Published
Tue, Dec 8 2015 10:01 AM
| Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని సిద్ధార్థ నగర్ లో ఓ ఇంట్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. దీంతో మంటలు చుట్టు వ్యాపించడంతో 20 పూరిళ్లు దగ్థమయ్యాయి. స్తానికుల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.