Rs 13
-
బై బ్యాక్‌కు ఇన్ఫోసిస్ బోర్డు గ్రీన్ సిగ్నల్
ముంబై:దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ రూ.13 వేల కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు(బైబ్యాక్) చేయనుంది. ఈ మేరకు శనివారం జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇన్ఫోసిస్ బై బ్యాక్ ఆఫర్ ద్వారా రూ.13వేల కోట్ల విలువైన షేర్లను బై బ్యాక్ చేయనుంది. ఇన్ఫోసిస్ ఆ ఆఫర్ ను ఈక్విటీ ధర రూ. 1150 గా నిర్ణయించింది. తద్వారా ఇన్ఫోసిస్ 24.5శాతం ప్రీమియం ధరలో , 11.3 కోట్ల షేర్లను లేదా 4.92శాతం ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. ముఖ్యంగా సీఈవోగా విశాల్ సిక్కా రాజీనామా తరువాత ఇన్ఫోసిస్ బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. షేరు రూ.1,150 వద్ద టెండర్ మార్గం ద్వారా 11,30,43,478 కోట్ల షేర్లు కొనుగోలు చేస్తామని ఇన్ఫోసిస్ బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొంది .దీనికోసం బోర్డు ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. కాగా 36 ఏండ్ల చరిత్ర కలిగిన సంస్థ తొలిసారిగా బైబ్యాక్ చేయనున్నది. సంస్థ వద్ద అధికంగా నిధులు ఉండటంతో డివిడెండ్ లేదా బైబ్యాక్ చేయాలని కంపెనీ వ్యవస్థాపకులు, మాజీ ఎగ్జిక్యూటివ్ అధికారులు తీవ్ర ఒత్తిడిన నేపథ్యంలో చివరకు బోర్డు ఈ నిర్ణయానికి వచ్చింది. మరోవైపు ఇన్ఫోసిస్ షేరు శుక్రవారం నాటి మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే ఇది 24.5 శాతం అధికం. -
13 వేల కోట్ల నల్లధనం వెలికితీత
న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో అక్రంగా దాచుకున్న రూ. 13 వేల కోట్ల మొత్తాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వెలికితీశారు. పన్నులు ఎగవేసి అక్రమంగా దాచుకున్నఈ నల్లడబ్బుల వివరాలను ఆదాయ పన్ను శాఖ అందించింది. ఇది కేవలం 2011, 2013లలో అందుకున్న రెండు సమాచారాలను బట్టే ఇంత భారీ మొత్తాన్ని వెలికితీయగలిగినట్టు వెల్లడించింది. జెనీవాలోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో 400 మంది భారతీయులు అక్రమంగా దాచుకున్న రూ. 8186 కోట్లను ఐటీ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది మార్చి 31 వరకు ఆ మొత్తంపై రూ.5377 కోట్ల పన్ను కట్టాలని ఐటి ఎసెస్ కమిటీ అంచనాలు చెబుతున్నాయి. గతేడాది హెచ్ఎస్బీసీ నుంచి 623 మంది భారతీయుల అకౌంట్స్ వివరాలను ప్రభుత్వం అందుకుంది. అందులో 213 మంది ఖాతాలు నాన్ యాక్టివ్ గా ఉన్నట్టు గుర్తించింది. డబ్బులు లేకపోవడం లేదా. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఖాతాలు అయి ఉండొచ్చని భావించింది. 398 మంది అకౌంట్స్ ను మాత్రం గుర్తించగలిగామని, వాటిలో ఇంత భారీ మొత్తం ఉన్నట్టు ఐటీ శాఖ నివేదిక వెల్లడించింది కాగా 2013లో ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జరనలిస్ట్ (ఐసీఐజె) వెబ్సైట్లో మరో 700 మంది భారీతీయులు అక్రమంగా 5 వేల కోట్లు దాచుకున్నారన్న సమాచారం కూడా లభించింది. వీరిలో ఇప్పటివరకు 55 మందిపై ఐటీ శాఖ కేసులు నమోదు చేయగా, హెచ్ఎస్బీసీ కేసులో 75 మందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. -
మైక్రో ఎస్డీ స్లాట్ లేకుండా లెనోవో జుక్ జడ్1
న్యూఢిల్లీ : చైనీస్ బహుళ జాతి కంపెనీ లెనోవా, తన కొత్త మోడల్ లెనోవా జుక్ జడ్1 ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.13,499గా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతానికి కేవలం అమెజాన్‌లో మాత్రమే లభ్యమవుతుంది. మే 19 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు చేపడతామని, మంగళవారం మధ్యాహ్నం 1.30 నిమిషాల నుంచి రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తామని కంపెనీ తెలిపింది. జుక్ బ్రాండ్ నుంచి వచ్చిన స్మార్ట్ ఫోన్లలో లెనోవా జడ్1 మొదటిది. క్యానోజెన్ ఓఎస్‌తో వస్తున్న మొదటి మోడల్ ఇదేనని కంపెనీ ప్రకటించింది. క్యానోజెన్ ఓఎస్ 12.1తో ఈ డివైజ్ పనిచేస్తుందని పేర్కొంది. లెనోవో జుక్ జడ్1 ప్రత్యేకతలు... 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 801 ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ డ్యూయల్ సిమ్ 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 13 మెగా పిక్సెల్ వెనుక కెమెరా, 5 మెగా పిక్సెల్ ముందు కెమెరా 360 డిగ్రీల గుర్తింపుతో ఫింగర్ ప్రింట్ స్కానర్ కానీ ఈ ఫోన్లో మైక్రో ఎస్డీ కార్డుతో స్టోరేజ్ ను పెంచుకోవడానికి అవకాశం లేదు. అసలు మైక్రో ఎస్డీ స్లాట్‌ను ఈ ఫోన్లో ఏర్పాటు చేయలేదు.