పాలపై లీటరుకు రూ. 2 వడ్డింపు
సాక్షి, హైదరాబాద్: మరో రెండు రోజుల్లో ‘ఏపీ డెయిరీ’ పాల విక్రయ ధరను లీటరుకు రూ.2 పెంచనున్నట్లు సమాచారం. ఏపీ డెయిరీ రోజుకు దాదాపు 4.5 లక్షల లీటర్ల పాలు విక్రయిస్తోంది. హైదరాబాద్లోనే 3.75 లక్షల లీటర్ల పాలను అమ్ముతోంది. లీటరుకు రెండు రూపాయల చొప్పున రోజుకు రూ.9 లక్షలు, నెలకు రూ.27 కోట్ల భారం వినియోగదారులపై మోపేందుకు ఏపీ డెయిరీ రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కాగా పాల సేకరణ ధరను పెంచుతున్నట్లు ఏపీ డెయిరీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.