జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం సుంకేపల్లిలోని జిన్నింగ్ మిల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం మధ్యాహ్నం స్ధానిక లక్ష్మీ జిన్నింగ్ మిల్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో మిల్లులో నిల్వ ఉంచిన పత్తి కాలి బూడిదైంది.
వాహనంలో ఉన్న పత్తిని అన్లోడింగ్ చేస్తుండగా డ్రైవర్ ఒక్కసారిగా ఎక్సెలరేటర్ ఇవ్వడంతో అకస్మాత్తుగా పొగ గొట్టం నుంచి మంటలు చెలరేగాయి. మంటలు పత్తికి అంటుకుని పూర్తిగా వ్యాపించాయి. స్ధానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50 లక్షల విలువైన పత్తి దగ్ధమైనట్టు సమాచారం.