వాములయ్యారు. గత ఏడాది డిసెంబర్లో గుణశేఖర్ అమెరికా వెళ్లాడు. అతను వాడే సిమ్‌కార్డును ఇక్కడే ఉంటున్న శ్రావణ్‌కు ఇచ్చాడు. దానికి సంబంధించిన వాట్సాప్‌ను మాత్రం అతడు అక్కడ తన ఫోన్ ద్వారా వాడుతున్నాడు. అక్కడి నుంచే కథ నడుపుతూ... సోషల్ మీడియాలో యాడ్స్ చూసి రెగ్యులర్ కాల్స్ చేసిన వారితో మాట్లాడే శ్రావణ్ అర్ధగంట తర్వాత వాట్సప్ కాల్ చేయమనే వాడు. ఈ కాల్స్‌ను అమెరికాలో ఉన్న గుణశేణర్ ఆన్సర్ చేసే వాడు. విద్యార్థి వివరాలు, ఏ దేశానికి వెళ్లేది, టెస్టుకు సంబంధించిన వివరాలు తీసుకునేవాడు. గుణశేఖర్ చెప్పిన వాటికి ఒప్పుకున్న స్టూడెంట్‌కు టెస్టు రోజున గంట ముందు హస్తినాపురంలోని ఎగ్జామ్ రూమ్ అడ్రస్ చెప్పేవారు. గుణశేఖర్ అమెరికా నుంచి వాట్సప్ ద్వారా మానిటరింగ్ చేస్తుండగా, ఆదిత్య రాయ్‌పూర్ నుంచి ఆన్సర్స్‌ను ఇక్కడ టెస్టు కండక్ట్ చేయించే శ్రావణ్‌కు వాట్సప్ ద్వారా పంపేవాడు. ఇలా 2020 ఏప్రిల్ నుంచి ఈ దందా చేస్తున్నట్లు, వందల మందిని మాస్ కాపీయింగ్ ద్వారా స్కోర్ సాధించి విదేశాలకు పంపినట్లు తేలింది. ఈ కేసులో శ్రావణ్‌తో పాటు టెస్ట్ టేకర్స్‌గా వ్యవహరించి ఇతడికి సహకరించిన కిరణ్, సాయి సంతోష్ కిషోర్‌లను అరెస్టు చేశామని, పరారీలో ఉన్న ఆదిత్య, గుణశేఖర్ కోసం గాలిస్తున్నామని గజరావ్ భూపాల్ తెలిపారు. (చదవండి: జీహెచ్ఎంసీకి పైసా పరేషాన్.. గండం గట్టెక్కేనా?) -
పరీక్షలో ఒకరి స్థానంలో మరొకరు
పెద్దఅంబర్‌పేట : వేర్వేరు ఇంజనీరింగ్ కళాశాలల్లో జరుగుతున్న బీటెక్ పరీక్షల్లో ఒకరికి బదులుగా మరొకరు పరీక్షలు రాస్తూ మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకొని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథ«నం ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన అరుణ్‌కుమార్, ఒడిషాకు చెందిన దుర్గాచరణ్ మిశ్రా దేశ్‌ముఖ్‌లోని సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాలలో చదివారు. అయితే, అరుణ్‌కుమార్‌కు కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో తాజాగా జరుగుతున్న సప్లిమెంటరీ పరీక్షలు అవంతి ఇంజనీరింగ్ కశాశాలలో రాస్తున్నాడు. మంగళవారం జరిగిన పరీక్షకు అరుణ్‌కుమార్ స్థానంలో అతని స్నేహితుడు దుర్గాచరణ్మిశ్రా హాజరయ్యాడు. గమనించిన ఇన్విజిలేర్ అతన్ని ప్రశ్నించగా విషయం బయటపడింది. దీంతో అతడిని పోలీసులకు అప్పగించారు. మరో ఘటనలో ఇద్దరు... బీహార్ రాష్ట్రానికి చెందిన రాహుల్, మహ్మద్‌పాషాబాజ్‌ఖాన్ సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు. అయితే మహ్మద్‌పాషాబాజ్‌ఖాన్ తృతీయ సంవత్సరంలో మూడు సబ్జెక్టులు తప్పాడు. అయితే, అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాయాల్సిన మహ్మద్‌పాషాబాజ్‌ఖాన్ స్థానంలో రాహుల్ వచ్చాడు. అతడిని పట్టుకున్న ఇన్విజిలేటర్లు పోలీసులకు అప్పగించారు. ఈమేరకు వారిపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండుకు తరలించారు. -
'ఆర్ఆర్సీ' మాస్ కాపీయింగ్ కేసులో ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్: ఆర్ఆర్సీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పాల్పడిన ముగ్గురిని స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారి మశ్చేందర్తోపాటు సీనియర్ రైల్వేశాఖ అధికారి రాజశేఖర్‌తో పాటుమరో వ్యక్తిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. రైల్వేశాఖలో గ్రేడ్-1 ఆఫీసర్‌గా పనిచేస్తున్న మశ్చేందర్ 2008, 2010 ఆర్ఆర్బీ, వీఆర్ఓ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీకి విఫలయత్నం చేశాడు. కాగా, ఈ కేసులో మరో రైల్వేశాఖ ఉద్యోగి మహేందర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. గత నెల్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బి) గ్రూప్-బి పరీక్షను హైటెక్ పద్దతిలో మాస్ కాపీయింగ్ చేస్తున్న 34 మందితో కూడిన ముఠాను స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రైల్వే క్వార్టర్స్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఈ ముఠా మానిటరింగ్ చేస్తూ మాస్ కాపీయింగ్ కు పాల్పడింది. అప్పట్నుంచీ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మశ్చేందర్ ను తాజాగా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
ఆర్ఆర్సీ కేసులో పురోగతి