మైక్రో ఎస్‌డీ స్లాట్ లేకుండా లెనోవో జుక్ జడ్1
న్యూఢిల్లీ : చైనీస్ బహుళ జాతి కంపెనీ లెనోవా, తన కొత్త మోడల్ లెనోవా జుక్ జడ్1 ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.13,499గా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతానికి కేవలం అమెజాన్‌లో మాత్రమే లభ్యమవుతుంది. మే 19 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు చేపడతామని, మంగళవారం మధ్యాహ్నం 1.30 నిమిషాల నుంచి రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తామని కంపెనీ తెలిపింది. జుక్ బ్రాండ్ నుంచి వచ్చిన స్మార్ట్ ఫోన్లలో లెనోవా జడ్1 మొదటిది. క్యానోజెన్ ఓఎస్‌తో వస్తున్న మొదటి మోడల్ ఇదేనని కంపెనీ ప్రకటించింది. క్యానోజెన్ ఓఎస్ 12.1తో ఈ డివైజ్ పనిచేస్తుందని పేర్కొంది.
లెనోవో జుక్ జడ్1 ప్రత్యేకతలు...
5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 801 ప్రాసెసర్
3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్
డ్యూయల్ సిమ్
4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
13 మెగా పిక్సెల్ వెనుక కెమెరా, 5 మెగా పిక్సెల్ ముందు కెమెరా
360 డిగ్రీల గుర్తింపుతో ఫింగర్ ప్రింట్ స్కానర్
కానీ ఈ ఫోన్‌లో మైక్రో ఎస్‌డీ కార్డుతో స్టోరేజ్ ను పెంచుకోవడానికి అవకాశం లేదు. అసలు మైక్రో ఎస్‌డీ స్లాట్‌ను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేయలేదు.