10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలంలో ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని మైసూరివారిపల్లె వద్ద ఎర్రచందనం తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జయప్రసాద్, ఎఫ్డీవోలు రజని, శ్రీనివాసమూర్తి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆటోలో తరలిస్తున్న దుంగలు బయటపడ్డాయి. అటవీ అధికారులను చూసిన డ్రైవర్ పరారయ్యాడు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ రూ. 10 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. పట్టుబడిన ఆటో అబ్బిరాజుగారిపల్లికి చెందినదని అధికారులు చెప్పారు. పరారీలో ఉన్న ఆటో డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.