పేకాట స్థావరంపై పోలీసుల దాడి
కర్నూలు : కర్నూలు జిల్లా, బేతంచర్లలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. వివరాలు.. బేతంచర్ల మండల కేంద్రంలో గురువారం అర్థరాత్రి ఒక పరిశ్రమలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వారు స్థావరంపై దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఐదు సెల్ఫోన్లు, రూ.2.06లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(బేతంచర్ల)