ముంబై:దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ రూ.13 వేల కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు(బైబ్యాక్) చేయనుంది. ఈ మేరకు శనివారం జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇన్ఫోసిస్ బై బ్యాక్ ఆఫర్ ద్వారా రూ.13వేల కోట్ల విలువైన షేర్లను బై బ్యాక్ చేయనుంది. ఇన్ఫోసిస్ ఆ ఆఫర్ ను ఈక్విటీ ధర రూ. 1150 గా నిర్ణయించింది. తద్వారా ఇన్ఫోసిస్ 24.5శాతం ప్రీమియం ధరలో , 11.3 కోట్ల షేర్లను లేదా 4.92శాతం ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది.
ముఖ్యంగా సీఈవోగా విశాల్ సిక్కా రాజీనామా తరువాత ఇన్ఫోసిస్ బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. షేరు రూ.1,150 వద్ద టెండర్ మార్గం ద్వారా 11,30,43,478 కోట్ల షేర్లు కొనుగోలు చేస్తామని ఇన్ఫోసిస్ బీఎస్‌ఈ ఫైలింగ్ లో పేర్కొంది .దీనికోసం బోర్డు ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది.
కాగా 36 ఏండ్ల చరిత్ర కలిగిన సంస్థ తొలిసారిగా బైబ్యాక్ చేయనున్నది. సంస్థ వద్ద అధికంగా నిధులు ఉండటంతో డివిడెండ్ లేదా బైబ్యాక్ చేయాలని కంపెనీ వ్యవస్థాపకులు, మాజీ ఎగ్జిక్యూటివ్ అధికారులు తీవ్ర ఒత్తిడిన నేపథ్యంలో చివరకు బోర్డు ఈ నిర్ణయానికి వచ్చింది. మరోవైపు ఇన్ఫోసిస్ షేరు శుక్రవారం నాటి మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే ఇది 24.5 శాతం అధికం.
బై బ్యాక్‌కు ఇన్ఫోసిస్ బోర్డు గ్రీన్ సిగ్నల్
Published Sat, Aug 19 2017 11:38 AM | Last Updated on Tue, Sep 12 2017 12:30 AM
Advertisement
Advertisement